గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3
విశాఖ పట్నం జిల్లా-స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –ప్రొఫెసర్ ఏం వి.రమణ
457-శ్రీ భాష్యం అప్పలాచార్యులు
శ్రీనివాసాచార్యులు ,తిరు వెంగమాంబ ల తనయుడు శ్రీ అప్పలాచార్య 6-4-1922న విశాఖ పట్నం జిల్ల్లా పద్మనాభం గ్రామం లో జన్మించారు .ఈ కుటుంబం లో వ్యాసమహర్షి బ్రహ్మ సూత్రాలకు రామానుజుల శ్రీభాష్యం పై గొప్ప వ్యాఖ్యానం చెప్పగలిగే వారు ఉండటం చేత అదే ఇంటి పేరు అయింది .రామానుజాచార్య శిష్య పరమపరకు చెందినవారు .అప్పలాచార్య రామాయణం పై తత్వా దీపిక వ్యాఖ్యానం రాశారు .దీనికీ తిరుమల శ్రీనివాసునికి సంబంధం గూర్చి చర్చ చేసి తన ఉపన్యాసాలను ‘’ఏడు కొండలు-ఏడు కాండలు ‘’పేరిట చెప్పేవారు .రాముడికి ఆరు కాన్దలవరకు తాను దైవం అనే స్పృహ లేదని ఎదవా కాండలో మాత్రమె తానూ నారాయణ స్వరూపం అని గ్రహించాడని చెప్పారు .అందుకే ఎదవా కొండ నారాయనాద్రిపై బాలాజీ ఉన్నాడని అంటారు .2003లో విశఖ వాసులు శిష్యులు ఆచార్యుల సహస్ర చాన్ద్రమాసోత్సవం ఘనంగా నిర్వహించారు .వీరి జీవిత చరిత్రను ‘’ప్రవచన శిరోమణి ‘’గా శిష్యుడు చిత్రకవి ఆత్రేయ రాస్శారు .1992లో రాజాలక్ష్మీ ఫౌండేషన్ పురస్కారం పొందారు .
458-సద్గురు కందుకూరి శివానంద మూర్తి
కందుకూరి శివానంద మూర్తి మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. భారతదేశం లోనూ,విదేశాల్లోనూ ఆయనకు ఎంతో మంది శిష్యులు, అభిమానులు ఉన్నారు. విశాఖపట్నంలోని భీమునిపట్నంలో ఆనందవనం పేరిట ఉన్న ఆశ్రమంలో నివసిస్తున్నారు. సంప్రదాయం, సంస్కృతి అంశాల మీద ఎన్నో పుస్తకాలు రచించారు.
ఆయన తల్లిదండ్రులు సర్వమంగళ, వీరబసవరాజులు శివభక్తులు, దాదాపు 200 శివాలయాలను నిర్మించారు. చిన్నతనం నుండి శివానందమూర్తి ఆధ్యాత్మిక విషయాల పట్ల, ముఖ్యంగా యోగశాస్త్రం పట్ల ఎంతో ఆసక్తి కనబర్చేవారు. 1949 లో సైన్సు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సభ ఆర్డినేట్ సర్వీస్ లో చేరారు. పోలీసు డిపార్టుమెంటులో హన్మకొండలో పని చేస్తున్నప్పుడు కూడా ఆర్తులకు, పేదవారిక సేవచేయడం పట్ల, హిందు ధర్మ బోధన పట్ల ఎక్కువ సమయం వెచ్చించే వారు. ఆఫీసరుగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి సేవాకార్యక్రమాల పట్ల, సాంస్కృతిక సేవ పట్ల దృష్టి సారించారు.
సమున్నతమైన భారతదేశం, సనాతన ధర్మంల వేళ్లూనుకున్న ప్రాచీన సంస్కృతి పట్ల ఆయనకు అమితప్రేమ. సన్యాసులతో సహా అందరూ ప్రజాసంక్షేమానికి ట్రస్టీలుగా, సంరక్షకలుగా తమ వంతు కర్తవ్యం నిర్వర్తించాలని తన ప్రసంగాల్లో తరుచూ చెబుతుంటారు. హిందు ధర్మం, దాని చరిత్ర, సంగీత సాహిత్యాలు, నాట్యనాటకాల విషయాల్లో ఆయన ఒక విజ్ఞాన సర్వస్వం.
