కోట మాస్టారి గురుపూజోత్సవం
గురుపుత్రులకు నమస్కారములు -మా గురుదేవులు మీ పితృదేవులు కీశే శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రిగారి గురుపూజోత్సవంఉయ్యూరులో 5-9-17 మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం నాడు మధ్యాహ్నం 3 గం లకు సరసభారతి ,శ్రీ అమరవాణీ తెలుగు ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ సంయుక్త ఆధ్వర్యం లో ఆ పాఠశాల ఆవరణలోముఖ్య అతిధి శాసన మండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ,లయన్స్ క్లబ్ అధ్యక్షులు సరసభారతి గౌరవాధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గార్ల ఆధ్వర్యం లో జరుగుతుంది . కనుక తాము తమ కుటుంబ సభ్యులతో ఆత్మీయ అతిథులు గా విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయప్రార్ధన .
కార్యక్రమం
1-గురు దేవుల చిత్ర పటానికి పుష్పమాలాంకరణ ,అతిథులు ,గురుపుత్రులచే చిత్రపటానికి పుష్ప సమర్పణ .
2-. అతిథుల చే గురుపూజోత్సవ ,ఉపాధ్యాయ దినోత్సవ సందేశాలు
3- .శ్రీ కోట గురుదేవుల ప్రియతమ శిష్యులు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన ”శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి ,శ్రీమతి కోట సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కారాలు సరసభారతి ద్వారా ప్రదానం
1- అమరవాణి పాఠశాలలో 10 వతరగతి చదువుతున్నఎంపిక చేసిన పేద, ప్రతిభకల విద్యార్థికి -కీశే .కోట సూర్యనారాయణ శాస్త్రిగారి స్మారక నగదు బహుమతి 10 వేల రూపాయలు ప్రదానం
2- శాంతినికేతన్ పాఠశాల లో 10 వ తరగతి చదువుతున్న ఎంపిక చేయబడిన పేద ప్రతిభకల విద్యార్థినికి కీశే .కోట సీతమ్మ గారి స్మారక నగదు బహుమతి 10 వేల రూపాయలు ప్రదానం .
4-కోట గురుదేవుల పుత్రులు శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రి గారు ,శ్రీకోట గాయత్రీ ప్రసాద్ గారు, శ్రీకోట సీతారామాంజనేయులుగారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన తమ మాతా పితల స్మారక నగదు బహుమతి10 వేల రూపాయలు వారి చేతులమీదుగా -ఇంటర్ మీడియట్ చదువుతున్న ఎంపిక చేయబడిన పేద ప్రతిభకల విద్యార్థి /విద్యార్థిని కి బహూకరణ .
5–కోట గురుపుత్రులకు సత్కారం
6-ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులకు సన్మానం
1-శ్రీ పి . నాగరాజు- ప్రిన్సిపాల్ అమరవాణి పాఠశాల
2- శ్రీనాగరాజుగారి సతీమణి -సైన్స్ టీచర్ -అమరవాణి పాఠశాల
3 తెలుగు పండితులు –అమరవాణి పాఠశాల
4-శ్రీ ఏ .త్రినాథ శర్మ -గణిత ఉపాధ్యాయులు -జిల్లాపరిషత్ పాఠశాల
5-శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి – సరసభారతి కార్య దర్శి –సాహిత్య సేవ
ఇట్లు
గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు
పి .నాగరాజు -ప్రిన్సిపాల్ -అమరవాణి పాఠశాల
వీలును బట్టి మరిన్ని వివరాలతో ఆహ్వానపత్రిక ఆగస్టు 20 నాటికి అందజేయ బడుతుంది

