రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -20

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -20

 డొమినియన్  టూర్

  వాషింగ్టన్ నుంచి లండన్ కు తిరిగి వచ్చాక ఇంగ్లాండ్లో మరింత ప్రగతి శీల అభిప్రాయం కూడా ఇండియాకు విరుద్ధంగా నే అవటంతో శ్రీనివాస శాస్త్రి  నాన్ కో ఆపరేషన్ ఉద్యమం ,వేల్స్ రాజు ను బాయ్ కాట్  చేయటం పై బాగా వ్యధ చెందాడు .ఈ విషయం ముందుగానే ఊహించిన శాస్త్రి అయిదవ జార్జి ని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ను ఇండియా పంపవద్దని సలహా ఇచ్చాడు .1922మార్చి చివరలో శాస్త్రి ఇండియాకు తిరిగి వచ్చాక దేశం, పైకి మాత్రం శాంతి యుతంగా ఉన్నట్లు కనిపించినా లోలోపల ప్రశాంతత లేనట్లుఉదికిపోతున్నట్లు  గుర్తించాడు .ఇలాకాక ఇంకో రకంగా ఉండ లేదు అనీ తెలుసుకొన్నాడు .మహాత్మా గాంధీ ,ఆయనతో పాటు దేశ వ్యాప్తంగా వేలాది ప్రజలు అరెస్ట్ అయ్యారు .ప్రభుత్వ అణగార్పు చర్యలు తీవ్రమైనాయి .లండన్ లో శాస్త్రి కీర్తి ప్రతిష్టలతో వెలిగిపోయాడు .జెనీవా వాషింగ్టన్ లలో మాత్రం మహోన్నత నాయకుడు ప్రారంభించిన ఉద్యమానికి వ్యతిరేకంగా శాస్త్రి ఉండటంతో ఒక  మరుగు దొడ్డి ని  చూసినట్లు చూశారు.

  7-5-1922 న శాస్త్రి బాంబే ప్రాంతీయ లిబరల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించాడు .అప్పుడున్న రాజకీయ పరిస్థితి పై ఆయన ఇచ్చిన అధ్యక్షోపన్యాసం తనను బ్రిటీష వారి ‘’సేవకుడు ‘’(minion )అని ముద్ర వేసినా ,నిష్కల్మష నాయకుడు మహాత్మా గాంధీని కూడా లెక్క చేయకుండా నిర్మోహ మాటంగా మాట్లాడాడు .ప్రభుత్వం ప్రారంభించిన చట్టం న్యాయం పేరిట చూపిస్తున్న టెర్రరిజం పై నిప్పులు కక్కాడు .ఆయన మాటలలో –‘’ఇవాళ ఉన్నట్లు గా ప్రభుత్వం అపనమ్మకం తో ఎప్పుడూ లేదు ‘’such  absolute lack of faith in their sincerity ,such rooted tendency to put aside all their pledges ,and promises and declarations of intentions as of no value what ever ‘’అని కడిగిపారేశాడు.సహాయ నిరాకరణ ఉద్యమం చాలా స్థిత చిత్తం తో సమతుల్యంగా నడుస్తోంది అన్నాడు .తన హృదయపు లోతుల్నుంచి మాట్లాడుతూ శాస్స్త్రి ఆ ఉద్యమం మచ్చ లేని –one whose character is above cavil (వితండవాదం )and whose motives are beyond suspicion ‘’మహాత్మా గాంధీ చేత ఆయన నిర్విరామ పర్యవేక్షణకింద జరుగుతోంది అన్నాడు.మహాత్ముని ఉద్యమాలు అదో జగత్ సహోదరుల ఉద్ధరణకోసం జరిగాయి ,జరుగుతున్నాయి జరుగుతాయి కూడా .స్వదేశీ కానీ ,అస్పృశ్యతా నివారణ ఉద్యమం కానీ కింది  తరగతి జనం అభి వృద్ధి కోసమే చేశాడు మహాత్ముడు .ఆయన ప్రారంభించిన ఉద్యమాలు దేశం లోని మారుమూల ప్రాంతాలకు కూడా వ్యాపించి వేలాది స్ట్రీ పురుషులు స్వచ్చందంగా పాల్గొంటున్నారు అంటే మహాత్మునిపై ఉన్న భక్తీ విశ్వాసం ఆయన తమ ఉద్దారకుడు అని భావించటం వల్లనే .స్వరాజ్య ఉద్యమంతో లక్షలాది యువకులను జాగృతం చేసి ,దేశ భక్తీ రగుల్కొల్పి జాతీయ ఐక్యతకు పట్టం కట్టాడు .అయితె ఈ ఉద్యమ౦ లో కొన్ని లోపాలు ఏర్పడి సంస్థల ,ప్రైవేట్ పబ్లిక్ ఆస్స్తుల ధ్వంసం, వినాశనానికి దారితీయటం బాధాకరం .క్షంతవ్యం కూడా కాదు.ఇలాంటి విపత్కర పరిస్తితులలో శాంతి భద్రతలను కాపాడటానికి ప్రభుత్వం అణచి వేత విధానం తప్పని సరి పరిస్థితి లో అవలంబించి ఉంటుంది  .జాతుల మధ్య ,కులాల మధ్య చెలరేగిన చిచ్చు నార్పే ప్రయత్నం చేసింది .ప్రతిచిన్న విషయానికి చిన్నా పెద్దా చదువుకున్నవారు చదువు లేని వారూ ఆదా మగా అందరూ నిరసనలకు దిగటం బాయ్ కాట్ చేయటం ,సహాయ నిరాకరణ చేస్తూ రోడ్లమీదకు రావటం ,మాబ్ సైకాలజీ ప్రదర్శించటం బాధాకరం .ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలని,ప్రజలను రక్షించాలని  ప్రారంభించిన ఉద్యమం ,ప్రజల్ని మరింత లోతుగా బాది౦ చేది గా మారిపోయింది ‘’అని నిస్సంకోచంగా సహాయ నిరాకరణ ఉద్యమం పై తన అభి ప్రాయాలను గట్టిగా వినిపించాడు .తర్వాత ప్రభుత్వాన్ని నిలదీస్తూ బాధితుల దుఃఖాలను తగ్గించి త్వరలో శాంతి ని నెలకొల్పాలని ,ఉద్యమం లో పాల్గొని జైళ్ళ పాలైన వేలాది మంది భారతీయులను వెంటనే విడుదల చేసి వారి మనసులలో ప్రశాంతత కల్పించాలని కోరాడు .శాస్త్రి మాటలు తీవ్ర వాదుల మాటల్లాగా ఎవరినీ సంతృప్తి చెందించలేదు .బ్యూరోక్రాట్స్ పెదవి విరిచారు .కలకత్తా పత్రిక స్టేట్స్ మన్ –‘’approximate to the political sentiments of those who filled the extreme camp ‘’అని శాస్త్రి భావాలపై స్పందించింది

