అనేక మలుపులు తిరిగి గమ్యస్థానం చేరిన ‘’అనుకోని ప్రయాణం ‘’.
రెండు సార్లు వచ్చిన కరోనా వేవ్ ,వాటి ననుసరించి అమలైన ‘’కర్ఫ్యూ ‘’నేపధ్యంగా సా—గిన సినిమా ఇది .కోవిడ్ పై అనేల కవితలు కధలు వచ్చాయి .కానీ ధైర్యం గా సినిమా తీయటం సాహసమే .ఆ సాహసాన్ని చేసి ‘’కడకంటి చూపు ‘’ప్రాధాన్యత ను ,తాగుబోతులైనా ,ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న గాఢ అనుబంధం ను చక్కని ప్రకృతి దృశ్యాలమధ్య చూపిన సినిమా .ముఖ్య పాత్రలు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ,’’నట నస ‘’అని పించుకొన్నజానపద హీరో నరసింహ రాజు .ఈ ఇద్దరి మిత్రత్వం అజరామరం అని నిరూపించిన చిత్రం .మొదట్లోనే రాజు గుండెపోటుతో చనిపోతే ,మిత్రుడికిచ్చిన వాగ్దానం నెర వేర్చ టానికి రాజేంద్ర ప్రసాద్ ,అతడి శవాన్ని బస్సులో ట్రక్కులో , బుజాలపై మోసుకు పోతూ అనేక మజిలీలు ,పోలీసు ఆఫిసర్ల అనుమానాలు ఆంక్షలు ,మధ్యలో సినిమాటిక్ చిత్రీకరణ ,క్రూడ్ విలనీ లను దాటుకొని కస్తూరి అనే ఒక డాక్టర్ కారుణ్యం తొ , భార్యపై మమకారం తొ ఆమె పేర ఆయుర్వేద క్లినిక్ నిర్వహిస్తున్న శుభ లేఖ సుధాకర్, ల సాయంతో స్నేహితుడు రాజు శవాన్ని ఆతని కుటుంబానికి అప్పగించటానికి అతని ఊరు వస్తే ,వాళ్ళు కంచే వేసి ఎవర్నీ ఊళ్లోకి రానివ్వక పొతే డా కస్తూరి మానవత్వం తొ చేసిన సాయంతో స్నేహితుడు రాజుకు ఇచ్చిన మాట నిలబెట్టుకొంటాడు రాజేంద్ర . రాజు భార్యగా తులసి చక్కని పరిణత నటన ప్రదర్శించింది .రాజు తండ్రిగా నారాయణ రావు తన సహజ నటన చూపాడు .సుదీర్ఘమైన ప్రయాణం ఇది .ఒరిస్సాలోని భువ నేశ్వర్ నుంచి విశాఖమీదుగా రాజమండ్రి దగ్గర పల్లెటూరు ప్రయాణం .చక్కని కనువిందైన ప్రకృతి పరిమళం మనసుకు ఆహ్లాదంకలిగిస్తుంది .బాధ్యత ఎంతటి కష్టాన్నైనా భరిస్తుంది అనే గొప్ప సందేశం ఉంది.
పరమపస సోపాన పాఠం ఆడే ఇద్దరు హాస్యగాళ్ల ద్వారా కద చెప్పిస్తాడు దర్శకుడు .ఏరియల్ లాండ్ స్కేప్ షాట్స్ హైలైట్ .దీన్ని అత్యద్భుతం గా తీసిన నరగాని మల్లికార్జున్ అభినంద నేయుడు .అరకులోయ అందాలు ‘’ఆరేసుకోబోయి పారేసుకొన్నట్లు ‘’న్నాయి .దినవహి శివ సంగీతం వినిపించీ వినిపించకుండా ,ఉంటే సాహిత్య౦ అర్ధమాయీ అర్ధం కానట్లు భావాన్ని మరుగు పరచిందేమో అనిపించింది నాకు .తూము రాము ఎడిటింగ్ లో ఇంకొంచెం జాగ్రత్త పడితే నిడివి తగ్గి స్పీడ్ అందు కోనేదేమో మూవీ .పెద్ది రెడ్ల వెంకటేష్ సమర్ధుడైన దర్శకుడు అనే అనిపిస్తాడు .చెప్పాల్సింది ఎలా చెప్పాలో చూపించాలో బాగా తెలిసే చేశాడు .దినవహి శివ పాత ఆది నుంచి అంతం వరకు హంట్ చేస్తుంది .
ఇవాళ మధ్యాహ్నమే ‘’అనుకోకుండా ‘’ ఈ సినిమా ‘’అనుకోని ప్రయాణం ‘’చూశాను అమజాన్ ప్రైం లో .నాకు నచ్చిన విషయాలు మీ ముందు ఉంచాను .ఇది 2022లో రిలీజ్ అయిన సినెమా .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-6-23-ఉయ్యూరు

