, రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -11
‘’రౌలట్ చట్టం భయంకరమైన హద్దూ అదుపు లేని దెయ్యాల సంతానం కు కన్నతల్లి ‘’అన్నారు .జలియన్ వాలాబాఘ్ దురంతం దీని ఫలితమే .పంజాబ్ దురంతం తర్వాత ఇండియన్ కౌన్సిల్ లోని ఒక యూరోపియన్ సభ్యుడు శాస్త్రితో ‘’మీరు కనిపెట్టిన భయంకర రోగం నిజమే అయింది ‘’అన్నాడు .1924 లో బీసెంట్ సతికి ఉత్తరం రాస్తూ ‘’రౌలట్ చట్టం మన రాజకీయ కష్టాలకు మూలం ‘’అన్నాడు .పంజాబ్ ఉదంతాన్ని దేశ ప్రజలందరితో పాటు శ్రీనివాసశాస్త్రి కూడా తీవ్రంగా కలత చెందాడు .పంజాబ్ బాంబే ,ఢిల్లీ లలో జరిగిన ఈ మారణ కాన్డపై విచారణకు ఏర్పరచిన హంటర్ కమిటీ మెజారిటి యూరప్ మెంబర్లు మైనారిటి ఇండియన్ మెంబర్స్ వేర్వేరుగా నివేదికలిచ్చారు .మైనారిటీల తరఫున రిపోర్ట్ సమర్పించిన చిమన్ లాల్ సేతల్వాడ్ కు శాస్త్రి ఉత్తరం రాస్తూ ఆయన ధైర్యానికి సామర్ధ్యానికి దేశభక్తికి వందనాలు సమర్పించాడు .సర్వెంట్స్ ఆఫ్ ఇండియా పత్రికలో దీనిపై శాస్త్రి ఒక వ్యాసం రాస్తూ –‘’జలియన్ వాలా దురంతంలో బాధితులు ఇండియన్స్ కాకపోయి ఉంటే ,ఇంగ్లీష్ ఐరిష్ లు అయిఉంటే జనరల్ డయ్యర ఊచకోత చాలా తక్కువగా బయట పడేది .డయ్యర్ విధేయతను విపరీతంగా మెచ్చుకోనేది ప్రభుత్వం అతడికి వీర తాళ్ళు కూడా తగిలించేది .మొక్కుబడిగా అతడిని ఇండియన్ కమాండ్ నుంచి తొలగించి చేతులు దులుపుకొన్నారు .వేరొక చోట అతడి ఈ నీచ క్రూర అక్రుత్యానికి పట్టం కట్టి తమ రక్తం గొప్పతనాన్ని చాటుకోనేవారు ‘’అని తెలియజేశాడు ..హంటర్ కమిటీ రిపోర్ట్ పై కౌన్సిల్ లో చర్చ జరగాలని పట్టుబట్టాడు.తీర్మానం కూడా తెచ్చాడు .కానీ వైస్రాయ్ తిరస్కరించాడు .కారణాలు చెబుతూ వైస్రాయ్ ‘’శాస్త్రి రిజల్యూషన్ అంటేనే న్యాయ బద్ధమైనదని మనకు నమ్మకముంది .కానీ పంజాబ్ వగైరాచోట్ల శాంతి వర్ధిల్లాలి అంటే సభలో ఇలాంటి చర్చలుజరగటం భావ్యం కాదు .ఏమైనా దాన్ని రూపుమాపుతాం ‘’అన్నాడు .వైస్రాయ్ కంటి తుడుపు సమర్ధనకు శాస్త్రిసంతృప్తి పడలేదు .దేశానికి మొదటి సారిగా ‘’సహాయ నిరాకరణ ‘’ను ప్రత్యక్షంగా చూపిస్తూ నిరసన తెలియ జేస్తూ సభనుంచి వాకౌట్ చేశాడు .
శాస్త్రి – మాంట్ ఫోర్డ్ సంస్కరణలు
20-8-1917 బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ లో సెక్రెటరి ఆఫ్ స్టేట్ మాంటేగ్ ‘’బ్రిటీష ప్రభుత్వ విధానం లో ఇండియన్ ప్రజల సహకారం పాలనా వ్యవహారాలలో ,సమర్ధత నైపుణ్యత బాగా కనిపిస్తూ బాధ్యతాయుత ప్రభుత్వానికి సహకారమిస్తూ బ్రిటీష సామ్రాజ్య౦ లో అంతర్భాగంగా వ్యవహరిస్తున్నారు .ఈ మార్గం లో మరిన్ని ముఖ్యమైన అడుగులు ముందుకు వేయటానికి సిద్ధంగా ఉన్నారు ‘’అన్నాడు .కానీరిఫారం ,రిప్రేషన్ అంటే సంస్కరణ ,అణచి వేత ప్రక్కప్రక్కనే జరిగిపోతూ ఉండటం దురదృష్టం .అక్కడ మాంటేగ్ సంస్కరణలు ప్రవేశపెడితే ,ఇక్కడ రౌలట్ చట్టం ప్రవేశ పెట్టారు .కనుక మాంటేగ్ ప్రతిపాదనలకు ఇక్కడ అనుకూల వాతావరం కనిపించలేదు .ఈ రకమైన గందర గోళం మధ్య 1917 చివర్లో మాంటేగ్ ఇండియా వచ్చాడు .తన రిఫార్మ్స్ పై ఇండియన్ల స్పందన ,,వైస్ రాయ్ అతడి సహచారులతో మాట్లాడటం ముఖ్యమైన భారతీయ నాయకులతో మాట్లాడటం అతడి ముఖ్య ఉద్దేశ్యం .