‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -3

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -3

1937 లో దక్షిణేశ్వర్ కు చెందిన స్వామి శివానంద అనే ‘’మహాపురుష్ జీ ‘’,తారక మహారాజ్ మైసూర్ వచ్చారు.. పరమహంస లీలా ప్రసంగాలలో ‘’1887 శివరాత్రి  నాడు ఉదయం  9 గంటలకు భారంగ పూర్ మఠానికి మహేంద్రనాధ్ గుప్తా (ఏం )వచ్చేసరికి మహాపురుషాజీ ,బ్రహ్మానంద లు వివేకానందులు రాసిన శివ గీతాన్ని పాడుతూ తన్మయంగా నృత్యం చేయటం చూశాడు ‘’అని కస్తూరి ఎప్పుడో చదివింది గుర్తుకొచ్చింది .మహా పురుషుల సందర్శనభాగ్యం తో పులకించిపోయారు .ఆయన కస్తూరికి ‘’శ్రీ రామ కృష్ణ మంత్రోపదేశం ‘’చేశాడు .కానీ కొద్దికాలానికే కుదురుగా ఆసనం వేసి జప0  చేయటం  తనవల్ల కాదని గ్రహించాడు .కర్మయోగమే తనకు నచ్చిన పని అనుకొన్నాడు .రామ కృష్ణ పరమహంస దిండుకింద ఎప్పుడూ అష్టావక్ర గీత పుస్తకం ఉండేదనిదాన్ని తీసి వివేకానంద కు ఇచ్చి చదవమని చెప్పేవారని సుబ్రహ్మణ్య అయ్యర్ పాల్ బ్ర0ట న్ కు చెప్పాడట .. విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చి ఒకఏడాది పియుసి ,మూడేళ్ళ డిగ్రీ ,రెండేళ్ల మాస్టర్ డిగ్రీ వచ్చింది .దీనివలన కస్తూరిని మైసూర్ యుని వర్సిటీ కి స్కూల్ యాజమాన్యం 1928 జూన్ లో అప్పగించింది .తర్వాత మహారాజా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ కు బదిలీచేసింది . 17  ఏళ్ళు ఎంతో సంతృప్తి జీవితం ఇక్కడ గడిపానని కస్తూరి రాసుకున్నాడు .స్టాఫ్ వాళ్లకు కస్తూరి ఒక  సాహసుడనిపించాడు .అతని ఇన్నోవేషన్ కు ఫ్లాట్ అయ్యారు .

 కస్తూరి స్టాఫ్ మెంబర్లనందర్నీ ఒప్పించి డ్రెస్ ,మాట లపై కొన్ని నిర్ణయాలు తీసుకొని అమలు పరచాడు .అందులో డ్రెస్ విషయం లో నేక్ టై కట్టుకోకూడదని  కోట్ పై గుండీ లను పెట్టుకోకూడదని 1947 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు నిర్ణయించుకొన్నారు ..ప్రతిసోమవారం ఆరంజ్ తినాలి .అవతలివారితో కన్నడం లో మాట్లాడేటప్పుడు ఇంగ్లిష్ పదం ఉచ్చరిస్తే మాటకు ఒక పైసా ఫైన్ కట్టాలి .కన్నడ భాష వాడకాన్ని వేగంగా పెంచే చర్యలు తీసుకొన్నారు కస్తూరి బృందం .షెల్లీ కవి రాసిన ‘’డిఫెన్స్ ఆఫ్ పోయెట్రీ ‘’,కార్లైల్ ‘’ఆన్ హిస్టరీ ‘’రస్సెల్ ‘’ఫ్రీమాన్స్ వర్షిప్ ‘’మొదలైనవి కన్నడం లోకి అనువదించారు .పిక్నిక్ లకు వెళ్ళినప్పుడు ,లేక భోజనాళత్రవాత్ వీటిని చదివి వినిపించేవారు .అందరూకలిసి ‘’యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ‘’ఏర్పరచి కస్తూరిని సెక్రెటరీ చేశారు

