మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -383

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -383

· 383-వెన్నెల ,ప్రస్థానం సినీ దర్శకుడు ,డాక్యుమెంటరి నిర్మాత –దేవ కట్టా

· దేవ కట్టా ఒక ప్రవాసాంధ్రుడైన సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత. 2010 లో ఆయన నిర్మించి, దర్శకత్వం వహించిన ప్రస్థానం సినిమా అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో, ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది.[1] ఈ సినిమా ఫిలిం ఫేర్ ఉత్తమ విమర్శకుల చిత్రంగా, నంది మూడో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.

వ్యక్తిగతం
దేవా కడప జిల్లా, జెట్టివారిపల్లి గ్రామంలో జన్మించాడు. తండ్రి పేరు నిరంజన్ నాయుడు. అతని కుటుంబం మద్రాసుకు తరలి వెళ్ళింది. దేవ అక్కడే పెరిగాడు. చెన్నై లోని సత్యభామ కళాశాల నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. తరువాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. డెట్రాయిట్ రాష్ట్రంలోని మిషిగన్ లో వేన్ స్టేట్ యూనివర్శిటీ నుంచి ఎమ్మెస్ చేశాడు. చదువైపోయిన తరువాత జనరల్ మోటార్స్ లో ఉద్యోగం చేశాడు.

నటనా రంగం
ఉద్యోగం చేస్తూనే సినిమాలకు సంబంధించిన కోర్సు చేశాడు. తరువాత అమెరికాలో భారతీయ విద్యార్థుల స్థితిగతులను ప్రతిబింబిస్తూ వలస అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించాడు. అదే నేపథ్యంలో వెన్నెల సినిమాతో దర్శకుడిగా, రచయితగా తన ప్రస్థానం ప్రారంభించాడు.[2][3][4]

దర్శకత్వం వహించిన సినిమాలు
· వెన్నెల (2005)

· ప్రస్థానం (2010)

· ఆటోనగర్ సూర్య (2014)

· రిపబ్లిక్ (2021)

384-ఆర్కా మీడియా వ్యవస్థాపకుడు ,పల్లకిలో పెళ్ళికూతురు ,బాహుబలి ,మర్యాద రామన్న సినీ సహనిర్మాత –దేవినేని ప్రసాద్
దేవినేని ప్రసాద్ ఒక ప్రముఖ సినీ నిర్మాత. ఆర్కా మీడియా వర్క్స్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు.[1][2] పల్లకిలో పెళ్ళికూతురు, పంజా, మర్యాద రామన్న, వన్స్ అపాన్ ఎ వారియర్, వేదం, బాహుబలి:ద బిగినింగ్ లాంటి సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించాడు.[3][4]
కెరీర్
2010 లో ఆయన నిర్మించిన మర్యాద రామన్న సినిమా నంది ఉత్తమ చిత్రం పురస్కారం అందుకుంది.[5] 2015 లో శోభు యార్లగడ్డతో కలిసి నిర్మించిన బాహుబలి చిత్రం భారతదేశంలో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది.[6][7][8]

పురస్కారాలు
· బాహుబలి చిత్రానికిగాను జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారం

· మర్యాద రామన్న సినిమాకు నంది ఉత్తమ చిత్ర పురస్కారం

· 2010 లో వేదం సినిమాకు ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారం

ఆదాయపు పన్ను శాఖ దాడులు
నవంబరు 11, 2016 న ఆదాయపు పన్ను శాఖ బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్, వారి సంస్థ యైన ఆర్కా మీడియా వర్క్స్ కార్యాలయాలపై సోదాలు నిర్వహించింది.[9]

· 385-దేవి ఫిలిమ్స్ నిర్మాత ,కధానాయకుడికధ ,నా దేశం ,కొండవీటి దొంగ హిట్ చిత్ర ఫేం –దేవి వర ప్రసాద్

· దేవీవర ప్రసాద్ తెలుగు సినీ నిర్మాత. దేవీఫిలింస్ బేనరు పై పలు విజయవంతమైన తెలుగు చిత్రాలు నిర్మంచాడు.

జీవిత విశేషాలు
అతను 1943 డిసెంబరు 6న విజయవాడలో జన్మించాడు. నందమూరి తారక రామారావు ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టాడు.

దేవి వర ప్రసాద్ తండ్రి తిరుపతయ్య సినిమా పంపిణీదారుడు అయిన ఎన్టీఆర్ కు సన్నిహితుడు. అతను ఎన్టీఆర్ యొక్క మూడు సినిమాలకు కూడా భాగస్వామి. ప్రసాద్ నందమూరి తారక రామారావు ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టాడు. నిర్మాతగా అతను ఎన్‌టిఆర్‌తో కథానాయకుని కథ, కేడీ నంబర్ 1, తిరుగులేని మనీషి, నా దేశం వంటి చిత్రాలను తీసాడు[1]. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత దేవి వర ప్రసాద్ చిరంజీవితో సినిమాలు చేయడం ప్రారంభించాడు. చట్టంతో పోరాటం సగటు కంటే ఎక్కువగా ఉండగా కొండవీటి దొంగ, మంచి దొంగ పెద్ద విజయాలు సాధించాయి. ఘరానా మొగుడు బ్లాక్ బస్టర్‌గా మారింది. చిరంజీవి యొక్క టాప్ 5 సూపర్ డూపర్ హిట్స్‌లో ఈ చిత్రాన్ని పేర్కొనాలి. తరువాత అల్లుడా మజాకా చిత్రం కూడా మంచి కలెక్షన్లు సాధించి విజయాన్ని సాధించింది. అయితే తదనంతరం మృగరాజు టైటిల్‌తో గుణ శేఖర్‌తో దర్శకుడిగా దేవి వర ప్రసాద్ చిత్రం పూర్తిగా అపజయం పాలైంది. దేవి వర ప్రసాద్ యొక్క దాదాపు అన్ని ఆదాయాలు ఈ చిత్రంతో కొట్టుకుపోయాయి.[2] ఆ తర్వాత అతను చిరంజీవితో సినిమా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. మృగరాజుతో ప్రతిదీ కోల్పోయినందున, చిరంజీవి తనపై దయ చూపవచ్చని ఆతను భావించాడు. కానీ అది జరుగలేదు. తర్వాత ఆర్థికంగా బాగా చితికిపోయాడు. అతని చివరి సినిమా భజంత్రీలు కూడా అనుకున్న విజయం సాధించక ఇంకా ఆర్థిక నష్టాలను అనుభవించి అనారోగ్య పాలయ్యాడు.

సినిమాలు
భలే తమ్ముడు , కథానాయకుని కథ, భలేదొంగ, మంచి దొంగ, కొండ వీటి రాజా, అల్లుడా మజాకా, కేడీ నెంబర్ వన్, ఘరానా మొగుడు ,మృగరాజు, భజంత్రీలు, అమ్మ రాజీనామా వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు.

మరణం
దేవి వర ప్రసాద్ కాలేయ సంబంధిత వ్యాధి, మధుమేహంతో బాధపడుతూ కిమ్స్ హాస్పిటల్లో చేరాడు. అతను 2010 డిసెంబరు 10 న మరణించాడు.[3]

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-1-23-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.