25 ఏళ్లకే సంస్కృత ప్రొఫెసర్ అయి ,’’కాదంబరి’’ ప్రచురించిన స్కాట్లాండ్ సంస్కృత విద్వాంసుడు –పీటర్ పీటర్సన్
1875లో ఇరవై అయిదేళ్ళ స్కాటిష్ పండితుడు పీటర్ పీటర్సన్ బొంబాయి లోని ఎలిఫెంటా కాలేజ్ లో ఓరియెంటల్ లాంగ్వేజెస్ ,మరియు సంస్కృత ప్రొఫెసర్ గా నియమించ బడ్డాడు .అతడు స్కాట్ లాండ్లో సంపన్న వాణిజ్యవేత్త కుమారుడు .అతడు ఎడిన్బర్గ్ యూని వర్సిటిలో మాస్టర్ డిగ్రీ సాధించిన కుర్రాడు .అతడు అక్కడ జర్మన్ –సాన్స్క్రిట్ స్కాలర్ సైమన్ ధియోడర్ ఆఫ్రిట్ శిష్యుడు .తర్వాత ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి కి వెళ్లి ,మోనియర్ విలియమ్స్ ,ఫ్రెడరిక్ మాక్స్ ముల్లర్ అనే ఇద్దరు అపూర్వ విద్వాంసుల వద్ద శిక్షణ పొందాడు .అతని మేధా సంపాదకు ప్రసిద్ధమైన బౌడెన్ స్కాలర్షిప్ అందుకొన్నాడు .ప్రొఫెసర్ గా 25 ఏళ్లకే అతడి నియామకంచాలా మందికి ఆశ్చర్యం,అలజడి కలిగించింది , .
ఎందుకు అంత అలజడి ?అతడి వయసు తక్కువనా ,అనుభవం లేదనా ?లేక ఇంకాఏవైనా కారణాలున్నాయా ? దీనికి సమాధానం ఇండాలజి అభివృద్ధి మాత్రమె .ఈ విషయం జర్మన్ –ఇంగ్లిష్ విద్వాంసుల మధ్య విద్యా విషయక పోటీ మాత్రమె .ఇండాలాజి యూరప్ లో మొదట విద్యా౦శ౦ గా ఉండేది .తర్వాత అది వివిధ యూని వర్సిటీలు సంస్కృత వ్రాత ప్రతుల అధ్యయనం కోసం ప్రొఫెసర్ లను ,కేంద్రాలను ఏర్పాటు చేయటం లో వారసత్వం గా రూపు దాల్చింది .1814లో పారిస్ లోని కాలేజ్ డీ ఫ్రాన్స్ సంస్కృత విద్యాభ్యాసం కోసం సంస్కృతం లో ఒక చైర్ అంటే విద్యా పీఠం మొట్ట మొదటి సారిగా నెలకొల్పబడింది .కానీ జర్మని ఆధునిక సంస్కృత విద్యా వ్యాప్తికి ముఖ్య కేంద్రమై కూర్చుంది .1819 లో’’ ఆగస్ట్ విల్ హెల్మ్ వాన్ షెలేగాన్ ‘’ జర్మనీలోని’’ బాన్’’ యూని వర్సిటి లో మొట్టమొదటి సంస్కృత ప్రొఫెసర్ గా నియమింప బడ్డాడు .ఇంగ్లాండ్ మాత్రం సంస్కృత విద్యా వ్యాప్తి అధ్యయనాన్ని చాలా ఏళ్ళ తర్వాత ప్రారంభించింది .ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి లో 1832లో దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత సంస్కృత అధ్యయనానికి ‘’బోడేన్ చైర్ ‘’అంటే విద్యా పీఠం ఏర్పరచింది .
పీటర్సన్ ఎడిన్ బర్గ్ లో 12-1-1847 న జన్మించాడు .1875లో బొంబాయిలో ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్విస్ లో చేరి ఎలిఫిన్టన్ కాలేజ్ లో సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు.తర్వాత యూని వర్సిటి రిజిస్ట్రార్ అయ్యాడు .తర్వాత బాంబే యూని వర్సిటి లో చేరి ఉత్తర బొంబాయిలోని సంస్కృత వ్రాతప్రతుల అన్వేషణలో ఉన్నాడు .అతడు సేకరించిన వన్నీ’’ బాంబే సాన్స్క్రిట్ సిరీస్’’ గా ప్రచురింప బడినాయి .మహా సంస్కృత విద్వాంసుడు భండార్కర్ వద్ద చేరి నిపుణత సాధించాడు .1883లో బట్ట బాణుడు రాసిన ‘’కాదంబరి ‘’ని విపులమైన ఉపోద్ఘాతం తొ ప్రచురించాడు .1886లో’’ సారంధర పద్ధతి’’ని,1888 లో’’సుభాషితావలి ‘’ప్రచురించాడు తర్వాత పండిత దుర్గా ప్రసాద్ తొ కలిసి పని చేశాడు .పిమ్మట తానొక్కడే ‘’హితోపదేశ ‘’ను 1887లో ,రామాయణం లోని కొన్నిభాగాలు ముద్రించాడు .1888-92మధ్య’’ ఋగ్వేదం ‘’ ప్రచురించి తన అపూర్వ మేధా శక్తిని నిరూపించాడు .1890లో బౌద్ధ గ్రంధం ‘’న్యాయ బిందు ‘’ను వ్యాఖ్యానం తొ సహా పరిశీలించి వెలువరించాడు. దీన్ని జైన లైబ్రరీ నుంచి సేకరించాడు .
ఇంగ్లీష్ లో మహాశైలి తొ నిత్యం ఏదో ఒకటి రాస్తూనే ఉండేవాడు .అతని ఈ విజయాలకు కారణం వినయం విధేయత భండార్కర్ వంటి మహా పండితుల తొ మెలగటం . 1883లో పీటర్సన్ కు ఎడిన్ బర్గ్ యూని వర్సిటి ఫైలాలజి లో .D.SC. డిగ్రీ అందించి గౌరవించింది .బాంబే బ్రాంచ్ ఆఫ్ రాయల్ ఏసియాటిక్ సొసైటీ కి 1895లో సేక్రేటరి గా పని చేశాడు .బాంబే మునిసిపల్ కార్పో రేషన్ ప్రముఖ సభ్యుడు కూడా .ప్రొఫెసర్ పీటర్ పీటర్సన్ 28-8-1899 న బొంబాయిలో 52వ ఏట మరణించాడు .ఆ విదేశీ సంస్కృత మేధావికి మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం ?
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-6-23-ఉయ్యూరు
