రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -37
గాంధీ కి రాసిన మరో ఉత్తరం లో శ్రీనివాస శాస్త్రి ‘’కెన్యాలోని మన వారిపై నాకు ద్వేషం లెదు .అవకాశం వచ్చినప్పుడు వారికి సాయం చేయటంలో ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను ‘’అన్నాడు అలాంటి అవకాశం వెంటనే వచ్చేసింది .1931లో భారతప్రభుత్వం శాస్త్రినిబ్రిటీష పార్లమెంట్ లోని రెండు సభల సంయుక్త సమావేశం లో తూర్పు ఆఫ్రికా పై బ్రిటీష ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదనలపై సాక్ష్యం ఇవ్వటానికి ప్రతినిధిగా పంపింది .శాస్త్రి సాక్ష్యం బహు నిర్దుష్టంగా ధైర్యంగా సవాలుగా ,విదేశాలలోని ఇండియన్ల పరిస్థితి రోజురోజుకూ దిగాజార్చేట్లు తెల్లవారికంటే న్యూనతగా ఉండేట్లు ఉందన్నాడు .మళ్ళీ జాయంట్ సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ కామన్ రోల్ కు వ్యతిరేకంగా ఇండియన్లకు యూరోపియన్లకు మధ్య ప్రాతినిధ్య సమానతకు వ్యతిరేకంగా ఉన్నది .శాస్త్రి జాతి విభేడం సమసిపోతున్దనుకోన్నది మరీ పెచ్చు పెరిగినందుకు విపరీతంగా బాధపడ్డాడు .దీనితో శాస్త్రి ఆరోగ్యం దెబ్బతిన్నది .కానీ మానసికంగా కుంగిపోలేదు .భగవద్గీతలో చెప్పిన సమానత్వ సామరస్యాలను పు౦జుకొన్నాడు .
మొదటి రౌండ్ టేబుల్ సమావేశం
మొదటి రౌండ టేబుల్ కాన్ఫరెన్స్ సమయంలో ఇండియన్ లేబర్ పై రాయల్ కమీషన్ మెంబర్ గా శాస్త్రి అప్పటికే లండన్ లో ఉన్నాడు .దీని నాయకుడు రైటానరబుల్ జే.హెచ్ విట్లీ . అల్ బ్రిటీష సైమన్ కమిషన్ ను ఇండియాలోని రాజకీయ పక్షాలన్నీ లిబరల్స్ టో సహా బాయ్ కాట్ చేశాక ,బ్రిటీష ప్రభుత్వానికి రాజ్యాంగ పురోగతి డొమినియన్ హోదా విషయాలలో ముందడుగు వేయటానికి వణికి పోతోంది .కొత్త వైస్రాయ్ ఇర్విన్ మానవత్వమున్నమనిషి, మనిషి బాధలు అర్ధం చేసుకొనే వాడు .కనుక జరిగిన నష్టాన్ని భర్తీ చేయటానికి ఇండియాతో స్నేహ హస్తం చాచాల్సిన అత్యవసర పరిస్థితి వచ్చిందని గ్రహించాడు .ముఖ్యంగా ‘’నాన్ కో ఆపరేటర్ ‘’అయిన గాంధీతో సంప్రదింపులు జరపాలనుకొన్నాడు .బ్రిటీష్ వారి చిత్తశుద్ధిని ప్రదర్శించి ఇండియన్ల హృదయాలను గెలవాలనుకొన్నాడు .లార్డ్ రీడింగ్ కల్పించిన అఘాతం పూడ్చి స్నేహసేతువు నిర్మించటానికి పూనుకొన్నాడు .1929 లో లండన్ కు సెలవుపై వెళ్ళినప్పుడు కొత్త సెక్రెటరి ఆఫ్ స్టేట్ వెడ్ వుడ్ బెం ముందు తన ప్రపోజల్ పెట్టాడు .దీనికి అయిష్టంగా సరే అంటూ సైమన్ అభిప్రాయాన్ని ముందుగా తెలుసుకోవటం మంచిది అన్నాడు .మొదట్లో డొమినియన్ స్టేటస్ ను ఒప్పుకున్నా సైమన్ తర్వాత వ్యతిరేకించాడు .కానీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు ఒప్పుకున్నాడు .అందువల్ల కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వం ముందు ఉంచవచ్చుననే కారణంతో .దీనిపై ప్రధానికి ఆయనకు చాలా కరెస్పాండెన్స్ నడిచి౦ది కూడా .
