తోలి తెలుగు కార్టూనిస్ట్ –తలిశెట్టి రామా రావు

తలిశెట్టి రామారావు (1896 – 1947) తొలి తెలుగు కార్టూనిస్ట్ (వ్యంగ్య చిత్రకారుడు). ఇతని కార్టూన్లు భారతి పత్రికలో ఒక పూర్తి పేజీలో వచ్చేవి. ఇతన్ని తెలుగు కార్టూన్ పితామహుడిగా పిలుస్తారు.

వ్యక్తిగత వివరాలు

తలిశెట్టి రామావారు 1896 మే 20న రామానుజమ్మ, సీయయ్య దంపతులకు జయపురంలో జన్మించాడు. గిడుగు రామమూర్తి పంతులు కుమారుడు గిడుగు సీతాపతి వద్ద శిష్యరికం చేశాడు. బాల్యంలోనే తండ్రి మరణించాడు. జీవనం కోసం తల్లితో కలిసి దర్జీపని చేశాడు. ఆ తరువాత కార్టూన్లు గీయటంలో ఈ వృత్తి లోని అనుభవం కూడా దోహదం చేసింది. ఉన్నత విద్య జయపురంలోనూ, ఆ తరువాత పర్లాకిమిడి, ఆ తరువాత విజయనగరంలో బి.ఏ చదివాడు. ఆర్థిక కారణాల వల్ల చదువు ఆగిపోయి, ఆ తరువాత జయంపురం రాజా వారి సహాయంతో మద్రాసులో న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు. అనంతరం పార్వతీపురంలో న్యాయవాద వృత్తి చేపట్టారు. మద్రాసులో ఉన్నప్పుడే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుతో పరిచయం కలిగి వీరు గీచిన కార్టూన్లు భారతి, ఆంధ్రపత్రిక పత్రికల్లో ప్రచురించటానికి దోహదమయింది. తొలుత బొమ్మలు మాత్రమే వేసేవాడు, అయితే ఆ తరువాత గిడుగు సలహాపై మాటలు కూడా కలిపి కార్టూన్ శకానికి నాంది పలికాడు.

రచనలు

“పరిచర్య” తలిశెట్టి రామారావు గీచిన వర్ణచిత్రం

  1. భారతి, ఆంధ్ర పత్రికల్లో కార్టూన్లు
  2. చిత్రలేఖనము (1918)
  3. 1930వ సంవత్సరంలో భారతీయ చిత్రకళ అనే పుస్తకం. ఆంధ్రగ్రంథమాల ప్రచురణ.

తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం

తలిశెట్టి రామారావు పుట్టినరోజునే “మే 20” న ప్రతీ సంవత్సరం తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం గా జురుపుతున్నారు.

కేవలం 28ఏళ్ళ వయసులో అసంఖ్యాక చిత్రాలు రచించిన దామెర్ల రామా రావు గారికి ఒక ఏడాది ముందే తలి శెట్టి జన్మించాడు .దామెర్ల తోలి తెలుగు చిత్రకారునిగా గుర్తింపు పొందితే ,తలిశెట్టి తోలి వ్యంగ్య –కార్టూన్ చిత్రకారునిగా ప్రసిద్ధి చెందాడు చిత్రకళ, కార్టూన్ రంగాలను అధ్యయనం చేస్తున్న వాళ్లకు సైతం తలిశెట్టిని గురించి నిన్న మొన్నటి వరకూ తెలిసింది కేవలం ఒక కార్టూనిస్ట్గా మాత్రమే అది కూడా వేళ్లమీద లెక్కింపదగిన ఓ ఐదారు కార్టూన్ల ద్వారా మాత్రమే. కానీ ఆ కాలంలో ఆయన జయపురం సంస్థానంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే లలితకళారంగాలలో అజరామమైన కృషిని చేసిన విషయం ఇంతకాలం మరుగునపడిపోవడం చాలా దురదృష్టకరమైన విషయం.

