పూర్వ సంధ్యా

పూర్వ సంధ్యా

” పూర్వ సంధ్యాప్రవర్తతే ఉత్తీష్ట నర శార్దూల కర్తవ్యం దైవ మాహ్నికం ”అంటూ విశ్వామిత్రుడు శ్రీరాముడిని నిద్రలేపాడు .ఆసమయం చాలా పవిత్రమని హాయిగా  అన్నీ పనులకు వీలుఆని భావం . దానినే మనం బ్రాహ్మీ ముహూర్తం అంటాము . నందమూరి తారక రామారాఓ గారు దాన్ని చక్కగా పాటించారు .మన దేశం లోనేకాదు విదేశాలలో కూడా ఆ సమయానికి అంతటి ప్రాధాన్యమిచ్చే వారున్నారు .అందులో టోని మారిసన్  అనే రచయిత్రి దాన్ని అక్షరాలా పాటించి వన్నె వాసికెక్కింది ..ఆ చీకటి సమయం లో ఒక కప్పు కాఫీ తాగి ఆమె ప్రశాంతంగా తన రచనా కార్యక్రమం ప్రారంభించేది .తన చిన్న అపార్ట్ మెంట్ లో ఒక చిన్న డెస్క్ ముందు కూర్చుని ,రాయటం ప్రారంభిస్తే సూర్యోదయమై వెలుగులు ప్రసరించే దాకా ఆమెకు ఈ లోకాపు స్పృహ ఉండేది

కాదు .ఇలా ఒక రోజో ఒక ఏడాదో కాదు జీవిత పర్యంతం చేసింది .రాసుకోవటానికి ఒక్కొక్కరికి  ఒక్కో చోటు ,ఒక్కో సమయం ఉంటుంది అవే వారికి మహాయిష్టం అప్పుడే వారు ఏదైనా ఎంతైనా రాయగలుగుతారు అని ఆమె చెప్పేది ..ఆమె ”light is the signal in the transition .it is not being in the light ,it is being there ”before it arrives .it enables me ,in some sense ”అని ఆసమయ ప్రాముఖ్యాన్ని ఆనందంగా చెప్పేది ..అది ఆమెకు ప్రాక్టికల్ మాత్రమే కాదు స్పిరిట్యువల్ కూడా..ఆమె పెళ్లీ పెటాకులు లేని ఆవిడ కాదు .ఉద్యోగి కూడా .ఇద్దరు పిల్లల తల్లి ..రాండమ్ హౌస్ పత్రికలో ఆమె ఉద్యోగం .ఇంటికి చేరే సరికి రాత్రిబాగా  పొద్దుపోయేది .ఇంటికి వచ్చి అలిసి పోయేది ఆలోచించటానికి సమయమే ఉండేది కాదు .అందుకే ఆమె రచనా వ్యాసంగం అంతా పూర్వా సంధ్యాకాలమ్ లోనే ఫ్రెష్ గా ఉంటుందని మంచి ఆలోచనలు ఆసమయంలో వస్తాయని తన రచనా నిర్విఘ్నంగా సాగిపోతుందని ఆమె గొప్ప విశ్వాసం .తెల్లారింది అంటే చుట్టూ రణగొణ ధవనులు ,ఫోన్లు పలకరింపులు తో స్థిమితం చిక్కదు అని భావించేది .

  ఆ ప్రశాంత ఉదయ సమయం స్వేచ్ఛగా ,మానసిక దృఢత్వం ,మనసు ప్రశాంతత తో పాటు శరీరం పూర్తి శక్తి మ౦తంగా ఉంటుందని జీవితపు బాధ్యత బాదర బందీలు ఉండవని ,,తన రచన అనే కళకు ఆ కాలం గొప్ప ప్రేరణాత్మక నేపధ్యమని ఆమె భావించింది .1965లో మొదటి నవల ‘ ప్రచురించింది .35 వ యేట భర్తకు విడాకులిచ్చి ,తెల్లజాతి అహంకారులమధ్య జీవిక కోసం పోరాడుతున్న కాలం  అది …అప్పటి ఆమె బాధ్యతలు మోయలేనివే అయినా కుంగని ధైర్యంతో ముందుకు సాగింది .ఆమె కు అప్పుడు ”give it every thing you got ”అన్నది ఆదర్శమై తనపిల్లలకు ఇవ్వాల్సింది అంతా ఇచ్చింది ..1970 లో ”దిబ్లూయెస్ట్ ఐస్”నవల రాసింది .తర్వాత అనేక నవలలు ,9 నాన్ ఫిక్షన్ లు 5 చిన్నపిల్లల పుస్తకాలు ,2 నాటకాలు కధా సంపుటులు .రాసి పబ్లిష్ చేసింది .నేషనల్ బుక్ అవార్డ్ ,సాహిత్యం లో నోబెల్ ,ప్రెసిడెంట్ మెడల్ పొందిన నోబుల్ వనితా రత్నం ..ఇంతటి సాహిత్య వారాశి సృష్టించిన ఆమె ఇద్దరు బిడ్డల తల్లిగా  ,గ్రేట్ వర్కింగ్ మదర్  గా సాధించిన విజయం ..ఈ ఆధునిక ప్రపంచం లో అంత వేకువ లో లేవటం అసాధ్యమైన కాలం లో ఆమె సుసాధ్యం చేసింది .”while you are fresh ,while you can ,grab that hour before day light .geb that hour before traffic .grab it while no one is looking ,while every one else is still asleep ”అని ఆమె మనకు బోధించింది .  

  మార్కస్ ఆరిల్లాస్ రాసిన ”మెడిటేషన్స్ ”పుస్తకం లో కూడా ”most powerful man in the world trying to convince him self to get out of bed at dawn ,when the lower part of himself wants desperately to stay ”అని చెప్పాడు .ఏసుక్రీస్తు కూడా ఉదయాన్నే తన సమాధి నుంచి లేచేవాడని విశ్వసిస్తారు ..వేకువనే లేవటం గొప్ప అదృష్టం .ఆనంద దాయకం కూడా .అప్పుడే నీకు నచ్చిన నువ్వు అనుకొన్న నువ్వు ప్రేమించిన పనిని ఇష్ట పూర్తిగా నిర్వహించ గలవు .కాలాన్ని ఆదరించు ,గౌరవించు ,రక్షించు .అదే నీ విజయానికి స్వర్ణ సోపానం అవుతుంది 

ఆధారం -రియన్ హాలిడే రచన -డిసిప్లిన్ అండ్ డేష్టిని

 మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -13-12-22-కాంప్-మల్లాపూర్ -హైదారాబాద్ 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.