గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
442-స్థానాంగ సూత్ర కర్త -దేవర్ధిగని క్షమా శ్రమణ (3 వ శతాబ్దం )
జైన సంప్రదాయం లో మొదటి పదకొండు అంగాలు అంగ వాసర్పిణి కాలం లో బాగా శిధిలమైనా సంరక్షింప బడ్డాయని స్వే తాంబరు విశ్వాసం .ఆ కారణం వలననే మూడవ శతాబ్దికి చెందిన దేవర్ధిగని క్షమా శ్రమణ ఆధ్వర్యం లో వాటిని కుదించి స్వేతాంబర జైనానికి ఉపయుక్తం గా గ్రందీకరణం చేశాడు.ఈపని అంటే సంక్షిప్తీకరణ కార్యాన్ని మహా వీర నిర్యాణం తర్వాత 993 ఏళ్లకు గుజరాత్ లోని వల్లభి లో చేసి అర్ధమాగధి ప్రాకృతం లో రాశారు అసలు స్థానాంగ సూత్రం సంస్కృతంలోనే ఉంది . మూల సంస్కృత గ్రంధం టీకా ,తాత్పర్యాలు లేకుండా అర్ధం చేసుకోవటం మిక్కిలి కష్టం కనుక శ్రమణ అందరికి అందుబాటులోకో తేవాలని ఈ పని చేశాడు . 11 వ శతాబ్దం లో అభయ దేవ సూరి స్థానాంగ సూత్రకు పూర్తిగా సంస్కృతం లో టీకా తాత్పర్య వ్యాఖ్యానం రచించాడు
ఈ గ్రంధాన్ని ప్రాకృతం లో స్థానం అంటారు అంటే క్వాంటం అంటే కొంత భాగం అని భావం. దీని శైలి చాలా ప్రత్యేకమైనది .ఇందులో 11 అధ్యాయాలు ,ప్రతి అధ్యాయం కొన్ని స్థానాలతో ఉంటుంది .జైనుల మెటాఫిజిక్స్ అంతా ఇందులో దర్శనమిస్తుంది .ధర్మ కథానుయోగ ,కరణానుయోగ ,ద్రవ్యాను యోగ మొదలైన విషయాల చర్చ ఉంది .ఇందులోని పదజాలం ,విషయాలు సరైన స్థానాలలో ఉండటం వలన చాలా తేలికగా కంఠతా చేసి గుర్తుంచుకోవచ్చు .ఇదొక మెమరీ ఎయిడ్ గా ఉపయోగ పడుతుంది .కనీసం 8 ఏళ్ళు జైన పథం లో తీవ్రంగా కృషి చేసినవారికే దీని అంతరార్ధం పూర్తిగా తెలుస్తుంది అని ‘’వ్యవహార ఛేద సూత్ర ‘’చెబుతోంది .ఇందులోని మొదటి సూత్రం -’’సూయం మే ఔశం తేన0 భగవయా ఏవం ఆఖ్యాయా0’’అంటే ‘’ఓ చిరంజీవీ ! పూజ్యనీయులైన మహావీరులు ఇలా చెప్పారని నేను విన్నాను ‘’
ఇందులో గణిత శాస్త్రమూ 747 సూత్రం లో ఉన్నది . 1- పరిశ్రమ అంటే చతుర్గణనం 2-వ్యవహార 3-రజ్జు -జామెట్రీ 4-రాశి -ఘన వస్తువుల గణనం 5-కాలసవర్ణ -భిన్నాలు 6-యావత్త్తావత్ -సరళ సమీకరణాలు 7-వర్గ -ద్వివర్ణ సమీకరణాలు 8-ఘన -క్యూబిక్స్ 9-వర్గ -వర్గ -బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 10- వికల్ప -పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ల గణితం పై వివరాలున్నాయి
ఈ గ్రంధానికి ఇంగ్లిష్ ,హిందీ ,ప్రాకృత అనువాదాలు వచ్చాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