   ఇండియా ప్రభుత్వ ప్రతినిధిగా శాస్త్రిని న్యూజిలాండ్ ఆస్ట్రేలియా కెనడాలకు  ,ఆయా ప్రభుత్వాలతో చర్చించి ఆయాదేశాల లోని ఇండియన్స్ కు సమాన హోదాలో పౌరసత్వం ఇవ్వటానికి అంగీకరింప చేయటానికి పంపించినప్పుడు ,శాస్త్రి కి ఉన్న ప్రజాదరణ భారత ప్రజలపై  కానీ ఆంగ్లో-ఇండియన్ ప్రెస్ పై కానీ ప్రభావం చూపలేక పోయింది .12-5-1922 న ఆయన డొమినియన్ లలో పర్యటనకు బయల్దేరే ముందు వైస్రాయ్ లార్డ్ రిద్దింగ్  శాస్త్రి గౌరవార్ధం  గొప్ప విందు ఇచ్చాడు .శాస్త్రి సామర్ధ్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన –‘శాస్త్రి సేవలు ఇప్పటికే విశిష్టంగా ఉన్నాయి .ప్రజలచే గుర్తింప బడ్డాయి .అవి చరిత్రలో ‘’important page in history ‘’స్థానం పొందాయి అనిశ్లాఘించి సెక్రెటరి ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా విస్కౌంట్  పీల్ పంపిన సందేశాన్ని చదివి వినిపించాడు .అపుడు శాస్త్రి చేసిన ప్రసంగం చారిత్రాత్మకం .అందులో  అసమ్మతిని రూపుమాపి ,జాతులమధ్య సామరస్యం సాధిస్తున్న తూర్పు –పడమర మధ్య రాజీ సాధిస్తున్న  బ్రిటీష కామన్ వెల్త్ పై తనకున్న సంపూర్ణ విశ్వాసం వివరించాడు .  తన గౌరవార్ధం ఇచ్చిన విందుకు ధన్యవాదాలు చెప్పిన తర్వాత అసలు విషయం చెప్పాడు-‘’we never had such a wreck of hope and faith in the Government of today .I say this in all solemnity ‘’అని ముగించాడు .అక్కడున్న సివిల్ సర్వెంట్స్ ,ఆంగ్లో –ఇండియన్ ప్రెస్ ఈ వీడ్కోలు విందు ను శాస్త్రి సరిగ్గా వినియోగించుకోలేదు అన్నారు .జీవితం చివరి రోజుల్లో శాస్త్రికూడా ‘’mentioned it with humility and remorse as an un fair lapse  of taste on his part ‘’అని బాధ పడ్డాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-7-23-ఉయ్యూరు   

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.