‘’సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ,లలితకళలు విజ్ఞానం సాంకేతికం వైద్యం జర్నలిజం మానవ శాస్త్రాలు మొదలైనవాటిపై ప్రసిద్దుల చేత ఉపన్యాసాలిప్పించి సత్కరిస్తారు .రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డ ,తెలుగు విశ్వ విద్యాలయ డాక్టరేట్ అందుకొన్నారు .87 సంవత్సరాల సార్ధక జీవితం గడపి 10-6-2015 శివైక్యం చెందారు .
సైన్స్ ఆఫ్ ప్రాణాయామం ,సివనండా కంపానియన్ టుయోగ ,లార్డ్ కృష్ణ హిస్ లీలా అండ్ టీచిన్గ్స్ ‘’మొదలైన గ్రంధాలు రాశారు .శివపురి కీర్తనలు చేశారు .
459-శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ
సామవేదం షణ్ముఖశర్మ ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, కవి మరియు సినీ గేయ రచయిత. ఋషిపీఠం అనే పత్రికకు సంపాదకుడు.
షణ్ముఖశర్మ 1967లో ఒడిషా – ఆంధ్రప్రదేశ్ సరిహద్దుపైన ఉన్న గంజాం జిల్లా, అస్క గ్రామంలో,పండిత కుటుంబంలో పుట్టి పెరిగాడు.[1] బెర్హంపూర్ విశ్వవిద్యాలయంలో ఆర్ధిక శాస్త్రంలో హానర్స్ డిగ్రీ పొంది సాహితీ పిపాసను తీర్చుకోవటానికై ఉపాధిని వెతుక్కుంటూ విజయవాడ చేరాడు. 1988లో స్వాతి వారపత్రికలో ఉపసంపాదకుడిగా చేరి అక్కడ ఏడేళ్ల పాటు పనిచేశాడు. తన గీతరచనా నైపుణ్యానికి విజయవాడలోని స్వాతి కార్యాలయంలో పునాది పడిందని శర్మ చెప్పుకున్నాడు.[2] స్వాతి పత్రిక సంపాదకబృందంలో పనిచేసి సంపాదించిన అనుభవం ఋషిపీఠం అనే ఆధ్యాత్మిక పత్రిక యొక్క స్థాపనలో సహకరించింది. ఋషీపీఠాన్ని గుంటూరులో ప్రసాదరాయ కులపతి (ఇప్పుడు సిద్ధేశ్వరానంద భారతిగా పేరుబడ్డారు) వంటి పండితుల సమక్షంలో ప్రారంభించాడు.
శర్మ తొలుత భక్తిగీతాలు వ్రాయడంతో గీతరచనను ప్రారంభించాడు. ఈయన వ్రాసిన భక్తిగీతాలను నేపథ్యగాయకుడు ఎస్.పీ.బాలసుబ్రమణ్యంసహాయంతో ఒక ఆడియో ఆల్బంను కూడా విడుదల చేశాడు. ఆ ఆల్బం బాగా విజయవంతమవడంతో చెన్నైలోని సినీ రంగంలో కూడా గీతరచనా అవకాశాలు వచ్చాయి.[3] కొంతకాలం పాటు సినీరంగంలో పాటలు వ్రాసిన తర్వాత ఆధ్యాత్మిక ఉపన్యాసాలను వ్రాయటం వాటిపై సభలలో ఉపన్యాసాలు ఇవ్వటమనే మరో ఉన్నత శిఖరంవైపు దృష్టి మరల్చాడు.