ప్రాథమిక విద్యనుండి మెట్రిక్యులేషన్ వరకూ జయపురంలో విద్యాభ్యాసం గడిచింది. ఇంటర్ మీడియట్ పర్లాకిమిడిలోనూ, బి.ఏ. డిగ్రీని విజయనగరంలోనూ చేసిన తలిశెట్టికి ఆనాటి జయపురం మహారాజు ఆర్థికసాయం చేయడంతో చెన్నపట్నం (మద్రాస్) వెళ్లి ఎల్.ఎల్.బి. చదివారు. సహజంగా చిత్రకళ యందు అమిత ఆసక్తి కల తలిశెట్టిని ఆకాలంలో మద్రాస్లో విరివిగా లభించే పంచ్, పాసింగ్షో, న్యూయార్క్ల లాంటి ప్రఖ్యాత విదేశీ కార్టూన్ మ్యూగజైన్స్ బాగా ప్రభావితం చేసాయి. మద్రాస్లో న్యాయశాస్త్రం పూర్తిచేసిన తదుపరి ఆయన జయపురం మహారాజా వారి కోర్టులో దివాన్గా పనిచేసారు. ఒక ప్రక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే చిత్రకళ పై గల అమిత ఆసిక్తతో చూసిన ప్రతి సంఘటననూ చిత్రాల్లోకి మలచడం హాబీగా చేసుకున్నారు. విరివిగా లైఫ్ స్కెచెస్ గీయడం ద్వారా డ్రాయింగ్ పై మంచి పట్టు సాధించారు..

మనకు అందుబాటులో వున్న దానిని బట్టి 1929ల నాటికే భారతి, ఆంధ్రపత్రిక, వాణి లాంటి పత్రికలలలో విరివిగా ప్రచురించపబడ్డ ఆయన కార్టూన్లు మనం పరిశీలించినట్లైతే లైఫ్ స్కెచింగ్ పై ఆయన ఎంత శ్రద్ధ పెట్టారో గమనించవచ్చు. ఎంతో సాధన చేస్తేనే గాని రాని ఆ గీతల్లోని పరిణతి పరిపక్వత, అనాటమీ ప్రతి కదలికల్లో కనబడే భంగిమలు ఇవన్నీ కార్టూన్లలో అప్పటికే అంతగొప్పగా వేయగలిగారూ అంటే దానికి ఆయన ఎంతో సాధన చేసి యుండాలి.

ప్రభందసుందరి వర్ణణతో మొదలైన అతని కార్టూన్ ప్రస్థానం క్రమక్రమంగా సామాన్యులు, అసామాన్యులు, కూలీలు, పనివాళ్లు, వారు వీరు అనే భేదం లేకుండా సమాజంలో మనకు ఎదురయ్యే అందరి వ్యక్తులు వారి వృత్తులు, దైనందిన వ్యవహారాలు, వేషభాషలు, కట్టు, బొట్టు, సాంప్రదాయాలు, కళలు, కళాకారులు, ఏ వర్గాన్నీ వదలకుండా అందరిపైనా ఆయన ఎన్నో కార్టూన్లు వేసారు. ముఖ్యంగా ఆయన కార్టూన్లలో మెచ్చుకోదగిన అంశం చక్కని డ్రాయింగ్. క్షురకర్మ అన్న పేరుతో అతను వేసిన కార్టూన్ స్ట్రిప్ మంగళివాడు క్షవరం చేసే క్రమంలో కత్తెర చేయించుకుంటున్న వ్యక్తిని రకరకాల భంగిమలలో పెట్టి అతడికి నరకం చూపిస్తున్నట్లు వేసిన ఆ కార్టూన్ లోని బొమ్మలు చూసినపుడు మనం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటాం. వ్యాఖ్యారహితంగా (రి)చిత్రాల్లో చూపించిన ఈ కార్టూన్ లోని డ్రాయింగ్ నేటి యానిమేషన్ కి ఏమాత్రం తీసిపోదు. బస్స్టాప్ లో కూర్చున్న ఇద్దరు ప్రయాణీకులకు వారిపైన గోడకు పెట్టబడ్డ “దొంగలున్నారు జాగ్రత్త” అనే బోర్డ్ ద్వారా వారిలో ఒకరిపై ఒకరికి రేకెత్తించిన అనుమానపు చూపులను అద్భుతంగా వ్యక్తం చేయడం ద్వారా ఎలాంటి వ్యాఖ్యా లేకుండానే అది చూసే ప్రేక్షకుడికి పొరలు పొరలుగా నవ్వు వచ్చేటట్లు చేసారు.

