అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -14

14-చార్లెస్ ముర్రే

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -14

14-చార్లెస్ ముర్రే

 అమెరికాలోని డెట్రాయిట్ లో చార్లెస్ ముర్రే ఇన్స్యూరెన్స్ ఏజెంట్ .ఇన్సూరెన్స్ ఏజెంట్ లలో ప్రపంచ రికార్డ్ స్థాపించాడు హేన్రిఫోర్డ్ ఫోర్డ్ మోటార్ రాజుగా సుప్రసిద్ధుడు .ఇద్దరిదీ డెట్రాయిట అవటం విచిత్రం .వరసగా 101రోజులు రోజూ కనీసం ఒక్కరినైనా జీవిత బీమా లో చేర్చిన ఘటికుడు .ఇది వరల్డ్ రికార్డ్ ఇన్సూరెన్స్ చరిత్రలో .కానీ 102వ రోజు ఒక్క పాలసీకూడా అమ్మలేక పోవటం మరో విచిత్రం.

  ఎలా ఇలా పాలసీదార్లను చేర్చగలిగాడు ?అనేది మిలియన్ డాలర్ క్వస్చిన .దానికి అతడు చక్కని వ్యూహ రచన చేశాడు .తనకు అతిదగ్గర బంధువులు మిత్రుల లలో పాలసి తీసుకోగలవారి108 పేర్ల లిస్టు తయారు చేసుకొన్నాడు.తర్వాత వాళ్లకు పాలసి తతీసుకొనే వారి పేర్లను పంపమని ఉత్తరాలు రాశాడు .కొద్దిగా మాత్రమె అది ఉపయోగ పడింది .ఇలా లాభం లేదనుకొని స్వయంగా వాళ్ళను వెళ్లి కలిశాడు .వాళ్ళు పేర్లు సూచించారు .మర్నాడు కలవాల్సిన వారి గురించి ముందు రోజు రాత్రే ఆలోచించుకొని ఎలా వారితో మాట్లాడి ఒప్పించాలో ప్రణాళిక తయారు చేసుకొన్నాడు .ప్రతి గంట సార్ధకమైనదిగా భావించాడు .రోజుకు కనీసం ఎనిమిది గంటలు గరిష్టంగా పన్నెండు గంటలు ఆపనిలో ఉండేవాడు .ఆదివారాలలో సెలవు రోజుల్లో పని చేయకుండా ఉండటం ఒక పాలసిగా పెట్టుకొన్నాడు .

  ఒక రోజు ఉదయాన్నే తనకు పాలుపోసే బకరాను మాటల్లో పడేసి రెండు వందల పౌన్లకు  పాలసి అంటగట్టాడు .’’జీవిత బీమా వ్యాపారం లో ప్రతివాడు కొనుగోలు దారే ‘’అంటే కష్టమరే అనే వాడు .ఒక ఫాక్టరీ మాన్యు ఫాక్చరర్ కు పాలసి అమ్మాలని వెళ్లి ఆయన బిజీగా ఉండటం తో అక్కడి టైపిస్ట్ ను ముగ్గులో దించి పాలసి అమ్మేశాడు .పాలసి దారు కష్ట సుఖాలను ,ఆర్ధిక వనరుల విషయాలను సావకాశంగా వినేవాడు .వారికి లాభసాటి గా ఉన్న తగిన పాలసీ వివరాలు చెప్పి కొనిపించేవాడు .పాలసీదారులు బిజీగా ఉంటె వేరే వారిని కలిసి ఆసమయం వ్యర్ధంకాకుండా పాలసీ ని అమ్మేవాడు .తాను  వస్తే గృహస్తులు భయంతో పారిపోయే సీన్ ఏనాడూ అతడు కలిగించలేదు .అతన్ని నవ్వుతూ ధీమా గా భీమా కొనటానికే ఆహ్వానించేవారు .

