రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -10
బ్రిటీష ఇండియాలో భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్విభజన విషయం కౌన్సిల్ 1918లో చర్చకు వచ్చినప్పుడు శాస్త్రి దాన్ని ఎదిరించాడు .కారణం దానివలన సంకుచిత దేశ భక్తీ ,మరిన్ని ముక్కలు దేశం అవుతుందని భయపడ్డాడు .ఆ ఏడాది బడ్జెట్ పై మాట్లాడుతూ రాష్ట్రాల నిర్వహణ భారమంతా బీదవారిపై పడుతుందని ,వారిపై పన్నులు పెంచి పీడించటం జరుగుతుందని షేక్స్పియర్ కొటేషన్ ఒకటి గుర్తు చేశాడు –‘’which haave of late so huddled on his back .Enow pressa royal merchant down and pluck commiseration of his state from brassy bosome and tough hearts of flint “’.1917 చివరలో ప్రభుత్వం ‘’సేడిషన్ కమిటి ‘’ని ఇంగ్లాండ్ కు చెందిన రౌలట్ ఆధ్వర్యం లో ఏర్పరచి ఇండియాలో జరిగిన రాజ ద్రోహ చర్యలను పూర్తిగా అధ్యయనం నివారణ చర్యలు సూచిస్తూ రిపోర్ట్ ఇవ్వమన్నది .అ కమిటీ రికమ౦ డే షనలు చాలా దారుణంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి .ఇండియా లోని జనం దానిపై తీవ్రంగా అ భ్యన్తరాలు చెప్పి నిరసనలు పెద్ద ఎత్తున చేశారు .ప్రజాభిప్రాయాన్ని లెక్క చేయకుండా ప్రభుత్వం క్రిమినల్ లా ,క్రిమినల్ లా అమెండ మెంట్ అనే రెండు బిల్లులను ప్రవేశ పెట్టింది .అనధికార సభ్యులు నామినేట్ చేయబడటం కానీ ఎన్నిక కావటం కానీ జరిగింది .7-2-1919 న శాస్త్రి రౌలట్ చట్టం పై చారిత్రాత్మక ప్రసంగం కౌన్సిల్ లో చేశాడు .దీన్ని మహాత్మా గాంధి తన స్వీయచరిత్రలో ఇలా రాశాడు –‘’ఇండియాస్ లెజిస్లేటివ్ చేంబర్ లో నా జీవితం లో ఒకే ఒక సారి పాల్గొన్నాను .అదీ రౌలట్ బిల్ ప్రవేశ పెట్టినప్పుడు .శాస్త్రి ఉద్రేకం తో ఊగిపోతూ ప్రభుత్వానికి ఒక తీవ్ర హెచ్చరిక చేశాడు .సభలో ఉన్న వైస్రాయ్ నోరు మెదపకుండా మౌనంగా ఆసాంతం విన్నాడు .అతడి దృష్టి అంతా శాస్త్రిపైనా ఆయన వాగ్ధాటి పైనే ఉంది.దానితో పూర్తిగా వైస్రాయి చలించి పోయాడని నాకు అనిపించింది ‘’అని రాశాడు .శాస్త్రి తనలోని చాతుర్యం దేశభక్తి అన్నీ కలగలిపి గుది గుచ్చి అందరిహృదయాలను కదిలించాడు .ఆయన మాట్లాడిన దానిలో ఒక పేరా దేశం లో చాలా బాగా వ్యాప్తమై ప్రసిద్ధి చెందింది అదే –‘’మా దేశ ప్రజలను చాలా పరీక్షలకు గురి చేశారు .ఇప్పటిదాకా మీరు అమలు చేసిన అన్ని అణచి వేత ఉత్తర్వులైన ప్రెస్ యాక్ట్ ,డిఫెన్స్ యాక్ట్ వంటి వాటిని మౌనంగా సమర్దించాం.యుద్ధ కాలం లో గంటకోసారి మమ్మల్ని విచారించి క్షోభ పెట్టారు .వంద మిలియన్ల మందిని మీకు ఇచ్చాం .ఒకటేమిటి మీరు కోరిన వన్నీ సమర్పించాం.మొన్న మీరు చెప్పిన 45 మిలియన్లు కూడా మాకొక పరీక్షే .అయినా ఒప్పుకోన్నాం .మా మనసులు సంతోషంగా ,ఆనందంగా ఒప్పుకొన్న ఒక్క విషయమైనా ఉందని మీరు చెప్పగలరా ?మీ ఆకలి తీర్చటానికి బిందెడు పులిపాలు కూడా చస్తూ బతుకుతూ తెచ్చి మీకు సమర్పించాం.ఆపాలు పారబోసి మగ పులి పాలు తెమ్మని మళ్ళీ ఆజ్ఞా పిస్తారా ?””అని నిప్పులు కక్కాడు శ్రీనివాస శాస్త్రి .ఇంత వ్యతిరేకం ఉన్నా బిల్లు 18-3-1919 న ఆమోదానికి వస్తే శాస్త్రి ‘’కొన్ని నిమిషాలలో బిల్లు సభ ఆమోదం పొంది ఆతర్వాత చట్టమౌతుంది .ఇక్కడ ఒక కవికవిత గుర్తుకు వస్తోంది –if it were done ,when it is done ,then it were well it were well it was done quickly ‘’అన్నాడు మాలో ఎవరికీ ఇష్టం లేకపోయినా గాంధీ దాన్ని బుజాన కెత్తుకొన్నాడు .ఆయన ఎలా దీన్ని నిర్వహిస్తాడో చూడాలి ఈ చీకటి సమయంలో ఆయన అనుయాయులమైన మేము ,ప్రభుత్వం ,ప్రభుత్వ ఉద్యోగులు ,రాజకీయ నిరసనకారులు ,నిర్బందితులు ‘’At the end of the business that we also wrote perfectly white ‘’ అని గర్జించాడు శాస్త్రి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-6-23-ఉయ్యూరు