మనం ఇంతకాలం కేవలం ఒక కార్టూనిస్ట్ గానే చూస్తున్న తలిశెట్టి రామారావు ఓ మంచి చిత్రకారుడు, రచయిత కూడా అంటే ఆశ్చర్యపోక తప్పదు. ఆయన వేసిన చిత్రాలలో, భరతాగమనము, విరంగిణి, రాధాకృష్ణ నిద్రిత యాక్షాంగణ, శివపార్వతులు లాంటి ఎన్నో చిత్రాలు ఆనాటి భారతి తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి. చిత్రకళలో ఈయనకు సమకాలికులయిన దామెర్ల, వరదవెంకటరత్నం, భగీరధి, బుచ్చికృష్ణమ్మ లాంటి వారు ఆకాలంలో రాజమహేంద్రిలో ఆధునిక ఆంధ్రచిత్రకళకు బలమైన పునాదులు వేయగా తలిశెట్టి మాత్రం ఈ ప్రాంతంలో చిత్రాలు వేసినా ఆయన కార్టూన్ రంగంపైనే ఎక్కువగా దృష్టిపెట్టి విరివిగా వాటినే వేసారు. బహుశా జయపురం సంస్థానంలో వారి దివాన్ ఉద్యోగబాధ్యతలు నిర్వాహణ… కొంత కారణం కావచ్చు.

ఇక రచయితగా కూడా ఆయన వివిధ అంశాలపై ఎన్నో వ్యాసాలు వివిధ పత్రికలలో రాసారు. నాటకాలు, ప్రదర్శనలు, కార్టూన్ చిత్రకళ, నాట్యకళ, మేజువాణీలు వాటి వ్యవహారాలు, వాటియందలి చిత్రాలు లాంటి అంశాలతో పాటు బళ్లారిరాఘవ తదితర వ్యక్తులపై కూడా వ్యాసాలు రాసి ప్రచురించారు. అంతేకాకుండా 1930లో భారతీయ చిత్రకళపై అనేక వ్యాసాలతో 208 పేజీల పుస్తకాన్ని ఆయన రచించి ప్రచురించారు. భారతీయ చిత్రకళకు సంబంధించి బహుశా ఇదే తొలి గ్రంధమని ఆంధ్రపత్రిక సంపాదకులు, దేశాద్దారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు పేర్కొనడం గమనార్హం.

మసకబారిన చరిత్రపుటల్లో ఇరుక్కుపోయి, పొరలు కమ్మిన కళ్లకు ఇంతవరకు కనిపించకుండా పోయిన ఈ అరుదైన మన కళావజ్రాన్ని వెలికి తీసి ఆ కళాకాంతుల్ని మనం చూసేందుకు కారణభూతుడైన 75 ఏళ్ళ నవయువకుడు ముల్లంగి వెంకటరమణారెడ్డి గారి కృషిని అభినందించాలి, తలిశెట్టి రామారావు జన్మ దినమైన “మే20” తేదీన మొట్టమొదటిగా 2012 హైదరాబాద్ లో వారి కార్టూన్ పుస్తకాన్ని ఆవిష్కరించి తెలుగు కార్టూన్ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం తో ఈ కార్టూన్ పండుగ కు అంకురార్పణ జరిగింది.అని శ్రీ వెంటపల్లి సత్యనారాయణ విశ్లేషించారు . చిత్రకళ, కార్టూన్ రంగాలను అధ్యయనం చేస్తున్న వాళ్లకు సైతం తలిశెట్టిని గురించి నిన్న మొన్నటి వరకూ తెలిసింది కేవలం ఒక కార్టూనిస్ట్గా మాత్రమే అది కూడా వేళ్లమీద లెక్కింపదగిన ఓ ఐదారు కార్టూన్ల ద్వారా మాత్రమే. కానీ ఆ కాలంలో ఆయన జయపురం సంస్థానంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే లలితకళారంగాలలో అజరామమైన కృషిని చేసిన విషయం ఇంతకాలం మరుగునపడిపోవడం చాలా దురదృష్టకరమైన విషయం.

