రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -3
జీవిత చరమాంకం లో శాస్త్రి ‘’ఆరవ ఫారం లో ఉండగానే మా గురువుగారు అప్పుశాస్త్రి ‘’జెంటిల్ మాన్ ‘’అనే పదానికి గొప్ప అర్ధం చెప్పారు .దాని అర్ధం మర్యాద ,స్వరూపం ,ఔచిత్యం ,కోపం ,సంతోషం తగ్గించుకోవటం లను కలిగి ఉండటం అనే విస్త్రుతార్ధం బోధించారు ‘’అని రాసుకొన్నాడు .అలా అప్పు శాస్త్రి ప్రభావం శ్రీనివాస శాస్త్రి పై చాలా ఉన్నది .మంచి ఆరోగ్యంగా ఆటలు, నది లో క్రీడలతో అన్నిటా ముందుండేవాడు .బాహ్య ఆరోగ్య రక్షణ ఆతడి అంతర్ సౌందర్యానికి శ్రీ రామ రక్ష అయింది .14ఏళ్ళ వయసులో అంతకంటే తక్కువ వయసున్న పార్వతి తో శాస్త్రి వివాహం 1883లోనే జరిగింది .అప్పటి యువకులు 18 దాటితెకాని పెళ్ళికి ఇష్టపడే వారు కాదు .కానీ తలిదండ్రుల ఒత్తిడి తో తలవంచక తప్పలేదు .పెళ్ళి జరిగిపోయింది .1884లో మెట్రిక్ మద్రాస్ ప్రేసిడేన్సి లో 13 వ వాడుగా పాసయ్యాడు .ఈ ఉత్తమ రాంక్ ఫస్ట్ యియర్ ఆఫ్ ఆర్ట్స్ లో జీతం కట్టకుండా చేరటానికి అర్హత నిచ్చింది .కుంభకోణం ప్రభుత్వ కాలేజి లో చేరి ,ప్రేసిడేన్సి మొత్తం మీద ఫస్ట్ రాంక్ లో పాసయ్యాడు .ఇంగ్లీష్ లో గోల్డ్ మెడల్ పొందాడు .ఈ రాంక్ వలన బి ఏ లో కూడా ఉచిత విద్యకు అర్హుడై నాడు .అప్పటి క్లాస్ మేట్ లలో కే శ్రీనివాస అయ్యంగార్ –ఈయన తర్వాత మద్రాస్ ప్రభుత్వం లో లా మినిస్టర్ ,టి.జీవాజి రావు –తర్వాత జిల్లా సెషన్స్ జడ్జ్ ఉన్నారు .అధ్యాపకులలో మహా విద్వాంసులైన ప్రొఫెసర్ సుందర రామ అయ్యర్ ,ప్రోఫెసర్ సాదు శేషయ్య ,మిస్టర్ జి హెచ్ స్టువార్ట్ ,మిస్టర్ ఎ .బిల్దేర్ బెక్,మిస్టర్ హేన్స్ మాన్ ,మహా మహోపాధ్యాయ రంగా చారి ఉన్నారు .వీరందరిపై శాస్త్రికి అత్యంత గౌరవం ఆదరం ఉండేది .వారూ అతనిపై అలాంటి వాత్సల్యాన్నే చూపే వారు .ఇందులో చాలామంది శ్రీనివాస శాస్త్రి సాధించిన ప్రపంచ వ్యాప్త విజయాలను కనులారా చూసి పులకించిన వారే .
