గీర్వాణ కవుల కవిత గీర్వాణం -3
388-సుధాపరిమళ వ్యాఖ్య కర్త -శ్రీ రాఘవేంద్ర స్వామి (1595-1671 )
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వెంకట నాధుడుగా తమిళనాడు భువనగిరిలో 1597లో కన్నడ మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో తిమన్నభట్ట గోపికాంబ దంపతులకు జన్మించారు .మధురై లో బావ లక్ష్మీ నరసింహాచార్యులవద్ద శాస్త్రాధ్యనం చేసి ,కుంభకోణం శ్రీమఠం లో చేరి ,సరస్వతీబాయిని వివాహమాడి ,లక్ష్మీనారాయణ ఆచార్య అనే కుమారుని కి తండ్రిఅయ్యారు.
సుధీంద్ర తీర్థులవద్ద శిష్యరికం చేసి ఆయన అనుజ్ఞతో 1614 లో సన్యాసాశ్రమం స్వీకరించి తమ శ్రీరామ భక్తికి నిదర్శనంగా ‘’రాఘలేంద్ర తీర్ధ ‘’అయ్యారు .సంస్కృతంలో నిష్ణాతులై వేద ,వేదాంత ,శాస్త్రాలను బోధించారు .గొప్ప సంగీతజ్ఞులేకాక వీణా వాదనలో గొప్ప నిపుణులుకూడా . 1621 లో సుచీన్ద్రుల తర్వాత శ్రీమఠం పీఠాధిపతి అయి 1671 వరకు ఉన్నారు . దక్షిణ భారతం అంతా విస్తృతంగా పర్యటించి ద్వైతమత ప్రచారం ఉధృతంగా చేశారు .అనేక అద్భుతాలు చేసి ఆశ్చర్య పరచారు .1801 లో బళ్లారికలెక్టర్ గా ఉన్న థామస్ మన్రో రాఘవేంద్రస్వామి వారి అద్భుతాలను స్వయంగా చూసి అబ్బురపడి కైఫీయత్ లో రికార్డ్ చేశాడు .
రాఘవేంద్ర స్వామి ద్వైత మత గ్రంధం శ్రీమాన్ న్యాయ సుధకు సంస్కృతం లో .‘’సుధాపరిమళ వ్యాఖ్య ‘’రాశారు. మాధవా చార్యుల పది ప్రకారణ గ్రంధాలలో ఆరింటిపై స్వామి దశప్రాకారణ వ్యాఖ్యానం రాశారు .బ్రహ్మ సూత్రాలకు ‘’సూత్ర ప్రస్తానం ;; ఋగ్వేద ఉపనిషత్ ప్రస్థానాలు కూడా రాశారు .గీతా ప్రస్తానం శ్రీ రామ చరిత మంజరి ,శ్రీ కృష్ణ చరిత మంజరి ,ప్రతాః సంకల్ప గద్య ,సర్వ సమర్పణ గద్య కూడా రాఘవేంద్ర స్వామి రచించారు .రాఘవేంద్ర స్వామిపై శ్రీ రాఘవేంద్ర విజయం ను వారి మేనల్లుడు ,నారాయణాచార్య రాశాడు .అప్పనా చార్య స్వామిపై 32 శ్లోకాల స్తోత్ర0 రాశాడు .ఇది మఠం లో నిత్యా స్తోత్రమైంది . రాఘవేంద్ర స్వామి జీవితం పై ,మహాత్మ్యాలపై తెలుగు తమిళభాషలో చాలా సినిమాలు టివి సీరియల్స్ వచ్చాయి . తమిళనటుడు రజనీకాంత్ స్వామిగా నటించాడు . తెలుగు సీరియల్ లో ప్రసాద్ బాబు చేసినట్లుజ్ఞాపకం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

