రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -5
ఆ కాలం లో నే శాస్త్రి ‘’మద్రాస్ టీచర్స్ గిల్డ్ ‘’స్థాపించి ఎడ్యుకేషనల్ రివ్యు ప్రచురించాడు .జి ఎ నటేశన్ కు ఇండియన్ రివ్యు కు సహకరించాడు .తానూ రామనాధన్ ఇద్దరూ కూడా సాహిత్య రంగం లో తమ కృషి అత్యున్నతంగా కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశామని ,అప్పుడు తానూ హిందూ హై స్కూల్ లో ఇద్దరి పని భారం మోస్తూకూడా .మాంచి ఉత్సాహంతో పని చేశానని రాసుకొన్నాడు .నటేశన్ కొత్త ప్రయత్నానికి పూర్తీ సహకారం అందించానని ,,అప్పటికి ఇంకా కరెంట్ రాలేదని ,ప్రూఫ్ రీడింగ్ కు రెండు కొవ్వు వత్తుల కాంతి తోనే అర్ధ రాత్రి వరకు ,మళ్ళీ తెల్ల వారు జామున చేశానని ,తనకన్ను స్పెల్లింగ్ తప్పులను ,తప్పు టైపింగ్ ను ఇట్టే పసి కట్టేదని ,అప్పటి నుంచి ఇప్పటికీ అరువు పుస్తకాన్నైనా మార్జిన్ వేసి ,నాకు తోచిన రిమార్కులు రాయకుండా వదలననీ ఇది ,తర్వాత ఆ పుస్తకం చదివే వారు నన్ను తిట్టుకొన్నా ఫర్వా లేదని అదొక ‘’తుత్తి’’గా ఉండేదని ,తనకు యే కంటి డాక్టరు లాంగ్ సైట్ ఉందని సలహా ఇవ్వలేదని ,కానీ వయసు35 కే తనకా జబ్బు వచ్చి ,రుగ్వేదం నాటికి అనుభవ మైందని శాస్త్రి రాసుకొన్నాడు .
ఆ వయసులోనే ఆయన స్పృశించనిపబ్లిక్ రంగం లేనే లేదు .సహకార ఉద్యమం పై మక్కువ బాగా ఉండేది ‘’ట్రిప్లేకేన్ అర్బన్ కొ ఆపరేటివ్ సొసైటీ ‘’స్థాపనలో ముఖ్య పాత్ర వహించాడు శాస్త్రి .అది ఇవాళ అతిపెద్ద సంస్థగా విస్తరించింది .సాంఘిక సంస్కరణ లపైనా దృష్టి పెట్టాడు .రజస్వలానంతర వివాహాలు ప్రోత్సహించాడు .హిందూ శాస్త్రాలలో దీన్ని సమర్ధించిన విషయాలను వ్యాస రూపంగా 1906లో ఒక కరపత్రం రాసి ప్రచురించాడు .చెప్పటం మాత్రమేకాదు తన కూతురు రుక్మిణి వివాహాన్ని రజస్వలానంతారమే చేసి మార్గదర్శి అయ్యాడు .ఆకాలం లో అది ఒక రివల్యూషన్ .నటేశన్ చెప్పిన దాన్ని బట్టి టీచర్స్ గిల్డ్ కొ ఆపరేటివ్ సొసైటీ లతోపాటు శాస్త్రి ,అనేక క్లబ్ లు సంస్థలు కుళ్ళి కునారిల్లుతుంటే వాటిలో ఉత్సాహం కల్పించి చైతన్య వంతాలైన అనేక కాంగ్రెస్ కమిటీలను ఏర్పరచాడు..మద్రాస్ ప్రెసి డెన్సి లో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందాడు .రానడే ఇన్ ష్టిట్యూట్ ను స్థాపించిన కొత్తలో దాని స్థాపకుడు వి కృష్ణస్వామి అయ్యర్ కు చేదోడు వాదోడుగా ఉంటూ ,దాని ఎదుగుదలకు అభివృద్ధికి గొప్ప కృషి చేశాడు శాస్త్రి
గోఖలే ప్రభావం