1887 లో మద్రాస్ లో శాస్త్రి మొట్టమొదటి సారిగా సురేంద్ర నాద బెనర్జీ భారత జాతీయ కాంగ్రెస్ లో ప్రసంగం చేయటం విన్నాడు .అప్పటికి ఇంకా జూనియర్ బి ఏ క్లాస్ లోనే ఉన్నాడు .లాంగ్వేజ్ పరీక్ష రాయటానికి మద్రాస్ వచ్చాడు .ఆకాలం లో మారుమూల ప్రాంతాలవారందరూ మద్రాస్ వచ్చి బి ఏ .పరీక్షలు రాయాల్సిందే .అదృష్ట వశాత్తు సురెంద్రుని ప్రసంగం వినటం అతడి అదృష్టం అయింది .ఈ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకొంటూ ‘’సురెంద్రుడు అత్యుత్తమ ప్రసంగం చేశారు .అలాంటి ఉపన్యాసం నా జీవితం లో ఎప్పుడూ విని ఉండలేదు .అది నా మనసుపై గాఢ ముద్ర వేసింది .ఆ వాక్ ప్రవాహానికి అవతలివారిని చీల్చి చెండాటనాన్ని మర్చిపోలేను .గంగా ప్రవాహమే అది .విషయ వివరణ చేస్తూ కావాల్సిన చోట్ల నొక్కి చెబుతూ ,నిదానంగా మనసులోకి చొచ్చుకొని పోయేట్లు సందిగ్ధ రహితం గా మాట్లాడిన తీరు నన్ను ముగ్దుడిని చేసింది .సముద్ర తరంగాల లాగా పైకి ఎగురుతూ తగ్గుతూ గొప్ప అనుభూతి కలిగించింది .’oh !it was splendid ,splendid treat for us ‘’అన్నాడు పొంగిపోతూ .
1883లో శాస్త్రి బి ఏ ఫస్ట్ క్లాస్ లో ఇంగ్లిష్ లో ప్రేస్సిడేన్సి మొత్తం మీద ఫస్ట్ మార్క్ లతో పాసయ్యాడు .అతడికి చదువులో గొప్ప సాయం చేసిన వాడు పెద్దక్క భర్త అంటే పెద్దబావ గారు విశ్వ నాద అయ్యర్ .ఆయన ప్రోద్బలంతోనే లా కాలేజిలో చేరాడు .దురదృష్ట వశాత్తు చేరిన కొద్దికాలానికే బావ చనిపోతే లా మానేసేయాల్సి వచ్చింది .కుటుంబ బాధ్యత శాస్త్రిపై పడింది అదృష్టవశాత్తు తంజావూర్ జిల్లా మాయవరం లో మునిసిపల్ హై స్కూల్ లో టీచర్ గా అవకాశం వచ్చి 1888లో చేరాడు .హెడ్ మాస్టర్ నారాయణ స్వామి తండ్రిలాగా ఆదరించాడు .కొంతకాలం తన ఇంట్లోనే ఉండమన్నాడు .విద్యార్ధులకు శాస్త్రి మాష్టారిపై గౌరవం ఆయనకు పిల్లలపై అభిమానం బాగా కలిగాయి .ఇలాంటి సత్సంబంధం విద్యార్ధుల ఉపాధ్యాయుల మధ్య ఉండాలి అని చెప్పేవాడు శాస్త్రి .అక్కడి శిష్యులలో టిఆర్ వెంకట రామ శాస్త్రి ప్రముఖ న్యాయవాదిగా లిబరల్ నాయకుడుగా ఎదిగాడు .వీరిద్దరి మధ్య స్నేహం జీవితాంతం ఉండి పోయింది .మాయవరం లో ఉండగానే శాస్త్రికి ‘’వెబ్ స్టర్ ఇంగ్లిష్ డిక్షనరి ‘’తో పరిచయం మొదలైంది .దానిపై రోజూ అనేక గంటలు పని చేసే వాడు .అతడి మిత్రులు ‘’మా వాడికి అది భగవద్గీత అయింది ‘’అని నవ్వేవారు .దీనివలన శ్రీనివాస శాస్త్రికి తక్కువ వయసులోనే ఇంగ్లిష్ లిటరేచర్ పై అద్భుత మాస్టరి సాధించటానికి ఫౌండేషన్ పడటానికి గొప్ప అవకాశం లభించింది.ఇంగ్లిష్ భాషా నుడికారం ,పదబంధం ,వ్యాకరణం ,ఉచ్చారణ లపై సాధికారత సాధించాడు .మహా వక్తగా ఎదగటానికి గొప్ప ఫౌండేషన్ ఏర్పడింది .
సశేషం మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-6-23-ఉయ్యూరు

