శ్రీ రంగ శతకం
శ్రీ తిరు మ౦డ్యందిగవింటి నారాయణ దాసు గారు ‘’శ్రీ రంగ శతకం ‘’రచించి ,అనంతపురం కాలేజి తెలుగు పండితులు శ్రీ ప్రయాగ వేంకట రామ శాస్త్రి గారి చే పరిష్కరిమ్పజేసి ,1934లో తిరుపతి లోని గోల్డెన్ పవర్ ప్రెస్ లో ముద్రి౦పి౦ చారు .వెల-రెండు అణాలు .కవిగారు బ్రాహ్మణ పట్టు గ్రామ నివాసి .బ్రహ్మ విద్యా పరిపూర్ణ శ్రీ మత్కుమ్జమూరు శ్రీ గోపాలాచార్యవార్య యతీంద్ర చంద్ర గురు శేఖర ప్రియ శిష్యులు .పీఠికలో ‘’నేను పంచ కావ్యాలు చదవలేదు .ఛందస్సు తెలియదు .శాస్త్రీయ గ్రంధాల ను చూడలేదు .భక్త శరణ్యు డైన ఇందిరా రమణుడైన శ్రీ రంగనాధస్వామి పై అపరిమిత భక్తీ ఉన్నవాడిని .స్వామి ప్రేరణతో కీర్తనలు ,పద్యాలు గిలకడం అలవాటైంది .అందుకే ఈ శతకం రాస్తున్నాను .నేను తిరు మండ్య గ్రామం లో పుట్టాను .వన్నియ కుల సంజనితులైన శ్రీ మద్దిగ వింటి శ్రీ చెంగా రెడ్డి మునియామ్బ ల రెండవ కుమారుడిని .నా గురువులు అనురుణ సరోవరం అనే అప్పలాయ గుంట నివాసి శ్రీ కనమలూరు వెంకట సుబ్బయ్య ,వడవాల గ్రామ వాసి శ్రీ సర్వేపల్లి సుబ్రహ్మణ్య గార్లు .గురు కృపా కటాక్షం చేత శ్రీ రంగం చేరాను .నాపై సంపూర్ణ అనుగ్రహం ప్రసాదించిన వారు శ్రీ కుమ్జమూరు గోపాలాచార్య యతీశ్వరులు .గురు ,దైవాలకు సభక్తికంగా నమస్కరించి ఈ’’శ్రీ రంగ శతకం ‘’రాశాను ‘’అని అత్యంత వినయంగా కవి చెప్పుకొన్నారు ఇది కంద పద్య శతకం .’’రంగా ‘’అనేది శతక మకుటం .
మొదటి పద్యం –‘’శ్రీమన్నారాయణ హరి –సామజ పరిపాల వరద సజ్జన లోలా –నేమముతో నిను దలచెద-కామితముల నొసగి నన్ను గావుము రంగా ‘’తర్వాత పద్యం లో ‘’దనుజ గణ వన కుఠారా –మునిమానస నళిన మిత్ర మురళీ లోలా ‘’అని స్తోత్రం చేశారు .తర్వాత గజేంద్ర మోక్షం ,గుర్తు చేసి ,’’గంగాధర వందిత ‘’అనీ మెచ్చారు .మారశతకోటి రూపా ,తారేశ దినేశ నయనా ,తారకనామా ‘’అని నుతి౦చార .లాలి పాడారు ,జోజో లోక శరణ్యా –జోజో శతపత్ర నయన –జోజో నృహరీ –జోజో నిలింప రక్షక ‘’అని జోలకూడా పాడారు .తర్వాత హెచ్చరికలు చేశారు భక్తీ ఆర్తి కలిపి .నూట పదకొండవ క౦దంలో ‘’ఈ రంగ శతక మెవ్వరు-కోరి పఠించినను వినిన కోరిన వరముల్ –నారాయణ యిమ్మని నిను –కోరి భజించితిని శరణు గురువర రంగా ‘’అంటూ ఫలశ్రుతి తొ ముగించారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-5-23-ఉయ్యూరు

