రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -28
1924 ఏప్రిల్ లో సబర్మతిలో ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్ కు శ్రీనివాస శాస్త్రి వెళ్ళలేదు .తనభావాలను ఓక స్టేట్మెంట్ రూపంగా సరోజినీ నాయుడికి పంపాడు .ఉన్న పరి స్థితులదృష్ట్యా తాను మళ్ళీ కాంగ్రెస్ లో చేరే అవకాశం లేదని ,కౌన్సిల్ లో ,ఆఫీసు లలో కాంగ్రెస్ చేరే విషయమై ,సహాయ నిరాకరణ విషయమై కాంగ్రెస్ కు సరైన దృక్పధం లేదు అన్నాడు .చివరగా –‘’శాంతిని కోరే నేను కాంగ్రెస్ లో చేరటం కుదరదు .అనవసరంగా నిరవధికంగా కార్యక్రమాలు చేబట్టటం నాకు నచ్చదు ‘’అన్నాడు .గోఖలే లాగా విఫలం తర్వాత విజయం కోసం మళ్ళీ ప్రయత్నించటం శాస్త్రి లక్షణం.రాజకీయ ప్రతినిధిగా బీసెంట్ తోపాటు శాస్త్రి 1924ఏప్రిల్ లో ఇంగ్లాండ్ వెళ్లాడు .రాజ్యాంగ త్వరితం పై అక్కడి వారితో చర్చించటం ఒప్పించటమే లక్ష్యం.ఒక స్నేహితుడికి ఉత్తరం రాస్తూ శాస్త్రి –‘’ఇప్పుడు నేను యే ఉత్సాహం లేకుండా వెడుతున్నా.కొద్దిపని మిగిలింది ఎవరికీ తెలుసు మేము లండన్ వెళ్ళే లోపు అక్కడి ప్రభుత్వం కుప్పకూలుతుందేమో ?బలహీనమైన ప్రభుత్వమే అయినా ,ఏమీచేయలేక మన కాళ్ళూ చేతులకు అడ్డం పెడుతోంది.
మే 10 నుంచి జులై 31వరకు శాస్త్రి లండన్ లో ఉన్నాడు .ఆరోగ్యం అంతగా సహకరించకపోయినా ,తీవ్ర కృషి చేస్తూనే ఉన్నాడు .బిసెంట్ మరియు ఇతర సభ్యులతోకలిసి ఇండియాఆఫీస్ లో ఇండియాకు ‘’డొమినియన్ హోమ్ రూల్ ‘’ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మెమొరాండం సమార్పించాడు .మేడం తోకలిసి అనేక చోట్ల వరుస ప్రసంగాలు చేశాడు తమ డిమాండ్ విషయమై .కానీ లేబర్ ప్రభుత్వం మార్పు లేని వైఖరి చూసి అశోపహతుడయ్యాడు .22-5-1924 న ఒక ఉత్తరం రాస్తూ ‘’ఇక్కడి పరిస్థితులను చూస్తె ప్రభుత్వానికి ఇండియాపై గొప్ప ప్రణాళిక ఏమీ ఉన్నట్లు కనిపించాటం లేదు .ఉన్న కష్టాలను ఏదోరకంగా అధిగమించాలని అనుకొంటో౦ది .’’అన్నాడు .మే 28 న బ్రిటీష ఆక్సిలరి ఏర్పాటు చేసిన అతిపెద్ద సమావేశంలో శాస్త్రి ప్రసంగిస్తూ ‘’లీ కమీషన్ ‘’ఐ.ఎ .ఎస్. ఆఫీసర్ లకు జీతాలు విపరీతంగా పెంచి ఆడంబర సౌకర్యాలు కల్పించటానికి సిఫార్స్ చేయటం పై మండి పడుతూ దాన్ని ‘’లీలూట్ ‘’అంటే లీ గారి లూటీ అని తీవ్రంగా ఆక్షేపించాడు .దీనిపై స్పందిస్తూ జాషువా వెడ్జ్ వుడ్ ఈ సారి శాస్త్రి వెళ్ళే ప్రదేశం లో దేశద్రోహ నేరం పై అరెస్ట్ కాబడే’’ మొదటి ప్రీవీ కౌన్సిల్ మెంబర్ అవుతాడు’’ అన్నాడు .జూన్ 25 న శాస్త్రి క్వీన్స్ హాల్ లో సమావేశమైన విస్తృత ప్రజలనుద్దేశించి తీవ్రస్వరంతో డొమినియన్ సెల్ఫ్ గవర్న్ మెంట్ గురించి పది నిమిషాలు మాత్రమె మాట్లాడాడు .