  .’’ఎక్స్టెన్షన్ లెక్చర్ వీక్స్ ‘’ను జరపాలని నిర్ణయించి దూరపు పట్టణాలలో ఉన్న లైబ్రరీ సొసైటీలద్వారా ప్రచారం ప్రారంభించారు .దీనిలో మంచి ప్రోత్సాహంకలిగి చాలా వేగంగా అనుకొన్నది సాధించగలిగారు .సామాన్యమానవునికి సమాచారం అందించాలని ,ప్రభావితం చేయాలని వీళ్ళ సంకల్పం .కాలేజీలో సోషల్ ఆంత్రోపాలజీ బోధిస్తున్న కస్తూరి వివాహ పద్ధతులు ,కులాలు ,అవినీతి ,నేరాలు ఘోరాలు ,దెయ్యాలపై నమ్మకం , అంత్యక్రియల ఆర్భాటాలు మొదలైనవాటిపై స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేసి మెప్పించాడు హిస్టరీ లెక్చర ర్ కూడా కనుక అశోకుడు అక్బర్ ,చైనా యాత్రికులు ,చైనాలో భారతీయ బౌద్ధ గురువులు భారతీయ సంస్కృతి  చైనా బయట వ్యాప్తి చెందిన విధానం వగైరాలపై ఉపన్యసించి మనసులను గెలిచాడు ..

  ఆ కాలం లో కన్నడిగులు మరాఠా  ,ఉర్దూ ,తెలుగు ,తమిళ రాజుల నవాబుల వారి పాలనలో ఉండేవారు . తమిళుల దాస్టికం ఏక్కువగా ఉండేది .పాలకులను సంబోధించటం లో డాబు దర్పం అతి విధేయత చూపాల్సి వచ్చేది . .నైజాం నవాబ్ తనను ‘’హిజ్ హై నెస్ ‘’అనికాక ‘’హిజ్ ఎక్సాల్టెడ్  హై నెస్ ‘’అని పిలవాలని ,తర్వాత మరింత గౌరవంగా ‘’హిజ్ మెజెస్టి ‘’అనాలని బలవంతం గా అనిపించేవాడు .. దీన్ని వ్యతిరేకించాలనే ఉద్యమం చేబట్టారు కస్తూరి అండ్ పార్టీ అంటే యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ..బానిసత్వ భావనకు వ్యతిరేకత అందరినుంచి వచ్చి సైనికులతోసహా అందరూ దీన్ని ఆహ్వానించారు .

 గ్రామాలలో సంఘాలు కస్తూరిని ఆహ్వానించి రామ కృష్ణ వివేకానందులపైప్రసంగాలు చేయించేవారు .రోవర్స్ క్లబ్ వాళ్ళు ,కోచింగ్ క్లాస్ వాళ్ళు వాళ్ళవాళ్ళ ఊళ్ళల్లో కస్తూరిని వచ్చిమాట్లాడమని కోరేవారు . కస్తూరికి మరొక గొప్ప ఆలోచన ‘’గ్రామ పునరుద్ధరణ ‘’వచ్చి వాలంటీర్లను తయారు చేశాడు .యూనివర్సిటీ యూనియన్ ను ఆషామాషీ గా కాకుండా ఆ క్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జి యూనియన్ ల స్థాయిలో ఒక ఎన్నికైన స్తూడెంట్ సెక్రెటరీ ,,ప్రిన్సిపాల్ నియమించిన స్టాఫ్ సెక్రెటరీ లతో ఏర్పాటు చేశాడు  . లెక్కల లెక్చరర్ టి కృష్ణమూర్తి వయోజన విద్య కార్యక్రమాలు చేసేవాడు .కస్తూరి కొత్తగా విద్య నేర్చుకొనేవారికి ఉపయుక్తంగా కన్నడ ప్రాధమిక విద్యా పుస్తకాలను రాశాడు .వీటిని నగరం లోని చాముండిపుర లో వారికి నేర్పేవాడు . విద్య ద్వారా జాగృతం చేయటానికి ఎన్నిప్రయత్నాలు చేసినా గ్రామీణులను ఆకర్షించటం కష్టం అని గ్రహించి వారికి ఇష్టమైన నాటకం సంగీతం ద్వారా వారికీ దగ్గరవ్వాలని ఆలోచించాడుకస్తూరి . .

 శని ఆదివారాలశెలవులలో కస్తూరి తనకొడుకుతోసహా కొందరు ప్రతిభా సంపన్నులైన విద్యార్ధులతోకలసి గ్రామాలకు వెళ్లి అస్పృశ్యత ,ను భక్త నందనార్  తిరుప్పాణాళ్వార్ చరిత్రతో.మూఢనమ్మకాలను పోగొట్టటానికి మంకాసుర వధ  కథ  ,విద్యాప్రోత్సాహానికి ‘’సాంబు ‘’కథ లను వీధుల్లో నాటకాలుగా ఆడి వారిని చైతన్యం చేశాడూకస్తూరి .ఇవన్నీ పౌరాణిక చారిత్రాత్మక విషయాలు కనుక జానపద నాటక ,గేయాలతో ,సంప్రదాయబద్ధమైన వేష ధారణతో ప్రదర్శించి మనసులను దోచేశాడు కస్తూరి .వీటిలోని సంభాషణలు ముందుగా రాసి పెట్టుకొన్నవికావు సమయం సందర్భాన్నిబట్టి అప్పటికప్పుడు  వేదికమీద అలవోకగా చెప్పినవే .స్పాంటేనిటీ ఉండటం తో బాగా ఆకర్షవంతమైనాయి . అనుకొన్నది సాధించగలిగారు .వీటిలో దేవతలు మునులు అకస్మాత్తుగా రంగం పైకి రావటం పోవటం ,హాస్యం వ్యంగ్యం చెమక్కులూ దట్టించటం తో బాగా పేలాయి .

