‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -5(చివరిభాగం )
గోపాలస్వామి మరీ బలవంతం చేస్తే కస్తూరి రేడియో స్టేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు .. అది రెండవ ప్రపంచ యుద్ధ సమయం . శత్రు సైన్యం మలేషియా దాకా దూసుకు వచ్చింది ..కనుక ప్రతి వార్తా చాలా జాగ్రత్తగా ప్రసారం చేయాలి . ఇంటి దగ్గర దీనికోసం చాలా చదవాల్సి వచ్చేది . ఢిల్లీ వార్తలు విని అందులోని ముఖ్య విషయాలను కన్నడం లోకిమార్చి చేతితోరాసి ఒక విద్యార్థి చేతికిచ్చి సైకిల్ పై స్టేషన్ కు పంపేవాడు . అక్కడ చదివేవారు ..కావేరి డాం చూడటానికి బృందావన్ గార్డెన్స్ కు జనరల్ వావెల్ వచ్చాడు .ఈవార్తను చదివే అనౌన్సర్ ‘’శ్రోతృగళ్ ‘’అనటానికి బదులు ‘’శతృగళ్ ‘’అని తప్పుగా చదివాడు …దీనికి కస్తూరి పర్యవేక్షణ సరిగా లేదని నెపం వేశారు . 1942 ఆగస్టు 9 ఉదయం ఇంగ్లిష్ న్యూస్ బులెటిన్ కస్తూరి విన్నాడు .అది గాంధీగారి అరెస్ట్ వార్త.వెంటనే కన్నడా నువాదం చేసి సైకిల్ కుర్రాడికిచ్చి స్టేషన్ కు పంపాడు . ఈ వార్తలు విన్న జనం అప్పటికే బజార్లలోకి వచ్చి ముర్దాబాద్ నినాదాలు ఇచ్చారు .కంగారుపడ్డాడు కస్తూరి . తాను విన్న ఇంగ్లిష్ న్యూస్ కరెక్టేనా అని అనుమానమొచ్చింది .ఇంతలో మరాఠీ న్యూస్ లో కూడా గాంధీగారి అరెస్ట్ వార్త రావటం తో ఊపిరిపీల్చుకున్నాడు .అంతగా అప్డేట్ గా ఉండేవాడు . ఇలాంటి టెన్షన్ లు ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది .
వార్తా బులెటిన్ ల క్వాలిటీ పెంపు కోసం మిగిలిన విషయాల కోసం తలలు పట్టుకోవాల్సివచ్చింది ..గోపాలస్వామి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నాడు .ఇందులో ఆయన స్వార్ధమూ ఉంది .కస్తూరితో సంప్రదించేవాడు సలహాలు తీసుకొని అమలు చేసేవాడు ..సమాజం లో బిగ్ బిగ్ లగురించి రాసి ప్రసారం చేసేటప్పుడు వాళ్ళు ఏమనుకొంటారో అని కంగారుఆడేవాడు స్వామి .ఒక సారి ‘’ఫెయిరీ టేల్ ఆఫ్ సిండరెల్లా ‘’ప్రసారం చేస్తుంటే అరిస్టోక్రాట్ ల మనోభావాలకు దెబ్బతగులుతుందేమో నని బాధ పడ్డాడు కూడా …దసరా ఉత్సవాల సందర్భం గా ప్రతి రోజు ఉదయం ప్రసారం చేయటానికి 9 రోజుల సంగీత కార్యక్రమం బాగా ప్రచారం చేసి మంచి రిహార్సల్స్ తో నిర్దుష్టంగా సిద్ధం చేశాడు కస్తూరి . నాలుగు రోజుల ప్రసార0 అవగానే ప్రజాస్పందన అద్భుతం అని తెలిసింది .ఐదవరోజు అమ్మవారిపేరు తన భార్య పేరు ఒకటే అయిందని ఒక వి ఐ పి వ్యతిరేకించాడని స్వామి చెప్పాడు .మిగిలిన రోజు ల కార్యక్రమాలను కాన్సిల్ చేయమని ఒత్తిడి చేశాడు .తిరస్కరించి ప్రసారం చేయాలనే నిర్ణయించాడు కస్తూరి .దీనితో అహం దెబ్బతిన్న డైరెక్టర్ స్వామి కస్తూరిస్థానం లో మరొకరిని నియమిస్తున్నానని చెప్పాడు .ఇలా అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ పదవి ఊడి మళ్ళీ యుని వర్సిటీ లెక్చరర్ గా చేరాడు ..శ్రోతల నుండి అనూహ్యమైన మద్దతు కస్తూరికి లభించింది . దీన్ని ఓర్వలేక పోయాడు డైరెక్టర్ ..కోపం తీరక మలేరియా విస్తృతంగా ఉన్న ,200 మైళ్ళ దూరంలో ఉన్న షిమోగాలోని ఇంటర్ కాలేజీకి కస్తూరి ని తన్నాడు ..ఆ ప్రాంతం లో ఉద్యోగులకు ప్రతినెలా మలేరియా చికిత్సకోసం జీతం తోపాటు ఒక నెలజీతం ఎక్ట్రా గ్గా ఇస్తారు .
