గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
384-కుంభాభిషేక చంపు కర్త-కడూర్ కృష్ణ జాయిస్ (1912
1-8-1912 న కడూర్ కృష్ణ జాయిస్ కర్ణాటక శృంగేరిలో శేషమ్మ ,సుబ్బా జాయిస్ దంపతులకు జన్మించాడు .అలంకార ,అద్వైతాలలో విద్వాన్ డిగ్రీ పొంది హోల్ నరసాపూర్ ,ఆధ్యాత్మ ప్రకాశం కార్యాలయం లో పని చేశాడు .తర్వాత బెంగుళూర్ శృంగేరి శంకర మఠం లోఆధ్యాత్మ వేదాంత ప్రొఫెసర్ అయ్యాడు .కన్నడ సంస్కృతాలలో విశేష పాండిత్యం పొంది ఆ రెండుభాషల పత్రికాధిపత్య0వహించాడు . శృంగేరి స్వాములు పండితవర బిరుదు నిచ్చి సత్కరించారు .సంస్కృతం లో కృషికి రాష్ట్ర పతి ప్రశంసాపత్రం ,కన్నడ సేవకు రాష్ట్ర అవార్డు అందుకున్నాడు .సంస్కృతం లో కుంభాభిషేక చంపు ,శారదన్నవరాత్ర చంపు ,మూల విద్యా భాష్య వార్తిక సమ్మతం ,శంకర దర్శనామ ప్రకాశం ,రాశాడు .సంస్కృత దశ శ్లోకి కి సంపాదకత్వం వహించాడు .కన్నడం లో సంబంధ వార్తిక ,ధర్మ శాస్త్ర రాశాడు .దశ శ్లోకిని ,వివేకచూడామణిని చంద్ర శేఖర భారతీతీర్థ వ్హయాఖ్యానం తో సహా కన్నడాను వాదం చేశాడు .శారదా నవ రాత్రి చంపు ను 1976 లో ముద్రించాడు అందులో శారదా అభిషేక ఉత్సవం ,నవరాత్రి ఉత్సవాలను వర్ణించాడు .ఆధునిక సంస్కృత కవులలో చంపు కు మళ్ళీ వైభవం తెచ్చినవాడు కృష్ణ జాయిస్
385-గాంధీ పై మోహనాయన కావ్యం రాసిన -బొమ్మలాపుర వెంకట రామ భట్ట (1915
బొమ్మలాపుర వెంకట రామభట్ట కర్ణాటక లోని బొమ్మలాపురం లో 1-1-1915 న జన్మించాడు .సరోబాలో సంస్కృత టీచర్ .సంస్కృత కన్నడ హిందీలలో కవిత్వం చెప్పాడు రాశాడు .సంస్కృతం లో మహాత్మాగాంధీ జీవితంపై ‘’మోహన యాన0 ‘’కావ్య0 ,శంకర చరితం ,భామినీ మాధవ కావ్యం ,సతీ మహా స్వేత ,విశ్వ రూప దర్శనం ,సత్యవిషయం నాటకాలు ,అంగద సంవాదం ,ఏకం నా ద్వితీయం ,నాధయ సంస్కృత భేరి ,భార్గవ శతకం ,యాజ్ఞ వల్క్య బోధాయన ,భువనేశ్వరీ సుప్రభాతాలు ,శంకరాలోకం భావతరంగిణి సంస్కృత వచన రచనలు ,సత్యనీయ రీతి అనే స్వీయ చరిత్ర ,మంత్రం వేదాంత శాస్త్రాలనాధారంగా వెయ్యిఆర్యా వృత్త శ్లోకాల ‘’ఆర్యా సహస్రి ‘’ రాశాడు .
సంస్కృత కావ్యాలను కన్నడం లోకి కన్నడ రచనలు సంస్కృతం లోకి అనువదించి ప్రజ్ఞ ఆయనది .కన్నడ సంస్కృత నిఘంటు నిర్మాణము చేశాడు .కన్నడ భాషకే ప్రత్యేకమైన షట్పది ని సంస్కృతం లో ప్రవేశపెట్టిన ఘనత వెంకట రామ భట్టు ది .మోహనయానం లో భామినీ షట్పది ని నేర్పుగా ప్రయోగించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