 ఇంతటితో ఆగితే కస్తూరి గొప్పేముంది .ఆ రోజుల్లో హరికథకు మంచి ఆదరణ ఉండేది . దాన్నీ వదల్లేదు కస్తూరి .మహర్షుల జీవితాలు వారిప్రబోధలు ,పురాణ నాయకులు ,అవతారపురుషుల విషయాలను పాటలు చక్కని మాటలు తో హరికథ గా చెప్పేవాడు కస్తూరి .తన గొంతు సంగీతానికి సహకరించిందని గ్రహించి సంగీతం పాడటానికి కొందరు విద్యార్థులను తయారు చేసివాళ్లతో పాడించేవాడు .వీటన్నిటితో గ్రామీణులను మూవర్స్ అండ్  షేకర్స్ గా  మార్చానకి చెప్పాడూకస్తూరి .బుద్ధ ,రామకృష్ణ పరమహంస ,గీత ,తిరుప్పాణాళ్వార్ ,నందనార్, వివేకానంద ,మీరాబాయి ,అక్కమహాదేవి వేషాలు వేసి వారిపై మాట్లాడి అద్భుత ఛైతన్య స్ఫూర్తి కలిగించాడు  పల్లె టూళ్ల లో ..బెంగుళూరు  దావనాగిరె పట్టణాలలోనూ సిటీ ప్రేక్షకుల మనసు దోచాడు కస్తూరి .కస్తూరి సుగంధానికి పరవశులు కానీ వారెవరుంటారు?వీటి విజయాలకు తనకొడుకుతోసహా తనతోఉన్న సంగీత బృందమే కారణం అంటాడుకస్తూరి .రాజాస్థాన పండితుల వద్ద నుంచి తీసుకొన్న జిగ్ జిగేల్ మనే కాశ్మీ ర్ శాలువా ,యుని వర్సిటీ వైస్ ఛాన్సలర్ బహూకరించిన వెండి చిడతలు తో తనవేషం  మహాబాగా  ఆకర్షణీయంగా ఉండేదని పల్లెప్రజలు వీటితో  రంజిల్లి ఫ్లాటై పోయేవారని అంటాడు కస్తూరి .

 ప్రజల నుంచి ఏమాత్రం వ్యతిరేకత రాకుండా అమ్మవార్లకు జంతుబలి నివ్వరాదని అట్టడుగు వర్గాలవారిని సమాజానికి దూరంగా ఉంచరాదని ,అధికసంతానం తో జనాభా  విస్ఫోటనం   కలిగించవద్దని  ,పురాణాలనుండి వేద,ఉపనిషత్తుల నుండి మహాత్ముల జీవితాలనుండి వారి బోధలనుండి విషయసేకరణ చేసి అందరికి మనసులకు నచ్చేవిధంగా చెప్పటం వలన తాను విజయం సాధించగలిగానని కస్తూరిరాశాడు ..యుని వర్సిటీ లెక్చరర్ ఒకరు మొట్టమొదటిసారిగా వీధుల్లో హరికథ చెప్పటం కస్తూరికే సాధ్యమైంది .దీన్ని కొందరు తప్పుపట్టి ఉన్నత విద్య భోధించేవాడు ఇలా బజార్లలో వేషాలేయటమేమిటి పరువు తక్కువ అని ఆక్షేపించారు .ఇదంతా ప్రచారంకోసం మెప్పూ మెహర్బానీ కోసమే అన్నారు .మరికొందరు తనను పల్లెటూరి బైతులన్నారు .చాలామందిమాత్రం హరికథను యూనివర్సిటీ గౌరవ కలిగించాడు కస్తూరి అని హృదయ పూర్వకంగా మెచ్చుకొన్నారు .ఇన్ని రంగాలతో  జన జాగృతి కలిగించి మానవ సేవే  మాధవ సేవగా భావించి చేశాడు కనుకనే కస్తూరి గురించి ఆయన సేవా పరిమళం  గూర్చి  రాయాలనిపించి రాస్తున్నాను .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.