గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
383-శ్రీ కృష్ణ కంఠాభరణ మహాకావ్య నిర్మాత-గలగరి పండరీనాథాచార్య (1922-2015)
గలగరి పండరీనాథాచార్య 22-7-1922 న కర్ణాటకలోని గలగరి అనే కుగ్రామం లో జన్మించాడు . తండ్రి కూర్మా చార్యులు . చిన్నతనం లో చదువు ఒకటవ తరగతి తో ఆగిపోయింది .వెంటనే వేదాధ్యనం తండ్రివద్ద ప్రారంభించాడు . 1944 నుంచి 1960 వరకు బాగల్ కోట్ లోని శంకరప్ప సంస్కృత హై స్కూల్ లో సంస్కృత ఉపాధ్యాయ్డుగా పని చేశాడు . 1961లో గడగ్ వెళ్లి వీరనారాయణ సంస్కృత పాఠశాల ప్రారంభించాడు . 1971లో వేద సాహిత్య మాల సంస్థ స్థాపించి అష్టాదశ మహా పురాణాలను నలభయి ఏళ్ళు కృషి చేసి కన్నడం లోకి అనువదించాడు .మధురవాణి ,వైజయంతి సంస్కృత పత్రికలకు ,శ్రీ సుధా ,పంచామృత కన్నడ పత్రికలకు సంపాదకుడిగా ఉన్నాడు . ఆయన సంస్కృత వచన రచన శైలి బాణభట్టును పోలి ఉంటుంది .కవిత్వ శై లి కాళిదాసుకు సమానం గా ఉంటుంది . సృజన సాహిత్యం లో ఆయన అందరికంటే ఉన్నత స్థాయిలో ఉన్నాడు అన్ని ప్రక్రియలూ స్పృశించాడు .సంస్కృతం లో 22 సృజన రచనలు చేశాడు . అవి వేదాంత తుండ స్తవం ,రామరసాయన మహాకావ్యం ,శ్రీ కృష్ణ కంఠాభరణ మహాకావ్యం ,పవన పావన చంపు ,శ్రీ పాండురంగ విఠల చంపు ,శ్రీ రాఘవేంద్ర అశ్వ ధాటి ,తాత్యా తోపితా హ గాంధీ టోపీ పర్యంతం ,విప్లవ వీరుడు సుభాష చంద్ర బోసు పై ‘’క్రాంతి స్ఫు లింగ మొదలైనవి . కన్నడం లో రాసిన 21 రచనలలో -మహా భారత కోశ ,రాగ విరాగ ,భామతి ,కర్ణాటక కోశకారు ,కల్హణ రాజ తరంగిణి మొదలైనవి ఉన్నాయి .ఇవికాక ముందే చెప్పినట్లు 18 పురాణాలనకు కన్నడా నువాదం చేశాడు .
పండరీనాధాచార్యులు తన ప్రతిభకు తగిన పురస్కారాలు ఎన్నో అందుకొన్నాడు .అందులో సాహిత్య అకాడెమి పురస్కారం ,రామకృష్ణ దాల్మియా ,రాష్ట్రపతి అవార్డు ,కన్నడ కాళిదాస బిరుదు ,రాజ్య ప్రశస్తి ,మహామహోపాధ్యాయ ,విద్వత్కవి తిలక ,సచ్చాస్త్ర ప్రవచన విచక్షణ ,సంస్కృతివాహక ,విద్యా రాజా మొదలైనవి ఎన్నో బిరుదులూ ,పురస్కారాలు అందుకొన్న మహా సంస్కృత విద్వా0సుడు గలగరి పండరినాధ ఆచార్య .. సాహిత్య వ్యాసంగం తో పండిపోయిన పండరినాథాచార్య 93 వ ఏటపండిన వయసులో 29-8-2015 లో పండరినాధుని చేరుకొన్నాడు ..
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

