గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
438-పంచసంధి వ్యాకరణ కర్త -బనార్సి దాస్(1587-1643)
1587 లో జన్మించి 1643 లో మరణించిన బనారసీ దాస్ తన జీవిత చరిత్ర ‘’అర్ధ కథానక ‘’గ్రంధం రాశాడు .అందులో జైన దేవాలయాలలో జరిగే పూజలు ,ఉత్సవాల గురించి వర్ణించాడు . 1635 లో జైన గురువు పండిట్ రూప్ చ0ద్ ఆధ్వర్యం లో జరిగిన జైన సెమినార్ గురించి కూడా పేర్కొన్నాడు .ఆగ్రా జైన సంస్కృతికి పట్టుగొమ్మగా ఉండేదని ,1594 లో పండిట్ భగవాన్ దాస్ తన రామ్ నగర్ నుండి ఆగ్రాకు యాత్రగా వచ్చాడని ,ఈ మహానగరం లోని ‘’జిన వన్దన0 ‘’ను చక్కగా వర్ణించాడు .అప్పుడు ఆగ్రాలో 48 దిగంబర జైన దేవాలయాలున్నట్లు తెలిపాడు .వీటిలో రెండు భట్టారక పీఠాలు .భట్టారక సుఖ కీర్తి తిహునా సాహు జైన దేవాలయం లో ఉండేవాడని ,భట్టారక జగత్ భూషణ్ సాహు నారాయణి దేవాలయం లో నివసించేవాడని చెప్పాడు .నగరం లోని జైన దేవాలయాలు వీరిద్దరిలో ఎవరో ఒకరి ఆధీనం లో ఉండేవి .భట్టారకులు పండితులనుఎంపిక చేసి నియమించి దేవాలయాలలో పూజాదికాలు నిర్వహింప జేసేవారు .ఈ పూజారులుతాంత్రిక పూజలూ నిర్వహించేవారు .ఈ దేవాలయాలు ఆధ్యాత్మిక జ్ఞాన కేంద్రాలుగా ఉండేవి .ఉత్తర భారతం లోని ప్రతి దిగంబర దేవాలయం లో లోపలా బయటా ఖాళీ స్థలం ఎక్కువగా ఉండి ,సామూహిక పూజా కార్యక్రమాలకు ప్రసంగాలకు అనువుగా ఉండేవి .బలభద్ర జైన్ ఆగ్రా గురించి ‘’ప్రతి జైన దేవాలయం లో ఉదయ , సాయం సమయాలలో జైన మత గ్రంధాలపఠనం ఆరాధనజరిగేవి .తరచుగా తత్వ గోష్ఠి నిర్వహించేవారు ‘’అని రాశాడు .
బనారసీ దాస్ తనగ్రంధం లో ‘’పండిట్ రూప్ చంద్ జైన గ్రంథ నిష్ణాతుడు ఆగ్రాకు వచ్చి తిహున్ సాహు నిర్మించిన దిగంబర దేవాలయం లో ఉన్నాడు .ఈయన ఆధ్వర్యం లో గొప్ప దిగంబర జైన సభ జరిగింది . అందులో ఆయన ‘’గొమ్మట సార’’పై గొప్పగా ప్రసంగించి స్ఫూర్తి కలిగించాడు .ఇది భట్టారక పీఠం . ‘’ఆధ్యాత్మిక గోష్ఠులను ‘’విచార ‘’లేక విచార గోష్ఠి అనేవారు.దీనినే మనం ఇప్పుడు సింపోజియం అంటున్నాం .కుంద కుందా చార్య రాసిన ‘’సమ్మత సార’’పై కూడా గోష్ఠి జరిగేది .ఆరాత్ మల్ ధోర్ అనే ప్రముఖ జైన ఆచార్యుడు తనకు హితోపదేశం చేసినట్లు బనారసీ దాస్ రాసుకున్నాడు .బనారసీ దాస్ ‘’భాషా అర్ధ బొచరై చిత్త ‘’అనే గ్రంథాన్ని తానె స్వయం గా చదివాడు .