కస్తూరి అనే ఫుట్ బాల్ మైసూర్ నుంచి తన్నబడి షిమోగాకు చేరింది .ఇదీ మంచిదేనని పించింది అక్కడి ప్రజల భాష సంస్కృతుల అధ్యయనం చేశాడు .ఇక్కడున్న రెండేళ్ళూ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు యధా ప్రకారం నిర్వహించాడు .వసంతోత్సవాలు జరిపాడు .షిమోగా బాగా ఎత్తైన ప్రదేశం. విపరీతమైన వర్షాలు పడతాయి .రుతుపవన వర్షాలతో కావేరితుంగభద్ర నదులు పొంగి ప్రవహిస్తాయి .కొండలన్నీ పచ్చ తివాచీ పరచినట్లు ఆహ్లాదంగా కనిపిస్తాయి . నిప్పు సెగలవద్ద ప్రజలు వెచ్చ దనాన్ని అనుభవిస్తారు . యువ కవి పరమేశ్వరభట్ ,షిమోగా కర్ణాటక సంఘ కన్వీనర్ విష్ణుభట్ ,కస్తూరి అనే’’ బ్రహ్మ భట్ ‘’బ్రహ్మ విష్ణు పరమేశ్వర త్రిమూర్తులై షిల్లాంగ్ లో ఇది వరకు ఎప్పుడూ ఎవ్వరూ చేయని ‘’వర్షాగమ మహోత్సవం ‘’జరిపారు .దీనికి గుర్తింపు వచ్చి ఆ తేదీని కర్ణాటక లోని షిమోగా కాలెండర్ లో చేర్చి సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది .అదీ వర్షం లోనూ మట్టివాసనలతోకలిసి సాగిన కస్తూరి పరిమళం .
మరో విషయం లోనూ కస్తూరి షిమోగాలో విజయం సాధించాడు . ఆశువు (ఇం ప్రాం టు )నాటకాల పోటీ ఔత్సాహిక యువ నాటక నటీ నటులకు కోసం నిర్వహించాలని ఆలోచించాడు . ఒక గంట ముందుమాత్రమే అయిదు విషయాలు ,సందర్భాలు ఇచ్చి అందులో ఏదో ఒకదానిపై తయారవటానికి ఆ గంట ఉపయోగించుకొని ముప్పావు గంట నాటకం వాళ్ళు ఆశువుగా ఆడాలి .వీటిలో గెల్చిన వారికి బహుమతులు ఇస్తారు ..గ్రామీణాభి వృద్ధి కార్యక్రమం లో ఇలాంటివాటిపై బాగా అనుభవం ఉండటం వలన కస్తూరి దీన్ని హాయిగా నిర్వహించాడు .ఈ ఐడియా బాగా క్లిక్ అయి యువజనం లో ఉత్సాహం ఉరకలు వేసి పాల్గొని బహుమతులు పొందారు . మరొక పోటీ ‘’జోక్ క్రాకర్స్ డే ‘’’(నవ్వుల టపాసుల రోజు )ని దీపావళినాడు జరిపాడు . దీనికి కస్తూరి ‘’హాస్య చటాకి ‘’అనే చక్కనిఅర్ధవంతమైన కన్నడ పేరు పెట్టాడు .. టపాకాయల కోసం డబ్బు తగలేసి కాల్చిపారేయకుండా ఈ హాస్య టపాకాయలు పేలుస్తూ హాయిగా ఆనంద0 అనుభవించాలని కస్తూరి ఆలోచన . ఇదీ ఘన విజయమే సాధించింది . హాస్య కదంబానికి ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ప్రొఫెసర్ ,ఒక డాక్టర్ ,,ఒక లాయర్ ,ఒక వ్యాపారి ,,ఒక బిల్ కలెక్టర్ ,ఒక రైతు లను ఆహ్వానించి వారికి పదేసి నిముషాల టైం ఇచ్చివాళ్లతో జో కులు హాస్య విషయాలు చెప్పించేవాడు .ఇది దీపావళికంటే పెద్ద శబ్దం తో పేలి ,నవ్వుల తారాజువ్వలు హాస్యపు మతాబులు , చెణుకుల కాకర పువ్వొత్తులు ,రిపార్టీల ఆటంబాంబులు తో ఆనంద హాస్యానంద దీపావళి అయి మానసిక సంతోషాన్నిచ్చింది .. ఇది కర్ణాటక అంతా పాకి మెట్రోలలోనూ ప్రవేశించి నవ్వుల దీపావళిగా మారిపోయింది .కన్నడ లిటరరీ అకాడెమి దీన్ని ఘనంగా నిర్వహించటం ప్రారంభించింది .కస్తూరిహాస్య ప్రయత్నం గంధకం వాసనతో మరింత పరిమళించింది . 1946 లో కస్తూరి బెంగుళూర్ లోని ఇంటర్ కాలేజీకి బదిలీ అయి కాన్స్టి ట్యూషనల్ అండ్ సోషల్ హిస్టరీ ఆఫ్ బ్రిటన్ సబ్జెక్ట్ ను సెంట్రల్ కాలేజీ ఇంగ్లిష్ లిటరేచర్ ఆనర్స్ డిగ్రీ విద్యార్థులకు బోధించాడు .మైసూర్ లోని ఇల్లు అమ్మేసి బెంగుళూర్ లో కొన్నాడు .మైసూర్ కాలేజీకి ,కొరవంజి ,శంకర్ వీక్లీ లకు స్వస్తి పలికాడు కస్తూరి ..
సమాప్తం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా
—