తీవ్ర అనారోగ్యంతో శాస్త్రి ఆగస్ట్ చివర్లో ఇండియా తిరిగి వచ్చాడు .దేశంలో పరిస్థితి ఆశాజనకం గా లేదని పించింది .దేశంలోతరచుగా జరుగుతున్న హిందూ –ముస్లిం దాడులకు కలత చెంది మహాత్మా గాంధి 21 రోజుల నిరాహార దీక్ష ఢిల్లీ లో పూనాడు .సామరస్య సంఘ సమావేశం అక్కడే జరిగి నాయకులంతా పరస్పరం అవగాహనతో స్పర్ధలు లేకుండా ఉంటామన్నారు .ఇలాంటి ప్రతిజ్ఞలు హామీలు తాత్కాలికమే కానీ నిలిచేవికావు అని శాస్త్రి గట్టి నమ్మకం .తన అభిప్రాయాలను’’ సర్వెంట్ ఆఫ్ ఇండియా’’ పత్రికలో శాస్త్రి –‘’రామ ,భీష్మ ప్రతిజ్ఞ లాగా కట్టుబడక ప్రశాంత పరిస్థితి టో ఆలోచించండి .దీక్ష విరమించండి ప్రజలలో సామరస్య౦ శాంతి నెలకొల్పండి .ఒకజాతీయనాయకుడు తీసుకొన్న కఠోర నిర్ణయం వలన ,అనుకొన్న కాలం లో పరిస్థితులు చక్క బడవు .’’అన్నాడు 1925లో ఆపత్రికలోనే శాస్త్రి చాలా వ్యాసాలూ రాశాడు .దేశంలోని బ్రిటీష వారు మహోన్నత వ్యక్తిత్వమున్న మహోత్మా గాంధీ శాంతి యుత సహకార జీవన విధానాన్ని అర్ధం చేసుకొని మత సంఘర్షణలు నివారించమని రెచ్చగొట్టవద్దని కోరాడు .రాజకీయ నాయకులను సాంఘిక విషయాలలో తల దూర్చి సమస్యలను జటిలం చేయకండి అని కోరాడు .స్వరాజ్యం ప్రజా సంక్షేమం సాధించటానికి కావలసింది –‘’కో ఆపరేషన్ మాత్రమె ,నాన్ కో ఆపరేషన్ కాదు ‘’అని తీవ్రంగా చెప్పాడు .’’మనం ఇవాళ చాలా నిరాశతో ఉన్నాం .అవిధేయత డైరెక్ట్ యాక్షన్ లపై ఉంది మన దృష్టి అంతా దాని ఫలితమే ఈ నిరాశ .వీటివలన విధానాలు విచ్చినమౌతున్నాయి ,గందర గోళం పెరిగిపోయింది ,అవమానాల పాలౌతున్నాం .వీటిఫలితమే తుపాకి వెనక్కి తిరిగి పేలినట్లు –రీకాయిల్ ఆఫ్ ది గన్ మనం ఏర్పరచుకో బోయే హోమ్ రూల్ పై తీవ్రప్రభావం చూపి ప్రజల కడగళ్ళు విపరీతమౌతాయి. మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి లోకి జారిపోతాం అని గుర్తించండి ‘’అని జాతిని హెచ్చరించాడు శాస్త్రి
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-7-23-ఉయ్యూరు

