పద్మ భూషణ్ –కాజీనజ్రుల్ ఇస్లాం -9 ఆకాశ యాత్రికుడు

పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -9

  ఆకాశ యాత్రికుడు

   రవీంద్రుడి లాగా  నజ్రుల్ కూడా సంగీత ప్రియుడు .అందువలన బెంగాల్ జానపద సంగీతం ధన్యమైంది .కథ తో, స్వరం తో ఆసంగీతం పురి విప్పి నాట్యమాడింది .వేణువు ను సునాయాసంగా వాయించేవాడు .శాస్త్రీయ సంగీతం లో దిట్ట అయిన సతీష్ చంద్ర కంజీలాల్ దృష్టిలో నజ్రుల్ పడ్డాడు .సంగీతం లో మొదటిపాఠాలు ఆయనే తనకు తానె వచ్చి నజ్రుల్ కు నేర్పాడు .కరాచీలో ఉండగా వివిధ బాణీలను అధ్యయనం చేసి స్వయంగా నేర్చాడు .కలకత్తాలో నవీన’’ గేయ గాయకుడి’’గా ప్రసిద్ధి చెందాడు .కవిత్వం కంటే సంగీతంతోనే అందరికి దగ్గరయ్యాడు .స్వచ్చమైన శ్రావ్యమైన గాత్రం నజ్రుల్ స్వంతం ..శబ్ద, భావావేశ, బాణీల త్రివేణీ సంగమం .జాతీయ ఉద్యమం లో తన సంగీతం తో జనాన్ని ప్రభావితం చేశాడు .1926కే సృజనాత్మక కళాకారుడిగా ప్రసిద్ధి చెందాడు .ఆంగ్లకవి షెల్లీ స్కైలార్క్ లాగా ఆకాశ యాత్రికుడయ్యాడు .

  1926 కి ఇంకా సినీ సంగీతం లేదు గ్రామఫోన్ రికార్డ్ లే ప్రచారానికి సాధనాలు .హిజ్ మాస్టర్స్ వాయిస్ రికార్డ్ కంపెనీలో నజ్రుల్ పాటలు రెండిటిని హరీన్ ఘోష్ అనే కంపెనీ అధికారి నజ్రుల్ కు తెలియకుండానే చేర్చేశాడు .అవి బాగా క్లిక్ అవటంతో ఆయన పాటలు చాలా రికార్డ్ లలో చోటు చేసుకొన్నాయి .వీటిలో రాయల్టీ బాగా వచ్చేది పుస్తకాలకు  వచ్చే డబ్బు కంటే ఇదే చాలా హెచ్చు మొత్తంగా ఉండేది .నజ్రుల్ సంగీతానికి జనం పరవశం పొందటం తో ఆయన రికార్డ్ లకు గిరాకీ విపరీతంగా పెరిగింది .ఆయనపై భక్తీ ఆరాధన అధికమయ్యాయి .కంపెని సంగీత విద్వాంసుడు ఉస్తాద్ జియాఉద్దీన్ సుఖాన్ వద్ద మెళకువలు నేర్చాడు .ఆయన సాయంతో నజ్రుల్ గీతాల సంకలనం ‘’వన గీతి ‘’విడుదల చేసి సుఖాన్ కు అంకితమిచ్చాడు నజ్రుల్ .సుఖాన్ మరణంతో నజ్రుల్ ను ఆస్థానం లో గురువుగా ఆకంపెనీ గౌరవంగా నియమించింది .రేడియో వారు ,ఫిలిం నిర్మాతలుకూడా ఆయన ప్రతిభను గుర్తి౦చి సద్వినియోగం చేసుకొనే వారు .