ప్రాథమిక విద్యనుండి మెట్రిక్యులేషన్ వరకూ జయపురంలో విద్యాభ్యాసం గడిచింది. ఇంటర్ మీడియట్ పర్లాకిమిడిలోనూ, బి.ఏ. డిగ్రీని విజయనగరంలోనూ చేసిన తలిశెట్టికి ఆనాటి జయపురం మహారాజు ఆర్థికసాయం చేయడంతో చెన్నపట్నం (మద్రాస్) వెళ్లి ఎల్.ఎల్.బి. చదివారు. సహజంగా చిత్రకళ యందు అమిత ఆసక్తి కల తలిశెట్టిని ఆకాలంలో మద్రాస్లో విరివిగా లభించే పంచ్, పాసింగ్షో, న్యూయార్క్ల లాంటి ప్రఖ్యాత విదేశీ కార్టూన్ మ్యూగజైన్స్ బాగా ప్రభావితం చేసాయి. మద్రాస్లో న్యాయశాస్త్రం పూర్తిచేసిన తదుపరి ఆయన జయపురం మహారాజా వారి కోర్టులో దివాన్గా పనిచేసారు. ఒక ప్రక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే చిత్రకళ పై గల అమిత ఆసిక్తతో చూసిన ప్రతి సంఘటననూ చిత్రాల్లోకి మలచడం హాబీగా చేసుకున్నారు. విరివిగా లైఫ్ స్కెచెస్ గీయడం ద్వారా డ్రాయింగ్ పై మంచి పట్టు సాధించారు..

మనకు అందుబాటులో వున్న దానిని బట్టి 1929ల నాటికే భారతి, ఆంధ్రపత్రిక, వాణి లాంటి పత్రికలలలో విరివిగా ప్రచురించపబడ్డ ఆయన కార్టూన్లు మనం పరిశీలించినట్లైతే లైఫ్ స్కెచింగ్ పై ఆయన ఎంత శ్రద్ధ పెట్టారో గమనించవచ్చు. ఎంతో సాధన చేస్తేనే గాని రాని ఆ గీతల్లోని పరిణతి పరిపక్వత, అనాటమీ ప్రతి కదలికల్లో కనబడే భంగిమలు ఇవన్నీ కార్టూన్లలో అప్పటికే అంతగొప్పగా వేయగలిగారూ అంటే దానికి ఆయన ఎంతో సాధన చేసి యుండాలి.

ప్రభందసుందరి వర్ణణతో మొదలైన అతని కార్టూన్ ప్రస్థానం క్రమక్రమంగా సామాన్యులు, అసామాన్యులు, కూలీలు, పనివాళ్లు, వారు వీరు అనే భేదం లేకుండా సమాజంలో మనకు ఎదురయ్యే అందరి వ్యక్తులు వారి వృత్తులు, దైనందిన వ్యవహారాలు, వేషభాషలు, కట్టు, బొట్టు, సాంప్రదాయాలు, కళలు, కళాకారులు, ఏ వర్గాన్నీ వదలకుండా అందరిపైనా ఆయన ఎన్నో కార్టూన్లు వేసారు. ముఖ్యంగా ఆయన కార్టూన్లలో మెచ్చుకోదగిన అంశం చక్కని డ్రాయింగ్. క్షురకర్మ అన్న పేరుతో అతను వేసిన కార్టూన్ స్ట్రిప్ మంగళివాడు క్షవరం చేసే క్రమంలో కత్తెర చేయించుకుంటున్న వ్యక్తిని రకరకాల భంగిమలలో పెట్టి అతడికి నరకం చూపిస్తున్నట్లు వేసిన ఆ కార్టూన్ లోని బొమ్మలు చూసినపుడు మనం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటాం. వ్యాఖ్యారహితంగా (రి)చిత్రాల్లో చూపించిన ఈ కార్టూన్ లోని డ్రాయింగ్ నేటి యానిమేషన్ కి ఏమాత్రం తీసిపోదు. బస్స్టాప్ లో కూర్చున్న ఇద్దరు ప్రయాణీకులకు వారిపైన గోడకు పెట్టబడ్డ “దొంగలున్నారు జాగ్రత్త” అనే బోర్డ్ ద్వారా వారిలో ఒకరిపై ఒకరికి రేకెత్తించిన అనుమానపు చూపులను అద్భుతంగా వ్యక్తం చేయడం ద్వారా ఎలాంటి వ్యాఖ్యా లేకుండానే అది చూసే ప్రేక్షకుడికి పొరలు పొరలుగా నవ్వు వచ్చేటట్లు చేసారు.

