రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -9

 రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -9

  ఆ తార్వాత 1946 లో గోఖలే పై శాస్త్రి రాసిన పుస్తకానికి ముందు మాట రాస్తూ గాంధీ –‘’గోఖలే గారిని నా రాజకీయ గురువు గా భావిస్తాను .కనుక శాస్త్రి గారు కూడా నా తో పాటు ఆయన తోటి శిష్యుడే .కానీ ఎంతటి గురుభక్తి ఎంతటి ఆరాధనా శాస్త్రి గారికి గోఖలే పైన ?నేను గోఖలే వారసుడిని అవుదామనుకోన్నాను .కానీ శాస్త్రి వ్యక్తిత్వానికి నేను ఫిదా అయి ఆయనకు లొంగిపోయాను .ఆసోసైటీలో ఒక సభ్యుడిని అయి ఉండేవాడిని .కానీ శాస్త్రి లాంటి ఉత్తమోత్తమ శిష్యుడు గోఖలే వారసుడవటం నాకు ఎంతగానో సంతృప్తినిచ్చింది ‘’అని రాశాడు .శాస్త్రి ముందుగా కాంగ్రెస్ లో వామ, కుడి భావ వాదులమధ్య కాంగ్రెస్ వేదికమీదనే సయోధ్య కుదర్చాలని తీవ్ర ప్రయత్నం లో ఉన్నాడు .ఇది గోఖలే గారి చివరి రోజుల్లో కోరుకున్నదే .కానీ ఫిరోజ్ షా మెహతా  తీవ్ర అభ్యంతరాలే కలయిక కు అడ్డుగా మారింది .1915 లో మెహతా మరణం తర్వాత శాస్త్రి మళ్ళీ మధ్య వర్తిత్వం చాలా తీవ్రంగా చేశాడు .1915 ,15,17 సంవత్సరాలు మన దేశ చరిత్రలో వాటర్ మార్క్ గా నిలిచిపోయాయి .జిన్నా హిందూ-ముస్లిం సఖ్యత కోసం ప్రయత్నించాడు .తిలక్ మధ్యస్తులకు నాయకత్వం వహించాడు .దేశం అంతా ఏక స్వరం తో నినదించింది .ఈ సమయంలో శాస్త్రి’’సెల్ఫ్ గవర్నమెంట్ ఫర్ ఇండియా అండర్ బ్రిటీష గవర్నమెంట్ ‘’  అనే  ఒక’’ కరపత్రం రాసి ప్రచురించాడు  .అందులో ఇంకా ఏమాత్రం ఇండియా బ్రిటీష ప్రభుత్వానికి లొంగి ఎలాంటి ప్రభుత్వాలకు ఒప్పుకోకూడదు భారత దేశం బ్రిటీష రాజ్యం నుంచి విముక్తి పొందటమే తక్షణ కర్తవ్యమ్ ‘’అని వివరించాడు .ఇలాంటి కాలం లో కూడా ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లోని 19 మెంబర్లు శాస్త్రితో సహా బ్రిటీష ప్రభుత్వానికి ఒక మెమొరాండం సమర్పిస్తూ ‘’బ్రిటీష డోమినియన్లకు లాగా నే భారత దేశం లో స్వీయ ప్రభుత్వం –సెల్ఫ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని కోరారు .ఈ చారిత్రాత్మక మెమొరాండం ను ‘’మెమొరాండం ఆఫ్ నైన్ టీన్’’గా ప్రసిద్ధి కెక్కింది .ఇదే కాంగ్రెస్ –లీగ్ డాక్యుమెంట్ కు దారి చూపింది శాస్త్రి నాయకత్వం లో .1916లో లక్నో లో జరిగిన ముస్లిం లీగ్ సమావేశం దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది .ఇదే లక్నో ప్రకటన  అంటే ఒడంబడిక గా గుర్తింపు పొందింది .మింటో –మార్లే విధానం కంటే విస్తృతమైన ప్రాతిపదిక మీద ముస్లిం లకు ప్రత్యెక ఓటర్లు కల్పించ బడ్డారు..గోఖలే ఇలాగే కావాలని 1906లోనే కోరాడు .దానినే తిలక్ ,సురెంద్రనాద్ బెనర్జీ వంటి ముఖ్యనేతలు కూడా బలపరచారు .మత ప్రాదిపక ఎన్నికలు తాత్కాలికం అనీ త్వరలో విస్తృత ప్రణాళిక ఏర్పడాలని వారంతా భావించారు .అనేక సభల్లో శాస్త్రి ఈ స్కీం ను బలపరుస్తూ ప్రసంగించాడు .1917 మె లో  నాశిక్ లో జరిగిన  బాంబే ప్రాదేశిక కాంగ్రెస్ సభకు శ్రీనివాస శాస్త్రి అధ్యక్షత వహించాడు .తిలక్ తో సహా ప్రముఖ నేతలందరూ హాజరయ్యారు .’’ది స్టోరిఆఫ్ మై లైఫ్ ‘’లో జయకర్ రాస్తూ ‘’శాస్త్రి ప్రసంగం అందర్నీ మెప్పించింది .జాతీయ ఐక్యత ప్రతి బిమ్బితమైంది .దేశభక్తి పెల్లుబికింది .గోపాల కృష్ణ  గోఖలే గారి ‘’కర దీపిక ‘’మాంటిల్ శాస్త్రి గారి చేతిలోకి వచ్చి మరింత స్పష్టంగా వెలుగునిస్తూ దారి చూపింది .గోఖలే గారికి నిజమైన అసలైన సరియైన వారసుడు శాస్త్రి అనిపించాడు ‘’అని పొంగిపోతూ రాశాడు .

   ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ –భారత జాతీయ శాసన మండలి

1916 జులై లో శ్రీనివాస శాస్త్రి మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు ఎన్నికై మళ్ళీ వచ్చాడు .సేలం కు చెందినవిజయ రాఘవా చారి ,డాక్టర్ టిఎం నాయర్అనే దిగ్గజాలను  ఓడించి మరీ గెలిచాడు శాస్త్రి .ఆసభలో మదన మోహన మాలవ్యా ,చిమన్ లాల్ సేతల్వాడ్,భూపేంద్ర నాద బసు ,డి.యి వాచా ,,ఇబ్రహాం రహీంతుల్లా, జిన్నా ,టిబి సప్రూ , బి ఎన్ శర్మ వంటి రాజకీయ దురంధరులున్నారు .శాస్త్రిలోని చొరవ చురుకుదనం వాగ్ధాటి దేశభక్తి ,నిజాయితే నిర్భీకత అధికార అనదికారులతో సహా అందర్నీ ఆకర్షించాడు .మండలి చర్చలలో శాస్త్రి పాల్గొని మాట్లాడుతుంటే అందరూ చెవులు రిక్కిన్చుకొని అక్షరం పొల్లు పోకుండా వినే వారు అంతటి సమ్మోహనం కలిగించేవాడు శాస్త్రి .1914 రాయల్ కమిషన్ ఆఫ్  పబ్లిక్ సర్వీసెస్ పై మాట్లాడుతూ శాస్త్రి త్వరలో భారతీయత అందులోనేకాక దాని అనుబంధ విభాగాలన్నిటా ప్రతిబింబించాలని ,అది తక్షణ కర్తవ్యమ్ అనీ చెప్పాడు.మండలిలో ఇది ముందు ప్రతి బిమ్బించాలి అన్నాడు .పబ్లిక్ వర్క్స్ రైల్వే పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ,విద్య ,పోలిస్,మెడికల్ సర్వీస్ లో వెంటనే నియామకాలు జరగాలని అనేక తీర్మానాలు ప్రవేశ పెట్టాడు .సర్వీసెస్ లో జాతి వివక్షత చూడ రాదు అన్నాడు .పోటీ పరీక్షలు పెట్టి మంచి ప్రతిభా వంతుఅలనే ఎంపిక చేయాలని కోరాడు .మిలిటరి డిపార్ట్ మెంట్  ఇనర్షియా –  అంటే జడత్వం తో బాధ పడుతోందని దాన్ని చైతన్య వంతం చేయాలని కోరాడు .దీనికి కమాండర్ ఇన్ చీఫ్ సమాధానమిస్తూ తానూ ఎప్పుడూ ఇలాంటి ఇనర్షియా   మాటలు వినలేదన్నాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ –  19-6-23-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.