రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -1
రైటానరబుల్ శ్రీనివాస శాస్త్రి గారిపై తెలుగులో ఎవరూ రాయలేదు. పబ్లికేషన్ డివిజన్ ఆఫ్ ఇండియా వారు ‘’బిల్డర్స్ ఆఫ్ మోడరన్ ఇండియా సిరీస్ ‘’లో టి .ఎస్ .జగదీశన్ తో ఇంగ్లీష్ లో రాయించి ప్రచురించారు .నేను దాన్ని అనువాదం చేసి మీకు అందిస్తున్నాను .
బాల్యం
22-9-1869 న శ్రీనివాస శాస్త్రి తమిళనాడు లోని కుంభకోణం దగ్గర వలగైమాన్ లో శంకర నారాయణ శాస్త్రి శ్రీమతి బాలమ్మాల్ దంపతులకు జన్మించాడు ..ముగ్గురు అక్కలు ,ముగ్గురు తమ్ముళ్ళు .అప్పుడే రాజకీయ చైతన్యం ,ఆధ్యాత్మిక విచారం ప్రారంభమైందిదేశం లో .సాంఘిక దురన్యాయాలపై గొంతులు విప్పుతున్నారు ప్రజలు .మూఢ విశ్వాసాలపై ఏవగింపు చూపిస్తున్నారు .1857 బ్రిటీష రాజ్యం అయిపొయింది .హౌస్ ఆఫ్ కామన్స్ భారత ప్రభుత్వాన్ని విక్టోరియా రాణికి అప్పగిస్తూ తీర్మానం చేసింది .బ్రిటన్ అధికారం లో ఉన్న అన్ని ప్రాంతాలలాగానే ఇండియా ను కూడా చూసు కొంటామని రాణి ప్రకటించింది .ప్రజలు ఊరట చెందారు .సెల్ఫ్ గవర్న మెంట్ ఆశలు చివురిచాయి .అప్పుడు ఏదైనా అలజడి ఉంటే రాణిపై ఉన్న అవిశ్వాసం మాత్రం కారణం కాదు .దీనినే సురెంద్రనాద్ బెనర్జీ ‘’భారత ప్రజలు మేలుకొంటున్నారు అనటానికి ఇది ఒక సంకేతం ‘’అన్నాడు .
అనాదిగా ఉన్న సంప్రదాయాలను ,సంస్కృతిని కాదని పాశ్చాత్య వ్యామోహం లో జమీందార్లు ,ధనికులు పడిపోయారు .అప్పుడే రాజారామ మోహన రాయ్ వంటి జాతీయవాదులు భారతీయ సంప్రదాయ సంస్కృతీ పునరుద్ధరణకు నడుం కట్టి జనాన్ని నడిపించారు .మత మూఢనమ్మకాలు వగైరాలపై తీవ్రంగా విరుచుకు పడ్డారు .దేశ భక్తీ జాతీయత విస్తారం అయింది అయినా బ్రిటీష రాణి కి ప్రజల విధేయత లో మార్పు లేదు . బర్క్ మిల్ , గ్లాడ్ ష్టన్ వంటి మేధావుల దార్శనికుల ప్రభావం తో వైస్ రాయ్ లైన లార్డ్ కానింగ్ ,లార్డ్ రిప్పన్ లు వ్యవహరించారు .ఇండియాలో స్వీయప్రభుత్వ పాలనకు ఆశలు బాగా ఏర్పడేట్లు చేశారు.దాదాభాయ్ నౌరోజీ ,మహాదేవ గోవింద రానడే ల మహోన్నత వ్యక్తిత్వాల వలన ప్రభావితులైన భారత ప్రజల వలన ,దైవ కృప వలన ఇండియా ,బ్రిటన్ దేశాల మధ్య సాన్నిహిత్యం ,విశ్వాసం దృఢమైంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-6-23-ఉయ్యూరు