మనం ఇంతకాలం కేవలం ఒక కార్టూనిస్ట్ గానే చూస్తున్న తలిశెట్టి రామారావు ఓ మంచి చిత్రకారుడు, రచయిత కూడా అంటే ఆశ్చర్యపోక తప్పదు. ఆయన వేసిన చిత్రాలలో, భరతాగమనము, విరంగిణి, రాధాకృష్ణ నిద్రిత యాక్షాంగణ, శివపార్వతులు లాంటి ఎన్నో చిత్రాలు ఆనాటి భారతి తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి. చిత్రకళలో ఈయనకు సమకాలికులయిన దామెర్ల, వరదవెంకటరత్నం, భగీరధి, బుచ్చికృష్ణమ్మ లాంటి వారు ఆకాలంలో రాజమహేంద్రిలో ఆధునిక ఆంధ్రచిత్రకళకు బలమైన పునాదులు వేయగా తలిశెట్టి మాత్రం ఈ ప్రాంతంలో చిత్రాలు వేసినా ఆయన కార్టూన్ రంగంపైనే ఎక్కువగా దృష్టిపెట్టి విరివిగా వాటినే వేసారు. బహుశా జయపురం సంస్థానంలో వారి దివాన్ ఉద్యోగబాధ్యతలు నిర్వాహణ… కొంత కారణం కావచ్చు.

ఇక రచయితగా కూడా ఆయన వివిధ అంశాలపై ఎన్నో వ్యాసాలు వివిధ పత్రికలలో రాసారు. నాటకాలు, ప్రదర్శనలు, కార్టూన్ చిత్రకళ, నాట్యకళ, మేజువాణీలు వాటి వ్యవహారాలు, వాటియందలి చిత్రాలు లాంటి అంశాలతో పాటు బళ్లారిరాఘవ తదితర వ్యక్తులపై కూడా వ్యాసాలు రాసి ప్రచురించారు. అంతేకాకుండా 1930లో భారతీయ చిత్రకళపై అనేక వ్యాసాలతో 208 పేజీల పుస్తకాన్ని ఆయన రచించి ప్రచురించారు. భారతీయ చిత్రకళకు సంబంధించి బహుశా ఇదే తొలి గ్రంధమని ఆంధ్రపత్రిక సంపాదకులు, దేశాద్దారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు పేర్కొనడం గమనార్హం.

మసకబారిన చరిత్రపుటల్లో ఇరుక్కుపోయి, పొరలు కమ్మిన కళ్లకు ఇంతవరకు కనిపించకుండా పోయిన ఈ అరుదైన మన కళావజ్రాన్ని వెలికి తీసి ఆ కళాకాంతుల్ని మనం చూసేందుకు కారణభూతుడైన 75 ఏళ్ళ నవయువకుడు ముల్లంగి వెంకటరమణారెడ్డి గారి కృషిని అభినందించాలి, తలిశెట్టి రామారావు జన్మ దినమైన “మే20” తేదీన మొట్టమొదటిగా 2012 హైదరాబాద్ లో వారి కార్టూన్ పుస్తకాన్ని ఆవిష్కరించి తెలుగు కార్టూన్ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం తో ఈ కార్టూన్ పండుగ కు అంకురార్పణ జరిగింద అని సత్యనారాయణ వివరించారు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-6-23-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.