అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -3
3-ఫాయిల్ బ్రదర్స్
ఫయిల్ బ్రదర్స్ అనే పేరుతొ ఆ సోదరులు సెకండ్ హాండ్ పుస్తకాలు అమ్మేవారు . వారి మెయిన్ ఆఫీస్ 34వేల చదరపు అడుగుల వైశాల్యం గల ఆరు అంతస్తుల బ్రహ్మాండమైన భవనం .అందులో 2లక్షల పుస్తకాలు పెట్టె చోటు ఉంది .విపిపై పుస్తకాలు పంపమని రోజుకు 2వేల ఉత్తరాలు వస్తాయి .ఈ సోదరులు లండన్ లో సివిల్ పరీక్ష రాసి తప్పారు సుమారు అర్ధ శతాబ్దం క్రిందట .కొద్దిగా నిరుత్సాహపడ్డారు విలియం ఫాయిల్ ,గిల్బర్ట్ ఫాయిల్ బ్రదర్స్ .తండ్రికి టోకు సరుకుల దుకాణం ఉంది .తమవద్ద ఉన్న సెకండ్ హాండ్ పుస్తకాలే తమకు జీవనోపాధి కలిగిస్తాయని భావించి వాటి అమ్మకం పై శ్రద్ధ పెట్టారు .
ఒక చిన్న ప్రకటన తయారు చేసి 1903లో ఒక ఎడ్యుకేషనల్ మాగజైన్ కు ఇచ్చారు .అప్రకటన వారికి గొప్ప వారమే అయింది కానీ ఆ పత్రిక పేరు ఇప్పుడు ఎవరికీ తెలియదు .ఆ ప్రకటనలో ఈ బ్రదర్స్ రాసిన వాక్యాలు అందరినీ ఆకర్షించాయి .విపరీతంగా సెకండ్ బుక్స్ అమ్మకం జోరుగాసాగింది .వాళ్ళ దగ్గర ఆ నాడు ఉన్న పుస్తకాలకు మూడు రెట్ల ఆర్డర్స్ వచ్చాయి వాళ్ళు కూడా ఇంత సక్సెస్ అవుతుందని ఊహించ లేదు .మారు బేరం లో సెకండ్ హాండ్ బుక్స్ కొని ఎందుకు అమ్మరాదు ?అనే ఆలోచన వచ్చింది ఆబ్రదర్స్ కు .దానికోసం ప్రకటనల మీదప్రకటనలు గుప్పించారు .పెద్ద మార్కెట్ ఏర్పడింది .చాలా జాగ్రత్తగా నిర్వహణ చేశారు .
మొదట వాళ్ళ ఇంట్లోనే వ్యాపారం ప్రారంభించారు .కొన్న సెకండ్ హాండ్ పుస్తకాలు కూడా ఆ ఇంట్లోనే నిల్వ చేసేవారు .వ్యాపారం దిన దినాభి వృద్ధి చెందుతోంది ఇల్లు ఇరుకైపోయింది .అందుకని వ్యాపారానికి పెక్ హ్యాం అనే చోట ఒక షాపు అద్దె కు తీసుకొన్నారు .పుస్తకాలు కొనటం అమ్మటం అంతా పోస్ట్ ద్వారాజరిపెవారు .కారణం అప్పటికి ఈ సోదరులకు వయసు మైనారిటి దాటలేదు .అందుకని కాంట్రాక్ట్ చేయటానికి వయసు చాలదు కనుక పోస్టాఫీస్ మాత్రమె తేలిక ..ఉన్న షాప్ కు ప్రక్కన ఇంకో గది అద్దెకు తీసుకొన్నారు .అందులోనే ఈ బ్రదర్స్ ఉండేవారు .షాపు వెనక తమ వంట తామే చేసుకొనేవారు .పని చేయటం లో వాళ్లకు పగలు రాత్రీతెదాలేదు ఆదివారం సెలవూ తీసుకోకుండా పని చేశారు .ఇలా ఒక ఏడాది గడిచింది .