  మొదట్లో ముర్రే రైల్వే స్టేషన్ లో  టికెట్లు అమ్మే వాడు. అక్కడ టికెట్లు పెద్దగా తెగేవికాదు .పనిలేక బోర్ కొట్టేది.ట్రేడింగ్ గురించిన పుస్తకాలు చదివి ఖాళీసమయాన్ని భర్తీ చేసుకొంటూ ట్రేడ్ సీక్రెట్స్ తెలుసుకొన్నాడు .తర్వాత లాభ సాటిది భీమా అని నిర్ణయించి ఏజెంట్ అయ్యాడు .రెండేళ్ళు ఇన్స్యూరెన్స్ కు సంబంధించిన పుస్తకాలన్నీ తిరగేసి అందులోని రహస్యాలు గ్రహించాడు .టిక్కెట్ ఇక్కట్లకు బై చెప్పి ఇన్సూరెన్స్ ఏజెంట్ అయ్యాడు .ఇందులో అతడు తన శక్తి సామర్ధ్యాలవలననే గొప్ప విజయం సాధించాడు .వేగంగా సూటిగా భీమా వ్యాపారాన్ని చేసి వరల్డ్ రికార్డ్ సాధించాడు .

15-యం.బీ.స్కాగ్స్

1930 నాటికి  40సంవత్సరాల యం.బీ.స్కాగ్స్,అమెరికా పడమటి భాగం లో  357 అనేక రకాలు అమ్మే దుకాణాలకు అంటే స్టోర్స్ కు యజమాని అయ్యాడు .1929నాటికి వీటన్నిటిలో 56లక్షల పౌన్ల విలువగల సరుకు అమ్మాడు .ఒక్కో కష్టమర్ కు సగటున ఎక్కువ సరకులు అమ్మినవాడుగా ప్రసిద్ధి చెందాడు .అందరు గొప్ప వాళ్లలాగా యితడు పుట్టు దరిద్రుడే .తండ్రి మతగురువు .జీతం అల్పం .12మంది సంతానమున్న బహు కుటుంబీకుడు .

  14ఏళ్ళకే స్కాగ్స్ సొంతంగా డబ్బు సంపాదించటం మొదలు పెట్టాడు .వారానికి ఆరు షెల్లి౦గుల జీతం తో ఒక గ్రోసరిషాప్ లో పనికి చేరాడు .19వ యేటస్వయంగా చిన్న దుకాణం స్వంతంగా ప్రారంభింఛి ఏడేళ్ళు దిగ్విజయంగా నడిపాడు .కొద్ది లాభం తోనే సరుకు అమ్మటంవలన వ్యాపారంలో పెద్దగా పీకింది ఏమీ లేదు .అయినా బతకటానికి ఇబ్బంది లేకుండా గడిచింది .

  తనది ఎడదుగు బొదుగు లేని  గొర్రెకు బెత్తెడు తోక జీవితం  అని గ్రహించాడు .ఎక్కువగా సరుకు అమ్మితేనే గిడుతుంది అని గ్రహించి ,ఒక తోట యజమాని వద్ద ఒక రైల్వే వాగన్ నిండా పీచ్ పళ్ళనుకొని,దానికి చెల్లించాల్సి డబ్బు తన దగ్గర లేకపోవటంతో ఏరోజు కారోజు అమ్మి  బ్యాంక్ చెక్ ద్వారా తోటయజమానికి పంపెట్లు ఒప్పందం కుదుర్చుకొని అమ్మటం ప్రారంభించి మాట నిలుపుకొన్నాడు .దుకాణానికి  సరుకు చేరకముందే తనదగ్గర పీచ్ పళ్ళు ఉన్నాయని కరపత్రాలు ముద్రించి పట్టణం అంతా ప్రచారం చేశాడు .కొట్టుకు చేరటం ఆలస్యం ఆవ్యాగన్ సరుకు నిమిషాలమీద అమ్ముడైపోయి ఆశ్చర్యం కలిగించింది .తోట యమాని  కి పూర్తీ డబ్బు చెల్లించి మరో మూడు వ్యాగన్ల పీచ్ పళ్ళను కొన్నాడు .అమ్మేశాడు .తర్వాత కాబేజిని కూడా ఇలాగే భారీగాకొని అమ్మాడు .ఇండియా రైల్ వ్యాగన్ కంటే అమెరికా రైల్ వ్యాగన్ నాలుగు రెట్లు పెద్దది కనుక అతడు ఎంత సరుకు అమ్మేవాడో ఊహిస్తే గుండె జలదరిస్తుంది .కొద్దికాలానికే వారానికి 600పౌన్ల అమ్మకానికి యజమాని అయ్యాడు .

