రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -18

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -18

7-7-1921న శాస్త్రి ఒక తీర్మానం ప్రవేశ పెట్టాడు అందులో విషయాలు –‘’ఈ సమావేశం 1918 ఇంపీరియల్ వార్ కాన్ఫరెన్స్ తీర్మానాన్ని మళ్ళీ సమర్ధిస్తూ ,బ్రిటీష కామన్  వెల్త్ లోని ప్రతి సంఘం తన జనాభాను స్వీయ నియంత్రణలో ఉంచుకొంటూ బ్రిటీష సామ్రాజ్యంతో సమాన హోదా అనుభవించాలి .బ్రిటీష కామన్ వెల్త్ పటిష్టత కు సహకరిస్తూ భారతీయుల పౌరసత్వాన్ని గుర్తించి కాపాడాలి .లండన్ లెటర్ అనే పేరుతొ శాస్త్రి ఇలా రాశాడు -శాస్త్రి ‘’ మంచి గౌరవప్రదమైన పబ్లిక్ స్పిరిటేడ్ పర్సనాలిటి తో ఇంపీరియల్ మెంబర్స్ పై గొప్ప ప్రభావం కలిగించాడు .టెక్నికల్ గా ఆయన భారత ప్రభుత్వ  ప్రతినిధి అయినా ,అంతకంటే చాలా ఎక్కువగా కృషి చేశాడు .ఆయనధైర్యం గా సాహసంగా మాట్లాడాడు .అందులో మృదువైన మర్యాద ఉంది..తన దేశం విషయం లో ఒక భారతీయుడు గా అత్యుత్తమ దేశ భక్తితో ప్రసంగించాడు .-At the conference he created a sensation in all quarters by the energetic and firm exposition that he delivered of the views of India on the question of The Imperial Citizenship and the status and disabilities Indian communities over seas’’.’’

   రాజకీయ కార్యక్రమాలలో నిండా మునిగి పనిచేస్తున్నా శ్రీనివాస శాస్త్రి స్నేహితులకు  కుటుంబంలోని వారికి సుదీర్ఘమైన ,మనోహరమైన ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు .చేకర్స్ నుంచి కుమారుడికి ఉత్తరం రాస్తూం అంతటి  పని ఒత్తిడి బాధ్యతలో ఉన్నా తన సాహితీ ఉత్సుకతను దాచుకోకుండా బయటపెట్టాడు .ఒక ఉత్తరం లో శాస్త్రి –దగ్గర్లోనే ఉన్న ఒక గ్రామం మహాకవి మిల్టన్  జన్మ స్థలంగా ప్రసిద్ధికెక్కింది .ఈ ఇంటికి సుమారు మైలు దూరం లో ఒక చిన్న అందమైన చర్చి ఉంది.అది చాలా చక్కని ప్రదేశం.అందులో హాంప్ డన్ పారిషనర్స్ అంటే చర్చికి రోజూ వెళ్ళే భక్తులకు దీర్గ ప్రసంగాలతో నౌకాధనం లో అసమానతలు గురించి చెప్పేవాడు అందులో అతడికి రావాల్సిన 13 s,6D  గురించి వివరించేవాడు దీనికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా అక్కడ ఉంది.ఆ ఇంట్లో ఒకప్పుడు ఆలివర్ క్రాం వెల్ కూతురు ఉండేది .అందులో ఒకగోడలో రక్షకుని పోత పోసిన బొమ్మ ఉన్నట్లు ఇటీవలే కనుగొన్నారు పెద్ద ముక్కు ,చాతీ వగైరాలున్నాయి .మార్ష్టన్ యుద్ధభూమిలో అతడు రాసిన లెటర్ కూడా మనం చూడచ్చు .కవి గ్రే ఎలిజీ రాసిన స్టోక్ పోగిస్ కూడా చూడచ్చు .ఇక్కడికి అరగంట మోటార్ ప్రయాణ దూరం లో ఉన్నది .అతడు ఎందుకు రాశాడో మొదట నాకు అర్ధం కాలేదు .హాంప్ డన్లో గుర్తింపు పొందని ప్రతిభగల మూగ మిల్టన్ ,నిర్దోషి అయిన క్రాం వెల్ ల గొప్పతనాన్ని గుర్తింప జేయటానికే రాసి ఉంటాడని నాకు తర్వాత అర్ధమైంది ‘’

  ఇంపీరియల్ కాన్ఫరెన్స్ లో శాస్త్రి అనేక ప్రశంసలు పొంది ,ప్రీవీ కౌన్సిల్ మెంబర్ గా గౌరవింప బడ్డాడు .బకింగ్ హాం పాలస్ లో ప్రమాణ స్వీకారోత్సవానికి అతి ఖరీదైనడాబు దర్పం తో ఉండే డ్రెస్ అంటే స్టేటస్ చిహ్నం గ ధరించ కుండా ఉండటానికిఆయనకు పర్మిషన్ లభించి మామూలు తలపాగా తో హుందాగా హాజరై చక్రవర్తి నుంచి ప్రీవీ కౌన్సిల్ మెంబర్షిప్ అందుకొన్నాడు .ఇది అరుదైన గౌరవం .’’ఫ్రీడం ఆఫ్ సిటి ఆఫ్ లండన్ ‘’గౌరవం కూడా ఆయనకు అంద జేశారు .ఆ సందర్భంగా శాస్త్రి చేసిన ప్రసంగం –క్లాసిక్ గా ఉండి,,ఇండియాలోని ఇంగ్లీష్ పుస్తకాలలో పాఠ్యా౦శ౦ అయింది .ఆయన బ్రిటీష సామ్రాజ్యాన్ని భూ ప్రపంచం లో స్వాతంత్ర్య దేవాలలయాలలో ఉత్తమోత్తమమైనది అన్నాడు .ఆస్వాతంత్రాన్ని దూషించటం  అతిక్రమించటం చేయవద్దు అని హెచ్చరించాడు .ఇండియా ను బ్రిటీష సామ్రాజ్యం లో సమాన భాగస్వామి గ గుర్తించి గౌరవించాలనీ ,మానవ సేవలో తరించాలని వినయంగా కోరాడు .అప్పటి పరిస్థితులలో  సామ్రాజ్య పౌరసత్వం ఊహించరానిదే అయినా ,But he saw far ahead into the future and anticipated the day when the Prime Minister of India  ,Jawaharlal Nehru  ,would receive the Freedom of the City of London ,and proclaim the free partnership of the Common wealth  .’’ఇదీ శాస్త్రికి ఉన్న దూర దృష్టి .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-6-23-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.