రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -12
18-2-1918 గోఖలే మూడవ వర్ధంతి సందర్భంగా శాస్త్రి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అనే పత్రికా విభాగాన్ని సర్వెంట్స్ ఆఫ్ ఇండియాసొసైటీ లో ఏర్పరచాడు.దీన్ని కరెంట్ అఫైర్స్ ను బాగా వ్యాప్తి చేయటానికే చేశాడు .దీని మొదటి సంచికలో శాస్స్త్రి –‘’గోఖలే మహాశయుని ఆదర్శాలను ,బోధనలను పదిలపరచటం ,వాటిని జనజీవిత సమస్యలను పరిష్కరించటానికి ఉపయోగించటం ఈపత్రిక విధానం ‘’అన్నాడు .నడిపెవారంతా గురు గోఖలే గారి నడవడిక సిద్ధాంతాలు ప్రవర్తన లను పూర్తిగా అలవరచుకొని ,ఆయన నడిచినట్లే నడవాలి నీతి న్యాయబద్ధంగా .ఇందులో శాస్త్రి సంపాదకీయాలు ప్రజాజీవితం లో ఆదర్శం ఎలా ఉండాలో సూచి౦చటమే కాక, సమస్యల సమగ్ర విశ్లేషణ ,పరిష్కార మార్గాలు చెప్పటమే కాక ‘’As a master of the music of the written word as well as the symphony of the spoken utterance ‘’గా ఉంటుందని విశ్లేషకలు మురిసిపోయారు .మాంటేగ్ –చేమ్స్ ఫర్డ్ రిపోర్ట్ బయటికి వచ్చినతర్వాత ,సెక్రెటరి ఆఫ్ స్టేట్ రెండు కమిటీలను ఏర్పాటు చేశాడు అందులో ఒకటి ఎన్నికైన మంత్రులకు ఏయే విషయాలు ఇవ్వాలి ,ఏవి గవర్నర్ కు ఎక్సి క్యూటివ్ కౌన్సిల్ కు రిజర్వ్ చేయాలి ,రెండవది –ప్రాంతీయ ,కేంద్ర సభల ఎన్నికల విధానం లపై సలహాలివ్వమని కోరాడు .ఎన్నికల కమిటీకి శాస్త్రిన .సురేంద్ర నాద బెనర్జీ లు సభ్యులు వీరు లార్డ్ సౌత్ బరో అధ్యక్షుడి తో పని చేయాలి .సౌత్ బరో న్సిష్పక్షపాతమైన మనిసి భారతీయులంటే అభిమానం బాగా ఉన్నవాడు .ఈకమిటి నిర్దుష్టంగా నిర్మొహమాటం గా చర్చించి సానుకూలమైన రికమండేషన్లు చేసింది .సౌత్ బరోకు శాస్త్రిపై చాలా గౌరవం ఆత్మీయత కలిగాయి .1930లో శాస్త్రికి ఒక ఉత్తరం రాస్తూ ‘’మన కమిషన్ పై చిన్న వ్యాసం రాయండి .ఇంతటి సహకారం ,ఏకీభావం ముందు ముందు ఉంటుందో లేదో ‘’అని కోరాడు .
ఇండియన్ లిబరల్స్ బొంబాయి నుంచి 28-4-1919 న ఇండియా సంస్కరణలకు అనుకూలంగా బ్రిటీష వారి మద్దతుకోసం బయల్దేరి ఇంగ్లాండ్ వచ్చారు .అందులో శాస్త్రికూడా ఒక సభ్యుడు.ఇదే శాస్త్రి చేసిన మొదటి విదేశీ ప్రయాణం. అప్పుడు ఆయనకు వయసు యాభై .భారతీయ విధానానికి ఆయన వాగ్ధాటి దూర దృష్టి సవివరణ గొప్ప వరాలయ్యాయి .వచ్చిన దగ్గర్నుంచి శాస్త్రి ముఖ్యనాయకుల్ని కలవటం,అనేక సమావేశాలలో మాట్లాడటం ,సంస్కరణలను సమర్ధించి ఇ౦కా మెరుగులు దిద్దటం లో బిజీబిజీ అయ్యాడు .కానీ ఇంగ్లీష్ వారు మన మాటలను పట్టించుకూనే స్థితిలో లేకపోవటం బాధ కలిగించి శాస్త్రి 5-6-1919 న ఇలా రాశాడు –‘’ఇక్కడ ఇండియా బాధలు ఏ కొద్దిమందికో తప్ప ఎవరికీ పట్టలేదు. చాలామందికి ఇండియా ,అందులోని ప్రజలగురించి అవగాహనే లేదు. తమల్ని దేబిరిస్తున్నందుకు గర్వంగా భావిస్తున్నారు ‘’అన్నాడు .సానుకూలమైన వారిని శాస్త్రి బాగా నచ్చ చెప్పాడు అన్ని కోణాల్లో .లీడ్స్ యూని వర్సిటి కి చెందిన మైఖేల్ సాడ్లర్ ఒక ప్రైవేట్ లెటర్ లో ఇలా రాశాడు –‘’శాస్త్రి వాదనలు చాలామందిని ప్రభావితం చేశాయి .ఇక్కడి స్ట్రీ ,పురుషుల సానుభూతి ,సపోర్ట్ శాస్స్త్రికి లభించింది .వీటన్నిటికి మించి –‘’His spoken ,his personality ,has charmed and impressed those who have had the privilege of meeting him..And they are many and influential ‘’.
15-8-1919 న ‘’ బ్రిటీష పార్లమెంట్ అన్ ఇండియన్ కాన్ ష్టి ట్యూషనల్ రిఫార్మ్స్ జాయింట్ సెలెక్ట్ కమిటి ‘’ముందు శాస్త్రి కలిగించిన ప్రభావం వర్ణనాతీతం – Created a great impression and was described -‘’Characterised by phenomenal mastery ,independence ,outspokenness and dignity ‘’.అనీబిసెంట్ ప్రతినిధిగా అప్పుడు లండన్ లో ఉన్న సిపి రామస్వామి అయ్యర్ ఇలా రాశాడు –‘’There is not a name that stands higher in England today than that of V.S.Srinivasa shastry .అలహాబాద్ పత్రిక’’ లీడర్’’ లో Mr.H.S.L.పొలాక్ –కమిటీలోని ఏ ఒక్క మెంబర్ కూడా శాస్త్రి లాగా ఆ బిల్ కు షేప్ ఇవ్వలేదు .అన్నివిధాలా శాస్త్రి గోఖలే కు సరైన వారసుడు అనిపించాడు .ఇక్కడ ఈ విషయం లోకూడా గోఖలే ‘’కరదీపిక’’ మాంటిల్ శాస్త్రి భుజాలాపై ప్రకాశించింది .సంపూర్ణ న్యాయం చేసి మాట్లాడాడు గోఖలే ఆత్మ పరమ సంతోషం అనుభవించి ఉంటుంది శిష్యుడి సమర్ధతను చూసి ‘’. ఆ ఏడాది చివర్లో శాస్త్రి ఇండియా కు తిరిగి వచ్చాడు .తానుకోరిన మార్పులు చేర్పులతో బిల్లు త్వరలో చట్టం అవుతుందని పూర్తి నమ్మకం తో ఉన్నాడు శాస్త్రి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-6-23-ఉయ్యూరు