  ఎక్కువ షాపులు వుంటే ఇంకా  ఎక్కువ అమ్మచ్చు అనుకొని షాపు లను కొనటం మొదలుపెట్టి వ్యాపారం వేగంగా  పెంచాడు .అతడి వ్యాపరరహస్యాం లార్జి స్కేల్ లో సరుకు ఉత్పత్తి దారుల దగ్గరే కారు చౌకగా కొనటం తగినంత లాభంతో అమ్మటం .ఇది బాగా క్లిక్ అయింది .దుకాణం నిండా సరుకు ఉంటె కష్టమర్లు హాపీ ఫీలై వచ్చి కొంటారు అనే గొప్ప నమ్మకం ఆతనిది .అదే పాటించి గ్రోసరీ  కుబేరుడయ్యాడు  .బాక్స్ ల నిండా సరుకు కనపడాలి అప్పుడే కొనే వారికి అట్రాక్షన్ అంటాడు .దుకాణం వెనక తూచటానికి కాటా ఉంటుంది .సరుకును పోట్లాలుకట్టికానీ,సంచుల్లో పోసి కాని అందజేసేవాడు .షాప్ మధ్యలో వివిధరకాలైన సరుకు గుట్టలుగుట్ట లుగా ఉంటుంది .

  తక్కువ ధరకు ఎక్కువ వస్తువులను కొనటం స్కగ్స్ ఖాతాదార్లకు నేర్పాడు .చిల్లర వ్యాపారం అతడి కంటికి ఆనలేదు .కొడితే ఏనుగు  కుంభ స్థలాన్నే  కొట్టాలి అనేరకం .లాట్ లు లాట్లుగా కొనటం లాట్లుగా మ్మటమ తడికి కలిసి వచ్చింది .ఆ షాప్  లోని తాజాసరుకు పరిమళానికి అతడు పొంగిపోఎవాడు .అందుకే 1930 నాటికి 357 షాపుల ఓనర్ అయ్యాడు .అతడి ప్రతిషాప్ లో గంటకు రెండు పౌన్ల కాఫీ పొడి తయారవ్వాల్సిందే .ఆకాఫీ వాసనకు వినియోగదార్లు ఫిదా అయిపోవాల్సిందే .కాఫీపొడి కొని తీసుకొని వెళ్లి మాంచి కాఫీ తాగాల్సిందే. సరుకుల కమకమ్మని సువాసనతో అతడు ఖాతాదార్లను విశేషంగా ఆకర్షించాడు .

  ఇంత వ్యాపారం చేసిన స్కాగ్స్ పెద్దగా చదువుకోలేదు .మేధావికూడా కాదు అతడిది ఉక్కు సంకల్పం .సాధారణ బట్టలే ధరించేవాడు .అతడి టోపీ గుడ్డతో తయారైన మామూలు దే .అతడి విజయానికి అనుసరించి పద్ధతులు –తాను  అమ్మగాలిగిన దానికంటే ఎక్కువ సరుకు కొనటం ,దాన్ని పూర్తిగా అమ్మేయటం ,దుకాణంలో సరుకు లేదు అనే మాట ఉండకుండా చూడటం ,ఒకరకంగా పచ్చి సరుకు వ్యాపారం తో ప్రారంభించి  అపర కుబెరుడైనాడు స్కాగ్స్ .

  అసలుపేరు మెరియన్ బార్టన్ స్కాగ్స్ .5-4-1888లో అమెరికలో పుట్టి 8-5-1976న 88వ ఏట చనిపోయాడు ఇవాల్టి సూపర్ మార్కెట్ కు మార్గదర్శి .సేఫ్ వె స్టోర్స్ అతనివల్లనే ఏర్పడ్డాయి .వీటినే స్కాగ్స్ కాష్ స్టోర్స్ అంటారు .వాల్ స్ట్రీట్ కు ఎక్సిక్యూటివ్ అయ్యాడు .

  ఆధారం –ఆంద్ర భూమి సంపాదకులు శ్రీఆండ్ర శేషగిరి రావు రాసిన ‘’వాణిజ్య పూజ్యులు ‘’పుస్తకం .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.