గీర్వాణ కవుల కవితా గీర్వాణం-౩
451-శ్రీ కందుకూరి రామారావు
హిమాలయ వర్ణనం ‘’కావ్యం రాసిన శ్రీ కందుకూరి రామారావు సంస్కృత రచనలో సిద్ధ హస్తులు .ఇందులో ఒక శ్లోకం
‘’బభౌ స హిమవాన్ రాజా ,కాంచీ భూత మహార్నవః –ఆవ రోహణ సుస్తంభః సూర్య లోక సుధర్వణః’’
452-శ్రీ వడ్లమాని లక్ష్మే నరసింహ శాస్త్రి
రైల్ యాత్ర ‘’మొదలైన ఖండకావ్య నిర్మాత శ్రీ నరసింహ శాస్త్రి .ఉదాహరణగా ఒక శ్లోకం
‘’మయా క్రుతమిదం గ్రంధం తీర్ధ యాత్రా విరాజితం –శృణు త్వం సావదానేన శ్యామలే లలితాంబికే ‘’
45౩-శ్రీ వేదుల సూర్య నారాయణ శాస్త్రి
శ్రీపతి చరితం ను గొప్ప కవితా ధారగా రాసిన శ్రీ శాస్త్రిగారు బహు గ్రంధ కర్త .ఒక శ్లోకం –
‘’కాన్తానాం సదనం సుధాంశు సదనం చేస్టం సురాన్న ప్రపా –వక్షోజై సుమ కందు కౌ సునయనే నిర్నిద్ర నీలోత్పలం ‘’అని గొప్ప అలంకార యుతం గా రాశారు .మరొకటి –‘’దంతా మౌక్తిక తల్లజా ఇతిజానా భ్రామ్యంతి మొహాటవీ –మధ్యే త్వ క్సురాణి మిషా స్తినికరం సర్వం చ త్వంఘ్రీపతే ‘’
454-శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి(1888)
వెంకమాంబ ,శ్రీ రామావదానులకు చిన కడియం లో 20-2-1888న జన్మించారు .శ్రీ చర్ల బ్రహ్మయ్య శాస్త్రిగారి వద్ద వ్యాకరణం నేర్చారు . స్వయం కృషితో ఉభయ భాషా ప్రవీణులైనారు .అమలాపురం హైస్కూల్ లో నాలుగేళ్ళు మేస్టే రీ చేసి ,ఆంద్ర సాహిత్య పరిషత్ వ్యవహర్తాగా ఒక ఏడాదిపని చేసి అనంతపురం కాలేజి లెక్చరర్ గా మూడేళ్ళు సేవ చేశారు .వెంకట గిరి రాజావారి ఆస్థాన కవి పదవి అలంకరించారు .సంస్కృత వాజ్మయ చరిత్ర రెండుభాగాలుగా రాశారు ఆంద్ర భాషాను శాసనం ,దశ రూపకాలు ,ప్రేమ తత్త్వం ,ఉత్తర రామ చరిత్ర బీష్మ ప్రతిజ్ఞ నాటకం ఆంద్ర భవిష్య పర్వం ,విక్రమోర్వశీయం మొదలైన 17గ్రంధాలు రాశారు .
సంస్కృతం లో ‘’బ్రహ్మ సూత్రార్ధ దీపిక ,రక్షోనంతర వివాహం ,సంస్కృతభాషా గ్రంధాలు రచించారు . ,శాస్త్ర్రి గారు ‘’ఉపాధ్యాయ పండిత పరిషత్ ‘’ను స్థాపించారు ఈ నాటికీ దిగ్విజయం గా కోన సాగుతోంది . చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి వద్ద వ్యాకరణం,సంస్కృత సాహిత్యం నేర్చారు .సంస్కృతం లో రాసిన ‘’సూర్యాష్టకం ‘’ప్రసిద్ధి చెందింది .’సంస్కృత సాహిత్య చరితం ‘’రాశారు సూర్యాష్టకం లో సూర్యునికున్న వైదికపర్యాయ పద విచారణ చేశారు .ఆరామ ,భ్రాజ ,పటర ,పతంగ,స్వర్ణర జ్యోతిష్మాన్ ,విభాస,కాశ్యప మొదలైన పదాలకు చక్కని వివరణ నిచ్చారు . ‘’తన్మే రుమార్గాని హతిక రద రా తలస్య –సందీపన ప్రవణాది దీధితి దివ్య మోమూర్తిః-అఖ్యోయ సంస్థితి మగోచర కాలకర్మ విజ్ఞా పాకం –పటర మూర్జదుహం నమామి ‘
455-శ్రీ మహీధర వెంకట రామ శాస్త్రి (1909
అమలాపురం తాలూకా ముంగండ లో 1909లో జన్మించారు . ‘దాక్షారామం అమలాపురం లలో పని చేశారు .సంస్కృతం లో రాసిన వాటిలో ‘’సరోజినీ సౌరభం ‘’నాటకం ప్రసిద్ధి చెందింది .’’మానస రాసకేలీ శాంతి ‘’కావ్యం ,దహర చంద్రికా తాత్వికం ,భారతాంబా సుప్రభాతం ,దేశ భక్తీ గీతం ,మణి మజీరం ,వకుళాభరణం ఖండకావ్యాలు రాశారు
456-శ్రీ కొత్త పల్లి ఘనశ్యామల రావు
రావు గారు అనేక గీర్వాణ లఘు కవితలు రాశారు .అందులో ‘’భారత ప్రశస్తి ,శ్రీమాతం ‘’కొన్ని మాత్రమె . , ‘
శ్రీ రాణి సదాశివ మూర్తి ‘’జగన్నాధ సుప్రభాతం శారదా స్తవ మంజరీయం ,ఋతు సందేశం ,వాస్తు పురుష అ స్టోత్తరం చాక్షుష యుగ్మం ,అగ్నిపిత్రకావ్య రచన చేశారు .శ్రీ ఖండవల్లి సూర్య నారాయణ శాస్త్రి ;;కాళిదాసకవితా సౌరభం ‘’రాశారు .శ్రీ పుల్య ఉమామహేశ్వర శాస్త్రి కంసవధం ,శ్రీ పిసుపాటి విశ్వేశ్వర శాస్త్రి ‘’ఆర్యా శతకం ‘’,మహీధర వెంకట రామ శాస్త్రి ;;కళ్యాణ మైత్రీ ‘’,యారం సూరి మల్లికార్జున’’ రాయ కళాపూర్ణోదయ సంస్కృత గద్య రచన ‘’చేశారు .
వీరితో తూ గో జి కవులు పూర్తీ .తర్వాత విశాఖ విజయ నగర సందర్శన .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-9-15-కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్ ,

