గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
436-ఖేట కౌతుకం కర్త -అబ్దుల్ రహీం ఖాన్ ఎ -ఖానా (`1556-1627)
అక్బర్ నవరత్న మంత్రులలో ఒకడైన కవి అబ్దుల్ రహీం ఎ -ఖానా 1556 లో జన్మించి 1627 లో మరణించాడు .ఉర్దూ ద్విపదలకు ఖగోళ శాస్త్ర గ్రంధానికి ఆయన మారుపేరు సంస్కృతం లో రెండుగ్రంధాలు రాసిన వైదుష్యం కూడా ఆయనది .ఆయన పుట్టిన ఊరు ఖాన్ ఖానా గా ప్రసిద్ధమైంది .ఇది పంజాబ్ రాష్ట్రం లో నవాన్ షాహి జిల్లాలో ఉంది . అక్బర్ కు నమ్మకస్తుడు ,మార్గదర్శి అయిన బైరం ఖాన్ కు రహీం కొడుకు .ప్రవాసం నుండి బయట పడి ఇండియా వచ్చిన హుమాయూన్ తన రాజోద్యోగులను జమీందార్ల కూతుళ్లను పెళ్లి చేసుకోమని హుకుం ఇచ్చాడు .తానూ హర్యానాలోని మేవత్ జమీందార్ జమాల్ ఖాన్ పెద్ద కూతుర్ని పెళ్ళాడి తే ,బైరం ఖాన్ చిన్నకూతురును పెళ్లి చేసుకొన్నాడు .బైరం ఖాన్ కు ,జమాల్ ఖాన్ కూతురైన భార్యకు పుట్టిన వాడే రహీం . .గుజరాత్ లోని పాఠన్ యుద్ధం లో భైరం ఖాన్ చనిపోయాక ,ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు తీసుకొని రాబడ్డాడు .తర్వాత అక్బర్ కొలువులో రహీం మంత్రి అయ్యాడు .మీర్జాఖాన్ అని పేరుపెట్టారు .రహీం మారుటి తల్లి సలీమా సుల్తాన్ బేగం, కజిన్ అయిన అక్బర్ ను పెళ్లాడింది .అక్బర్ కు రహీం ఈ విధంగా కొడుకు వరుస అయ్యాడు .తన నవరత్న మంత్రులలో ఒకనిగా అక్బర్ రహీం ను చేశాడు .
రాణా ప్రతాప్ ముస్లిం మహిళలకు రక్షణ కల్పించటం రహీం పై ప్రభావం కలిగించి ముస్లిం అయినా రహీంఖాన్శ్ కృష్ణ భక్తుడు అయి ఒక కావ్యం రాసి అంకితమిచ్చాడు.దాతృత్వం లో రహీం చేతికి ఎముక ఉండేదికాదు .దీన్ని తులసీదాసు గమనించి కవిత్వం లో బంధించాడు .రహీం ఇద్దరు కొడుకులను అక్బర్ కొడుకు జహంగీర్ అక్బర్ మరణం తర్వాత తాను చక్రవర్తి అవటానికి అడ్డు వస్తున్నారని భావించి చంపేశాడు .
రహీంఖాన్ సంస్కృతం లో 1-ఖేట కౌతుకం 2-ద్వాత్రి0శద్యోగావళి కావ్యాలు రాశాడు .ఉర్దూలో లెక్కలేనన్ని దోహాలురాశాడు . బాబర్ జ్ఞాపకాలైన బాబర్ నామా ను పర్షియన్ భాష లోకి అనువదించాడు .రహీం సమాధి మధుర వెళ్లే దారిలో నిజాముద్దీన్ కు తూర్పున హుమాయూన్ సమాధిప్రక్కన ఢిల్లీలో ఉంది .దీన్ని 1598 లో రహీం తన భార్య కోసం కట్టిస్తే ,1627 లో అందులో రహీం పార్థివ దేహాన్ని పెట్టారు .జహంగీర్ చక్రవర్తిగా సలీం సింహాసనం ఎక్కినప్పుడు అతనివద్దకూడా రహీం మంత్రిపదవి నిర్వహించాడు
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-8-17 -కాంప్ -షార్లెట్-అమెరికా
–
–