ఇర్విన్ అభిప్రాయాన్ని లిబరల్స్ ,కన్జర్వేటివ్ లూ అధిక సంఖ్యలో వ్యతిరేకించారు .బాల్డ్విన్ మాత్రం ఇర్విన్ ను సమర్ధించాడు డొమినియన్ స్టేటస్ విషయంలో .దీనివలన బాల్డ్విన్ చర్చిల్ లమధ్య వ్యతిరేకత ఏర్పడింది .వ్యతిరేకతను తిరస్కరించి మాక్ డోనాల్డ్ 31-10-1931న ఇర్విన్ ఇండియా వెళ్లేముందు గజిట్ లో నోటిఫికేషన్ ఇచ్చాడు .మాంటేగ్ –చేమ్స్ ఫర్డ్ లసంస్కరణలను పేర్కొంటూ వైస్రాయ్ స్టేట్మెంట్ ఇలా సాగింది –‘’ఇండియా రాజ్యాంగ ప్రోగ్రెస్ ప్రకారం డొమినియన్ స్టేటస్ సాధన ఉన్నది ‘’.
ఈ స్టేట్ మెంట్ ఇవ్వటానికి ముందు ఇర్విన్ చాలా జాగ్రత్తగా ఒక చక్కని భూమికను అన్నిపార్టీలతోనూమహాత్మ గాంధీతోనూ సంప్రదించి కల్పించాడు .ఇర్విన్ ప్రకటన ను ఇండియాలో బాగా సమర్ధించారు .ఇండియన్ పాలసిమీద బ్రిటీష వారు కక్కే విషానికి విరుగుడు కనిపెట్టాడు ఇర్విన్ అని సంతోషించారు .ఇర్విన్ మాటలలో –giving too little and giving it too late ‘’ .సరైన సమయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం చేసింది .ఇక్కడ మనకు మహా సంతోషం అక్కడ బ్రిటన్ లో రాజకీయ పక్షాలమధ్య తీవ్ర అభిప్రాయ ప్రేలుడు జరిగింది ఇర్విన్ స్టేట్ మెంట్ పై .అక్కడి ప్రముఖులు లాయడ్ జార్జ్ ,బర్కెన్ హెడ్ ,ఆష్టిన్ చాంబర్లేన్ ,చర్చిల్,రీడింగ్ వగైరా కాంగ్రెస్ లోని రైట్ వింగ్ నాయకులలో భారత దేశానికి సంపూర్ణ స్వరాజ్యం ఇవ్వటానికి పూర్తీ మద్దతు కూడా గట్టారు .లాహోర్ కాంగ్రెస్ కోరినట్లు డొమినియన్ స్టేటస్ తోపాటు స్వాతంత్ర్యాన్ని రెండు నెలలోపే ప్రకటించారు .లండన్ లో రౌండ టేబుల్ కాన్ఫరెన్స్ కు కూడా ఆమోదించారు .సహాయ నిరాకరణ ఆతర్వాత ఉప్పు సత్యాగ్రహం గాంధీ అరెస్ట్ వేలాది వాలంటీర్ల అరెస్ట్ జరిగాయి రౌండ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఎజెండా ప్రకటించాలని గాంధీ తోపాటు అరెస్ట్ అయిన దేశవ్యాప్త ప్రజలను విడుదల చేయాలని పట్టుబట్టారు .ఆసమయంలో శ్రీనివాస శాస్త్రి ఇంగ్లాండ్ లోనే ఉన్నాడు .గాంధీ –ఇర్విన్ లమధ్య మధ్యవర్తిత్వానికి సప్రూ జయకర్ లు ప్రయత్నించారు .కానీ ఫలించలేదు. కానీ మొదటి రౌండ టేబుల్ కాన్ఫరెన్స్ గాంధీ లేకుండానే జరిగింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-7-23-ఉయ్యూరు