1905కే శ్రీని వాస శాస్త్రి అత్యుత్తమ ప్రధానోపాధ్యాయుడు గా లబ్ధ ప్రతిష్టు డయ్యాడు .ఆరోగ్యం భేషుగ్గా ఉంది.సహచర ఉపాధ్యాయులతో విద్యార్ధులతో మంచి సంబంధం నెలకొల్పాడు .కుటుంబ విషయంలోనూ ప్రేమాస్పదుడైనాడు .కానీ 1905లో నటేశన్ ‘’అత్యన్త గోప్యం ‘’అని పంపిన పాంఫ్లెట్ చూసి తల్లడిల్లాడు .అది సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సోసైటి కి చెందినా రూల్స్ ,ప్రాస్పెక్టస్ .అందులోని భాష భావాలు ,జనజాగృతి ని ఆధ్యాత్మీకరించటం ,దేశ భక్తీ అతడిని కట్టిపడేశాయి .దీన్ని గురించి శాస్త్రి ‘’నేను దాన్ని పదే పదే చదివాను .నన్ను నేను ప్రశ్నించుకోన్నాను .అలాంటి మహత్తర కార్యక్రమం లో నేను భాగ స్వామిని కాలేనా ?’’అనే ప్రశ్న అతడిని కుదిపేసింది గోఖలేగారు ఎంతమర్యాదగా ,ఆవేశంగా రాశారోఅనిపించింది .శాస్త్రి మనసులో గోఖలే ముద్ర పడింది .1905లో బెనారస్ లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభలో గోఖలేని చూసి ‘’వృద్ధ జ్ఞాన మూర్తి త్యాగి ,ఒక కన్ను స్వర్గం పైనా ,ఒకకన్ను సన్యాసం పైనా ఉంచి ,లోకాన్ని పరిత్యజించినా తన ముక్తికోసం ప్రాకులాడుతున్నారు.ఆయన త్యాగం ,సన్యాసం వలన తనది అనేది ఏదీ ఆయన వద్ద లేనే లేదు .అలాంటి బలిపీఠం మనం ఎక్కగలమా ?అంతటి సర్వోన్నత వ్యక్తీ సన్యాసి మళ్ళీ మనకు దొరుకుతారా ?దేశ భక్తీ ప్రార్ధన అంతా ఆయనలోనే ఉన్నది ‘’అని రాశాడు బెనారస్ కాంగ్రెస్ సభలో పాల్గొని గోఖలే దర్శనంతో పులకించి పోయి తనను సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో ఒక సభ్యునిగా చేర్చుకోమని ఒక ఉత్తరం రాశాడు –‘’మహాను భావా !నేను మద్రాస్ ట్రిప్లికేన్ స్కూల్ మాస్టర్ ను. నాకు 17 ఏళ్ళ విద్యా బోధనాను భవం ఉంది , ఇప్పుడు నాకు 37.నా వయసును చూస్తె భారత దేశ సేవ చేసే భాగ్యం ఎక్కువగా లేదని పిస్తోంది .ఉన్న కొద్దికాలం లో నమ్మకంగా పని చేయగలనా అని పిస్తోంది .అలాంటి నన్ను మీ సంస్థలోకి ఆహ్వానిస్తారని ఆశగా ఉన్నది .ఏదో అప్పటికప్పుడు వచ్చిన ఉద్రేకంతో రాసిన ఉత్తరం కాదు ఇది .ఎన్నో ఏళ్లుగా నా మనసులో సుళ్ళు తిరుగుతున్న భావం ఇది .మిమ్మల్ని స్వయంగా చూడాలనీ నా మనోభావాన్ని మీకు తెలియజేయాలనీ ఈ కాంగ్రెస్ సమావేశానికి ప్రతినిధిగా హాజరయ్యాను ‘’అని శాస్త్రి గోఖలే మహాను భావుడికి రాశాడు .ఈ ఉత్తరంపై ఆయన మిత్రుల మధ్య చర్చ జరిగింది తర్వాత .ఇది ‘’రాజకీయ సన్యాసం ‘’అన్నారు .తనను తన స్నేహితులెవరూ బలపరచ లేదని శాస్త్రి చెప్పాడు .ఒకరిద్దరికి నచ్చినా తనకు చెప్పే సాహసం చేయలేక పోయారు అన్నాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-6-23-ఉయ్యూరు

