రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -7
కాంగ్రెస్ రెండు గా విడిపోయిన మర్నాడు తటస్థ సభ్యులు ఫిరోజ్ షా కంప్ లో సమావేశమై కాంగ్రెస్ సిద్ధాంతాలపై నిబద్ధత ,విధేయత ఉన్న వారి సమావేశం జరపాలని నిర్ణయించారు .అందరికి నోటీస్ పంపుతూ ఈ క్రింది విషయాలపై అంగీకారం తెలియ జేయమని ప్రతినిధులను కోరారు .1-బ్రిటీష సామ్రాజ్యం లో ఉన్నట్లు ఇండియా స్వయం పాలన లో ఉండాలి .బ్రిటీష వారితో పాటు ఇండియా కూడా అవే లక్ష్యాలు ,రాజకీయ ప్రయోజనాలు కలిగి ఉండాలి .2-ఇదంతా రాజ్యాంగ బద్ధంగా ,ఇప్పుడున్న విధానం లో సంస్కరణ లతో పాలనావిదానంతో ,జాతీయ భావంతో ,ప్రజా సంక్షేమ దృష్టితో ఉండాలి .ఈ రెండు విషయాలే కాంగ్రెస్ కు బలాన్ని ఉత్తేజాన్ని తెచ్చి ఆతర్వాత ఏర్పడే రాజ్యంగా రచనలో మౌలికమైనాయి .ఆసమావేశం దీన్ని ఆమోదించి కన్వెన్షన్ కమిటీ ని ఏర్పాటు చేసి ,1908 లో అలహాబాద్ లోసమావేశమై వీటిని సమర్ధించే వారు మాత్రమె కాంగ్రెస్ ప్రతినిధులు గా గుర్తింప బడాలని నిర్ణయించారు .1908లో మద్రాస్ కాంగ్రెస్ ఈ కన్వెన్షన్ కమిటీ ఆధ్వర్యం లోనే జరిగింది . ఈ పెనుభారమంతా శాస్త్రి ఆరాధించే వి కృష్ణస్వామి అయ్యర్ పై పెట్టారు .అయ్యర్ కు సకల విధాల శాస్త్రి అండగా నిలబడి కృత కృతకృత్యుడయ్యాడు .శాస్త్రి, సి వై చింతామణి అంటే’’ చిర్రావూరి యజ్ఞేశ్వర చింతామణి ‘’తో కలిసి ప్రేసిడేన్సి అంతా పర్యటించి ,కాంగ్రెస్ కమిటీలను నెలకొల్పాడు .అది అంత తేలికగా సేలం లో జరగలేదు .ఈ ఇద్దరూ చాలా శ్రమ పడాల్సి వచ్చింది .అక్కడ రాజాజీ ,,విజయ రాఘవాచారి వంటి సీనియర్ బార్ సభ్యులున్నారు .కన్వెన్షన్ ఆధ్వర్యం లో కాంగ్రెస్ సభ జరగటాన్ని ఈ ఇద్దరు వ్యతిరేకించారు .ఇన్ని అడ్డంకుల మధ్య మద్రాస్ లో వాలంటీర్ల కెప్టెన్ గా ,ఆహ్వాన సంఘ కార్యదర్శి గా విపరీతంగా శ్రమించాడు సభ దిగ్విజయంగా జరిగేట్లు చేశాడు .
సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ లో పని చేస్తున్నా ,శ్రీని వాస శాస్త్రి విద్యారంగం పై ఆ సక్తి కోల్పోలేదు .దక్షిణ జిల్లాలన్నిటినీ కలయ తిరిగి ,గోఖలేగారి ‘’ఎలిమెంటరి ఎడ్యుకేషన్ బిల్’’కు మద్దతు కూడ గట్టాడు దీని ఉద్దేశ్యం అందరికి తప్పని సరిగా ప్రాధమిక విద్య ఉండాలి .కానీ అది అందని ద్రాక్ష అయింది .1910లో శాస్త్రి మద్రాస్ యూని వర్సిటి ఫెలో గా గ్రాడ్యుయేట్ ల చే ఎన్నుకో బడ్డాడు .1920వరకు పదేళ్లు ఆపదవిలో ఉన్నాడు
1913 లో శ్రీనివాస శాస్త్రి లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ గా నామినేట్ చేయబడ్డాడు .అందులో పెద్దగా ప్రాముఖ్యం లేక చర్చలు డిబేటింగ్ లో జరిగినట్లు చౌకబారుగా ఉండటం నచ్చలేదు .విధి విధానాలు బాగా పరిశీలించి పబ్లిక్ అఫైర్స్ పై ప్రశ్నలు సంధించే వాడు .అవసరమైన ముఖ్య తీర్మానాలు ప్రతిపాదిన్చేవాడు అన్నీ ప్రజా సంక్షేమానికి చెందినవే .అతడి వాగ్ధాటి వివేకం విచక్షణత అందర్నీ ఆకర్షించాయి .ప్రాధమిక విద్యా వ్యాప్తి జరగాలని నిరంతరం కోరేవాడు .Government policies should not be efficiency vs expansion ,but efficiency cum expansion ‘’అని వాదించే వాడు .విపరీతమైన ఖర్చుతో మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయడాన్ని ప్రభుత్వం ఉపసంహరించు కోనేట్లు చేయటం శాస్త్రి సాధించిన అద్భుత విజయం .మోడల్ స్కూల్స్ వలన డబ్బు దండగ తప్ప సామాన్యులకు ప్రయోజనం లేదన్న అతడి వాదన అందరూ మెచ్చుకొన్నారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-6-23.-ఉయ్యూరు ,