  హాయిగా వస్తున్న డబ్బు హోదాను తనివి తీరా అనుభవించాడు నజ్రుల్.,కొత్త క్రిస్లర్ కారుకొన్నాడు .ఆకారులో మిత్రులను త్రిప్పేవాడు .మిత్రులతో గడపటం మొదటినుంచి అలవాటేకనుక ఇప్పుడు మరీ ఎక్కువైంది .జల్సాగా విపరీతంగా ఖర్చు చేస్తున్నాడు .రేపటికోసం అనే తపన లేకుండా .ఈ హంగామా కొద్దికాలమే .పెద్దకొడుకు,ఇంట్లో అందరికి ప్రేమపాత్రుడు  బుల్ బుల్ మూడున్నర ఏళ్లకే 7-8-1934న చనిపోయాడు .మృత్యువు-జీవితం అనే అశం ఆయన్ను ప్రభావితం చేసింది .1942లో మానసిక ఉన్మాదం వచ్చేవరకు ఈ సంగీత ప్రపంచంలోనే విహరించాడు ,కొడుకు మరణం మరిన్ని రికార్డ్ లకోసం హెచ్. ఎం. వి. కంపెని పెట్టె ఒత్తిడి తట్టుకోలేక పోయాడు .దీనితో రికార్డ్ లలో సామాన్యమైన  గీతాలు కూడా చోటు చేసుకొన్నాయి ఆయన శ్రద్ధతగ్గటం వలన .ఆయన రాసి, వరుసలుకట్టిన 3300 పాటలలోనుంచి రెండు వేలపాటలు మాత్రమె భద్రం చేయటం జరిగింది .అందులో బుల్ బుల్,చోఖేర్ చాతక , నజ్రుల్ గీతికా ,సుర్-సాకి , జుల్ఫికర్ ,వనగీతి ,గుల్ బగీచా ,గీతి శత దళ్,సుర్ మహల్ ,గానేర్ మాల 1928-34మధ్య పాడి రికార్డ్ చేసినవి లభించాయి .జనప్రియమైన జాతీయ గీతాలు కాక మిగిలిన జాతీయగీతాలవైపు ఎవరూ  శ్రద్ధ పడి జాగ్రత్త చెయ్యలేదు .ఇదొక  పెద్ద పనే అయిపొయింది .ఈమధ్యనే అజహరుద్దీన్ సుఖాన్ ఎంతో శ్రమపడి సుమారు 1700పాటల సూచికను ,ప్రతిపాట మొదటి పంక్తి ని కేటలాగు తయారు చేశాడు .ఆయన రాసి స్వరపరచిన మూడు వేలపైగా  పాటలు సంఖ్య కు మాత్రమేకాక వైవిధ్యానికి మనం ఆశ్చర్యపోతాం .అందులో స్వదేశీ పాటలు ,ప్రేమ పాటలు ,ప్రకృతిపాటలు ఆధ్యాత్మిక పాటలు కౌతుక్ పాటలు,ఇతర పాటలు అని స్థూలంగా విభజించవచ్చు ఆయన రాసిన ఏ జాతీయ గీతాన్ని చూసినా 1920-47మధ్యకాలం ముందడుగు వేస్తున్న భారత దేశాన్ని గుర్తించవచ్చు .వ్యంగ్యగీతాలు ప్రభావ శీల గీతాలు చాలా ఉన్నాయి .వాటిల్లోనూ జాతీయ విశిష్టత దర్శనమిస్తుంది .ఇవన్నీ బయటికి వచ్చేసరికి ఆయన దృష్టి గజల్స్ పై పడింది .

  1920-30కాలం లో రాసిన గజల్స్ బెంగాలీలను సమ్మోహితుల్ని చేశాయి .అవి కొత్తవి అద్వితీయమైనవి .సృజనాత్మికాన్ని చక్కగా మలచిన వి .వాటిలో సౌందర్యం ,కవిత్వం సమ్మోహన శక్తి నిండుగా ప్రవహించాయి .వాటిలో జుల్ఫికార్ మతాభిమానాన్ని ఆధ్యాత్మికత ను కొత్త కోణం లో చూపించింది .వాటిఆకర్షణ తీవ్రం ,లోతైనవి .భక్తీ ప్రాదాన్యమున్నవి .ఇన్ని ఉన్నా ఆయనది జానపద నేపధ్యం .ఆసంగీత సాహిత్యాలు ఆయన్ను పరవశి౦పజేస్తాయి .వాటిలో బెంగాలీ సంగీత ‘’కీర్తన ‘’విశిష్టమైనది .’’భాటియాలి ‘’-నదిపాట పడవ పాట కు తూర్పు బెంగాల్ పుట్టుక స్థానం .తూర్పు బెంగాల్ సంగీతం లోజారీ, సారి, మిష్టిక్  అని మూడు రకాలు .ఆనాటి హిందూ భక్తిగీతాలు ఆయన్ను ప్రభావితం చేశాయి .అందులోనూ తన సృజనను అత్యద్భుతంగా ప్రవేశపెట్టి భక్తికి గొప్ప పరమార్ధాన్ని చేకూర్చాడు. వీటినీ ఎవరూ జాగ్రత్త చేయలేదు .దొరికిన వాటిలో ఓజో ప్రధానంగా వీరరస ప్రధానంగా ఉన్న ప్రయాణ పాటలు .ఇలాంటివి బెంగాలీ సాహిత్యంలో నజ్రుల్ కు సాటి ఎవరూలేరు .బెంగాలీ గాన్ కు ‘’గజల్’’ సృష్టించి’’నూతన  యుగకర్త’’ అయ్యాడు నజ్రుల్. భక్తీ ప్రధాన సంగీతంలో నజ్రుల్ అద్వితీయుడు. శ్యామ సంగీతం ,ఇస్లాం భక్తీ సంగీతం మేళవించి భారతీయ ప్రతిభను జగద్విఖ్యాతం చేశాడు .రవీంద్రుడు ,అతుల్ ప్రసాద్ సేన్,రజనీ కాంత సేన్లతోపాటు నజ్రుల్  బెంగాలీ పాటలకు సృజనాత్మకత జోడించి అపూర్వ వైభవాన్ని కల్గించాడు .నజ్రుల్ పాటలను విస్తృతంగా ప్రచారం చేసిన సంగీత దర్శకులు సచిన్ దేవ బర్మన్ ,దిలీప్ కుమార్ రాయ్ ,అబ్బానుద్దీన్ ,కమల దాస్ గుప్త ,ధీరేంద్ర చంద్రమిత్ర ,సంతోష సేన్ గుప్తా ,సుప్రభా సర్కార్ ,ఫిరోజ్ బేగం .మొదలలైన వారు .కవి నజ్రుల్ కన్నా సంగీత నజ్రుల్ మహా గొప్పవాడు .పాటలలో నజ్రుల్ సహజ గుణం సర్వోత్రుష్టంగా ఆవిష్కారం పొంది చిరంజీవిని చేసింది .

   సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-2-23-ఉయ్యూరు   ,

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.