శాస్త్రి చాలాసార్లు అతడిని కలిసి చర్చించాడు .మాంటేగ్ తన డైరీలో శాస్త్రిని గురించి 20-12-1917 న –‘’గోఖలే వారసుడు,సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస శాస్త్రిని మొత్తం మీద కలుసుకొని మాట్లాడగలిగాను .మహా చురుకైన వ్యక్తీ .కాంగ్రెస్ –ముస్లిం లీగ్ స్కీం ను సమర్ధించాడు .ముఖ్యమైన నాలుగు విషయాలను ఒప్పుకొంటే ఏ స్కీం నైనా సమర్దిస్తాం అన్నాడు .1- ఆ స్కీం లో అభివృద్ధి విషయాలు ,అఆభి వృద్ధికి గారేంటి ఉండాలి 2-ఫిట్నెస్ విషయం లో నిర్దుష్టత ఉండాలి .దీనిపై అవమానం పొందకుండా చూడాలి 3-ఇండియాకుఆర్ధిక స్వాతంత్ర్యం తప్పక ఉండాలి .దీన్ని ఇంపీరియల్ కాన్ఫరెన్స్ లో సెటిల్ చేయాలి 4-జాతులమధ్య సంపూర్ణమైన పూర్తీ సమానత్వం ఉండాలి .దీన్ని బట్టి చూస్తె శాస్త్రి సరైన మార్గం లోనే ఉన్నాడని పించింది .కనుక ప్రభుత్వం ప్రాంతీయ ప్రభుత్వాలకు దీనిపైస్వేచ్చ నిచ్చి ఈ స్కీం అమలు చేయటానికి స్వేచ్చనివ్వాలని ఆఫీసర్లు దీనికి అడ్డు తగలరాదని ఆర్డర్ జారీచేయాలనిపిస్తోంది .చేమ్స్ ఫర్డ్ ,ప్రభుత్వం ఎంత తక్కువగా పని చేస్తే అంత మంచిది .ఉన్నంతలో తమ శక్తిని ఈమంచికోసం వినియోగించాలి .పగ మన పరిపాలనా విధానానికి కు ప్రతి బంధకమౌతుంది .ఈవిషయాలు చేమ్స్ ఫర్డ్ కు కూడా తెలియజేస్తాను ‘’అని రాసుకొన్నాడు మాంటేగ్ .
ఆరోజే శాస్త్రితో మళ్ళీ సుదీర్ఘంగా మాట్లాదడినతర్వాట మరో విషయంకూడా రాసుకొన్నాడు మాంటేగ్ –‘’శాస్త్రి బాగా ఉపయోగ పడుతాడు ‘’అని .9-2-1919 న ఇండియన్ కౌన్సిల్ లో డిబేట్ ను శ్రద్ధగా విన్నాడు మాంటేగ్ .భాషా ప్రయుక్త రాష్ట విభజన తీర్మానాన్ని శాస్త్రి వ్యతిరేకించాడు .ఈవిషయాన్ని కూడా మాంటేగ్ తన డైరీలో నోట్ చేసుకొన్నాడు –‘’ఇవాళ గొప్ప ప్రసంగం అంటే శాస్త్రి దే-‘’Well delivered well phrased ,and very impressive ,urging the rejection of the motion ‘’.కాంగ్రెస్ –ముస్లిం లీగ్ స్కీం బాగుంది అని అనిపించినా శాస్త్రి సెక్రెటరి ఆఫ్ స్టేట్స్ ప్రపోజల్స్ బాగా నచ్చి వాటిని మెరుగు పరచే ఆలోచనలో పడ్డాడు .అదే కన్స్ట్రక్టివ్ స్టేట్స్ మన్ షిప్ ‘’అనిపించింది .మొదట్లో తిలక్, అనిబిసెంట్ లు కూడా ఆప్రపోజల్స్ ను వ్యతిరేకించారు కానీ గాంధీ ,జిన్నాలు సుముఖత చూపారు .1918 ఆగస్ట్ లో బొంబాయిలో జరిగినకాన్గ్రేస్ స్పెషల్ సెషన్ లో ఆ ప్రపోజల్స్ ను’’ అసంతృప్తిగా ,నిరాశా జనకంగా’’ ఉన్నాయని తిరస్కరించారు .ఆ సెషన్ కు శాస్త్రి దూరంగా ఉన్నా , ఢిల్లీ లో డిసెంబర్ లో జరిగిన సభకు హాజరయ్యాడు .తీర్మానం లో ‘ఉన్న’’ అసంతృప్తి నిరాశా పదాలను’’ తీసివేయమని కోరాడు .బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటుకు నిర్డుష్టగడువు కూడా పెట్ట వద్దన్నాడు .1-11-1918లో ఏర్పడిన ‘’నేషనల్ లిబరల్ ఫెడరేషన్ ‘’లో శాస్త్రి చేరాడు .కానీ కాంగ్రెస్ ను వదులుకోలేక పోయాడు .తన విధాన సమర్ధనకు కాంగ్రెస్ ను ఒప్పించటానికి విశ్వ ప్రయత్నం చేసి ,తానూ నేషనల్ లిబరల్ ఫౌండేషన్ స్థాపక సభ్యులలో ముఖ్యుడైనా కాంగ్రెస్ సభలకు వెళ్లి చివరి ప్రయత్నం చేశాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-6-23-ఉయ్యూరు