కానీ పూర్తిగా అర్ధం చేసుకోలేక పోయానని ,గోమ్మట సారను రూప్ చాంద్ మార్గ దర్శకత్వం లో చదివి న తర్వాత సమయసారం పూర్తిగా అర్ధమయింది రాశాడు .తన అర్ధ కథానకలో బనారసీ దాస్ ‘’ఇప్పటికి సన్మార్గం లో పడ్డాను .దేవుని స్వభావం ఏమిటో తెలిసింది .ఈ ఆనందం ,తపన తో ‘’సమయచార నాటకం ‘’రాశాను’’అని చెప్పుకొన్నాడు దాస్ .నాటకం చివర విపులమైన వివరణ ఇచ్చాడు
జైన మత గ్రంధాలపై అవగాహన బాగా ఉన్న పంచ మహానుభావుల సంభాషణలు గోష్ఠులను గురించి సవివరంగా రాశాడు .సమయ సారకు వ్రజభాష అనువాదం కూడా బనారసీదాస్ రాశాడు .దీనికి ఆధారంగా అమృత చంద్రుని సంస్కృత వ్యాఖ్యను ఎంచుకున్నాడు బనారసీ దాస్ రాసిన సమయ చార నాటకం ఆగ్రా జైన పీఠాలలో గ్రంధమై పోయింది .బనారసీ దాస్ మిగిలిన రచనలను ఆయన మరణానంతరం సేకరించి మొఘల్ సామ్రాజ్య దివాన్ జగ్జీవన్ పంచ మహానుభావుల నే జ్ఞాన మండలికి అందజేశాడు .ఇందులో పీతాంబరుడు అనేకవి 1630 లో బనారసీ దాస్ పై స్తుతిగా చెప్పిన కవిత్వం బనారసీ విలాస్ అనే జ్ఞాన్భా వని అనే ది ఉంది దీనిలో దాసు గొప్ప వాణిజ్య వర్తక వేత్త మాత్రమేకాక భక్తిగా గానం చేయగల సత్తా ఉన్నవాడిని మంచికవి అని వర్ణించబడింది .సుమారు 15 మంది ఆసక్తి ఉన్నవారు బనారసీ దాస్ ఇంటికి వచ్చి ఆయన ఆలపించే కుట్ బాన్ రచించిన ‘’మృగావతి ‘’ని ,మం జాన్ రాసిన మధుమాలతి ని ఆసక్తిగా వినేవారట .ఈ రెండూ సూఫీకవుల కవిత్వాలు .
దాస్ -జాన్ పూర్ లో పండిట్ దేవ దత్తు వద్ద జ్యోతిష ,గణిత ,ఖాండ స్పూట విద్యలు నేర్చాడు .నానార్ధాల ‘’నామ మాల ‘’ను ‘’అనేకార్థ కోశం ‘’ను అధ్యయనం చేశాడు .అలంకార శాస్త్రం లఘుకోశం పై ఒక ఏడాది దీక్షగా కృషి చేసి సారం గ్రహించాడు .స్వే తాంబర గ్రంధాలు శ్రుత బోధ ,చంద్ర కోశ లను ప్రసిద్ధ బౌద్ధా చార్యులు బాం చంద్ ,రామ్ చంద్ ల వద్ద నేర్చాడు .తాను సంస్కృత ప్రాకృతాలను నిర్దుష్టంగా పలకగలనని మాట్లాడగలనని వాటిలో రాయగలనని చెప్పుకొన్నాడు .స్వయంగా తీర్చి దిద్దుకోబడిన కవి దాస్ .వెయ్యి పద్యాలున్న హిందీ అలంకార శాస్త్ర గ్రంథం రాశాడు .నవ రసాలను చర్చించాడు .జాన్ పూర్ గవర్నర్ చిన్ని కిలిక్ బనారసీ దాస్ శిష్యరికం చేసి ఎన్నో గ్రంధాలు అభ్యసించాడు .సంస్కృత వ్యాకరణం ‘’పంచ సంధి ‘’రాశాడు .జిన సహస్రనామం సూక్తి ముక్తావళి రాశాడు.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-8-17- కాంప్ -షార్లెట్-అమెరికా
—