పురస్కారాలు
- కౌథ పూర్ణానందం స్మారక పురస్కారం
- బ్రహ్మ తత్వార్థ నిధి (2008)
- సమైక్య భారత గౌరవ సత్కారం(2003)
- శ్రీ భారఈ పురస్కారం(2002)
- వేదిక సేవా ట్రస్ట్-ఉగాది పురస్కారం(2005)
- వేదాంత శిరోమణి(2007)
- వేద విద్యా విశారద(2012)
- కచ్చపి తంత్రి విశారద
- ధర్మ దర్శన దర్పనః(2003)
- సమన్వయ సరస్వథి(2005)
- బాదం సరోజినీ దేవి స్మారక పురస్కారం(2008)
- శ్రీమతి ద్వాదశి లక్ష్మి ప్రసన్న స్మారక పురస్కారం(2009)
- సాహితీ పురస్కారం(2008)’
- వ్యాఖ్యాన వాచస్పతి(2005)
- సమన్వయ సామ్రాట్(2006)
- వెద విజ్ఞాన భాస్కరుడు92008)
- అర్ష ధర్మోపన్యాస కేశరి(2005)
- వాగ్దేవి వరపుత్ర(2006)
- వాగ్దేవీ పుత్ర
- విద్యా వాచస్పతి(2010)
- అద్వైత భాస్కర(2010)
- అభినవ షన్మత స్థాపనాచార్య(2010)
- వేదాంత విద్యా నిధిః(2010)
- సర్వ శాస్త్ర సమన్వయ శిరోమణి(2010)
460-శ్రీ చర్ల గణపతి శాస్త్రి
వేదం వేదంగా శాస్త ఉపనిషత్ లలో నిష్ణాతులు శ్రీ చర్ల గణపతి శాస్త్రి .బహుగ్రంధ కర్త ‘’వైశేషిక మీమాంసా దర్శనం ,గగాంధర్వ వేదం సంగీత రత్నాకరం ,హరిహర మహిమా స్తోత్రం ,గౌడ పాదీయకారిక ,వేదం విజ్ఞానం ,మొదలైనవి శాస్త్రిగారి రచనలు .
కాకరపర్రు, పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలానికి చెందిన గ్రామము.[1]. పాలకొల్లు మరియు నిడదవోలు ప్రధాన రహదారిపై పెరవలికి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రశాంతమైన గ్రామము. ఊరిలో ప్రధానంగా బ్రాహ్మణులకు ప్రాధాన్యం కలదు. ఈ గ్రామం ఒకప్పుడు అగ్రహారం. రాణి రుద్రమదేవి ద్రాక్షారామ సందర్సన సమయములో బ్రాహ్మణులు కొంతమంది వారికి గోదావరి తీర ప్రాంతమునందు ఒక స్థానము కల్పించమని కోరిన వెంటనే రాణి వారికి ఈ గ్రామము ను ఏర్పాటు చేసెను.గోదావరి తీరప్రాంత గ్రామము అయినందున వరి పంట అత్యధికంగా పండించువారు కలరు. మలిపంటగా పసుపు, కంద పండిస్తారు. ఇవేకాక పూలతోటలు, కూరగాయలతోటలు కూడా కలవు.
- ప్రముఖ కవి, వచనకర్త అయినఉషశ్రీ అసలు పేరు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు (1928 – 1990) యొక్క జన్మస్థలం.
- ప్రముఖ వేద పండితులు, ప్రాచీన గ్రంథ అనువాదకులైనచర్ల గణపతిశాస్త్రి మరియు వీరి తండ్రి సంస్కృతాంధ్ర పండితుడు, విమర్శకుడు అయిన చర్ల నారాయణ శాస్త్రి గార్ల జన్మస్థలం.
వీరుకాక శ్రీ అప్పల సోమేశ్వర శర్మ ,శ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శర్మ ,శ్రీ పేరాల భారత శర్మ ,శ్రీ జి వి ఎస్ సుబ్రహ్మణ్య శర్మ శ్రీ వాసా సుబ్రహ్మణ్య శాస్త్రి ,శ్రీ వేలూరి సుబ్బారావు కూడా గీర్వాణ రచన చేశారు .
విశాఖ కవులు పూర్తీ –విజయనగరం చేరుదాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-9-15-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

