గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
406-చిత్రోదయమణి కర్త -సాంబశివ శాస్త్రి (1912-1991)
కేరళకు చెందిన సాంబశివ శాస్త్రి ‘’చిత్రోదయమణి ‘’కావ్యం రాశాడు .తిరువనంతపురం మహారాజు చిత్ర తిరుణాల్ ,ఆయన వంశ పురుషుల గురించి రెండు సర్గలలో వర్ణింపబడిన కావ్యం .చేర రాజులలో చెంగుత్తవన్ ప్రస్తావన చేసి ఆయనను చేరమాన్ పెరుమాళ్ అన్నాడుకవి .తర్వాత ముకుందమాల కర్త కులశేఖర ఆళ్వార్ ను ప్రస్తుతించారు .మిగిలిన రాజులైన స్తాను రవి ,భాస్కరరవి ,గోవర్ధన మార్తా0డ ,సంగమాది రవివర్మ ,కేరళవర్మ ,మార్తా0డ వర్మ ,శ్రీమూలం తిరుణాల్ ,చిత్ర తిరుమాళ్ మహారాజుల జీవిత వర్ణన చేశాడు
407-మార్తా0డ శతక కర్త -మార్తా0డ వర్మ (1705-1758 )
111 శ్లోకాలున్న మార్తా0డ శతక కర్త రాజా వీర మార్తా0డ వర్మ .ఇది తిరువాన్కూర్ మహారాజు స్వాతి తిరుణాల్ మార్తా0డ వర్మ చరిత్ర .మొదటిశ్లోకం లోనే అయన వంశం వర్ధిల్లుగాక అని మొదలు పెట్టాడు .కార్తీక మాసం అశ్వినీ నక్షత్రం లో పుట్టాడని చెప్పి నాలుగవ శ్లోకం లో భారత దేశ రాజులలో గ్రాడ్యుయేట్ అయినమొట్టమొదటి రాజు ఆయనేనని ,8 వ శ్లోకం లో ఆయన అన్నగారు కేరళవర్మ గురించి ,తర్వాత రాజమాతమరణం పిమ్మట రాజు దేశాటనం లో హిమాలయ సందర్శనం రాసి మిగతాదానిలో ఆయన గుణగణాలను ప్రజాహితపాలనను వర్ణించాడు .మంత్రులు హితైషులు ఎందరు ఉన్నా నిర్ణయాలు స్వయంగానే తీసుకొనేవాడని ,అబద్ధాన్ని సహించేవాడుకాదని కవి తెలియజేశాడు .
408- పద్మనాభోదయ కావ్య కర్త -శంకుకవి (18 వ శతాబ్దం )
శంకర లేక శంకుకవి కేరళకు చెందిన 18 వశాతాబ్దిపూర్వభాగపు కవి ..తిరువనంతపురం లోని శ్రీ అనంత పద్మనాభ స్వామి క్షేత్ర మహాత్మ్యంగా ‘’పద్మనాభోదయ ‘’కావ్యంయువరాజు రామవర్మ అభ్యర్థనపై రాశాడు.కవి తమిళనాడు బ్రాహ్మణుడు . కావ్యం నాలుగుపద్ధతులు అంటే భాగాలలో 142 శ్లోకాలలో ఉంది .దివాకర యతి అనుగ్రహం తో అనంత పద్మనాభ స్వామి అనంత వైభవాన్ని ఆనంద పారవశ్యంగా రాశాడు .రామవర్మ మాట తనకు దైవ శాసనమే అన్నాడు .రామవర్మ రాజు మూర్తీభవించిన ధర్మస్వరూపం అని ,ధర్మాన్ని నిత్యజీవితం లో ఆచరించి మార్గ దర్శకుడవటం వలన ఆయన శీల ప్రవర్తనాదులవల్ల ఆయనను రామవర్మ అనికాకుండా ధర్మరాజు అనే ప్రజలు పిలిచేవారని చెప్పాడు
409-కేరళ విల్లాస కావ్యాలు
కేరళకు చెందిన 19 వ శతాబ్ది మనవిక్రమకవి కేరళపై కేరళవిలాస కావ్యం రాశాడు.ఈయన కాలికట్ వాడు .కేరళోల్పత్తి ఆధారంగా దీన్ని 105 శ్లోకాలలో రాశాడు .ఏళత్తూర్ కు చెందిన రామస్వామి శాస్త్రి 1882లో వైశాఖం తిరుణాల్ మహారాజా కాశీ యాత్రను వర్ణిస్తూ ‘120 శ్లోకాల కాశీయాత్ర వర్ణన రాశాడు .సుబ్బరామ పట్టారు ‘’ఆ పద్దీప ‘’అనే 33 శ్లోకాల కావ్యాన్ని జమోరిన్ రాజ్యాన్ని విడిచి వెళ్లిన ఒక దీన బ్రాహ్మణకుటుంబ గాధను వారు కొచ్చిన్ మహారాజు ఆశ్రయం పొందటానికి సహకరించిన అద్భుత అదృశ్య శక్తి గురించి చెప్పాడు .తిరువాన్కూర్ రాజవంశ చరిత్రను గణపతి శాస్త్రి లఘుకావ్యంగా ‘’శ్రీమూల చరిత్ర ‘’రాశాడు .అనంతగిరి ‘’గురు దిగ్విజయ ‘’పేరిట ఆది శంకరాచార్య చరిత్రను ,తుళు బ్రాహ్మణులు తుళునాడు వదలి కొళత్తూర్ ఉదయవర్మ రాజ్యానికి చేరే కథను ‘’బ్రాహ్మణ ప్రతిష్ట ‘’కావ్యంగా ,కొళత్తూనాడు ఉదయవర్మపై 8 శ్లోకాల ‘’దేశ్యాస్ట కం ‘’,కొచ్చిన్ కు చెందిన పరీక్షిత్ తంపురాన్ రాసిన చిన్నకావ్యం ‘’మాల ‘’,వైశాఖం తిరుణాల్ మహారాజాపై కేశవన్ వైద్యం రాసిన ‘’విశాఖ విలాసం ‘’మద్రాస్ గవర్నర్ లార్డ్ నేపియర్ 1883 లో త్రివేండ్రం సందర్శనను ఏళత్తూర్ రామస్వామి శాస్త్రి ;;గౌణ సమాగమం ‘’కావ్యంగా ,కడ త్తనాడు రాజు నిర్వహించిన మహా మృత్యుంజయ యాగాన్ని వర్ణిస్తూ మీథలే మాదం కు చెందిన శంకరవారియర్ రచించిన ‘’మహా మృత్యుంజయ చరిత్ర ‘’,కొచ్చిన్ మహారాజు మహా వాగ్ధోరణిని ,షష్టిపూర్తి ఉత్సవాన్నీ వర్ణిస్తూ నెల్లూరుకాండీ కి చెందిన కృష్ణన్ నంబూద్రి రాసిన ‘’మాతామహిషా షష్టి పూర్తి దశకం ,తిరువాన్కూర్ వైశాఖం తిరుణాల్ మహారాజు చేసిన సేతుయాత్రపై టి. గణపతి శాస్త్రి రాసిన ‘’సేతుయాత్రావర్ణన ‘’మొదలైనవి కేరళలో ఉద్భవించిన సంస్కృత లఘు విలాస కావ్యాలుగా చరిత్ర ప్రసిద్ధి చెందాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