తర్వాత వ్యాపారాన్ని బాగా పెంచాలని ఫాయిల్ బ్రదర్స్కు ఆలోచన వచ్చింది
లండన్ లో చారింగ్ క్రాస్ రోడ్ దగ్గర ఒక పెద్ద దుకాణం ను ఏడాదికి 60పౌన్లుకు అద్దెకు తీసుకొన్నారు .మునిసిపల్ పన్నులు వీళ్ళే కట్టుకోవాలి .ఆ షాప్ లో పని చేస్తున్న ఒక అసిస్టెంట్ వీళ్ళకు తెలీకుండా 7 పౌన్లు నాకేసి పారిపోయాడు .కొట్టాసిస్తేంట్ ను పెట్టుకొన్నారు అతడు చాలాసమర్ధంగా విశ్వాసంగా పని చేసి వ్యాపారాభివృద్ధికి గొప్ప సాయం చేశాడు .ఫాయిల్ బ్రదర్స్ కు ప్రపంచమంతా కాతాదారులు ఏర్పడ్డారు .పుస్తకాలకోసం రోజుకు కనీసం 2నుంచి 5వేల వరకు ఆర్డర్లు వచ్చేవి .విజ్ఞాన సముపార్జనకు ఈ సెకండ్ హాండ్ పుస్తకాలు ఎంతగానో దోహదం చేసేవి .ఖర్చు తక్కువ ఫలితం ఎక్కువ .1910నాటికి లండన్ లో నాలుగు చోట్ల సబర్బన్ బ్రాంచీలు ఏర్పాటు చేశారు .ప్రతిపుస్తకం మీద పర్మనెంట్ లేబుల్ అడ్వర్టైజ్ మెంట్ ముద్రించేవారు .సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ లో చర్చి స్ట్రీట్ లో ఒక బ్రాంచ్ నెలకొల్పారు .
1949నాటికి ఫాయిల్ బ్రదర్స్ అద్దె షాపులను వదిలేసి స్వంత భావన నిర్మాణం ప్రారంభించి అందులోనే వ్యాపారం చేయటం మొదలు పెట్టారు .ఆరు అంతస్తుల భవనం కట్టారు .బిల్డింగ్ 30 వేల స్క్వేర్ ఫీట్ వైశాల్యం .ఒకే సారి 20లక్షల పుస్తకాలు పెట్టటానికి వీలుగా ఉండేది .పుస్తక ప్రదర్శనకు విశాలమైన గదులు ఏర్పాటు చేశారు .ప్రఖ్యాత గ్రంధ కర్తలను పిలిపించి వారితో ప్రేరణాత్మక ప్రసంగాలు చేయించటానికి అన్ని వసతులతో పెద్ద హాలు ఏర్పాటు చేశారు .మొదటి 80ఏళ్ళలో వెయ్యిమంది రచయితలూ ,5లక్షలమంది గెస్ట్ లు ఈ సమావేశాలలో పాల్గొన్నారు .రెండవ ప్రపంచయుద్ధం తర్వాత బ్రిటిష్ ప్రైం మినిస్టర్లు ,డ్యూక్ ఆఫ్ ఎడిన్ బర్గ్ ,చార్లెస్ డిగాల్లె ,ఇధియోపియా చక్రవర్తి మొదలైన ప్రముఖులు సందర్శించారు .
కంపెనీ దిగ్విజయంగా 25 ఏళ్ళు నడిచిన సందర్భంగా పెద్ద ఎత్తున ఫాయిల్ బ్రదర్స్ రజతోత్సవం జరిపారు .ఈ షాప్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు చేసుకొన్నది . సెకండ్ హాండ్ బుక్ అమ్మకం లో రికార్ద్సాధించి కుబెరులైనవారు ఫాయిల్ బ్రదర్స్ .ఫాయిల్ బ్రదర్స్ వారసురాలు క్రిస్టియానా కూడా చాలా అభి వృద్ధి చేసింది .
మన దేశం లో మద్రాస్ లో సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర ‘’మూర్ మార్కెట్ ‘’లో సెకండ్ హాండ్ బుక్స్ బాగా దొరికేవి .తర్వాత అగ్నిప్రమాదానికి గురై పారిస్ ప్రాంతానికి మార్చారు .బెజవాడలో అలంకార్ టాకీస్ దగ్గర ,కారల్ మార్క్స్ రోడ్డుమీద సెకండ్ హాండ్ బుక్ షాప్ లు తామర తంపరగా ఉన్నాయి. అక్కడ దొరకని పుస్తకం ఉండదు .
సశేషం
ముక్కోటి ఏకాదశి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-1-23-ఉయ్యూరు
వీక్షకులు
- 1,107,557 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

