రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -51
అన్నామలై యూనివర్సిటి వైస్ చాన్సలర్- రైటానరబుల్ శ్రీనివాస శాస్త్రి
భార్య చనిపోవటం వయసు పెరగటం ఆరోగ్యం తగ్గటం శ్రీని వాస శాస్త్రిని తను బాగా ఇష్టపడేబెంగులూరు లో స్థిర పడేట్లు చేశాయి .అక్కడి వాతావరం ముఖ్య స్నేహితుడు గుండప్ప సహకారం ఆయనకు బాగా తోడ్పడ్డాయి .మైసూర్ యూని వర్సిటి ఎక్స్టేన్షన్ లెక్చర్స్ గోఖలే పై ఇవ్వటానికి సిద్ధపడ్డాడు .1935 జనవరిలో రెండు బెంగుళూర్ లో ఒకటి మైసూర్ లో ఇచ్చాడు .కమల లెక్చర్స్ లాగానే ఇవి కూడా మంచి విజయాన్నిచ్చాయి .వీటిపై శాస్త్రి ఒక స్నేహితుడికి జాబు రాసి –‘’ఇక్కడ గోఖలే పై ట్రయాలజి ఉపన్యాసాలు ఇవాళే పూర్తీ చేశాను .ఒక్కోటి గంటన్నర ఉపన్యాసం .ప్రేక్షకులు మూడు వేలనుంచి అయిదు వేలవరకు ఉన్నారు .వారి దృష్టిని బాగా ఆకర్షించగలిగాను .బాగా మెచ్చుకొన్నారు గర్వంగా ఉన్దినాకు ,చేతిలో కాగితం ముక్కకూడా లెదు. వైస్ చాన్సలర్ నిశ్చేష్టుడయ్యాడు .నాగురించి మూడు నిమిషాలు రాసుకొచ్చింది చదివి మెచ్చాడు .నా ప్రసంగాలు’’ Tour de force ‘అంటే అత్యద్భుతం అన్నాడు .నాకు బాధ కాని అలసట కాని రాకపోవటం నాకే ఆశ్చర్యమేసింది .నేను నా పితృ కార్యాన్ని పరమ పవిత్రంగా చేస్తున్నట్లు అందుకే ఎలాంటి జబ్బు లేక రోగనిరోధకం గా ఉందనిపించింది ‘’అని రాశాడు .గోఖలే ఆత్మ శాస్త్రిలో ప్రవేశించి ప్రభావితం చేసి ఉందేమో తాదాత్మ్యంతో అంకితభావంతో గౌరవంతో పరవశంతో మాట్లాడిన మాటలవి .అందుకే అంత శక్తివంతాలయ్యాయి .హాయిగా ప్రశాంతంగా జీవితం గడపాలని అనుకొన్నాడు బెంగుళూరులో .
శాస్త్రి స్నేహితుడు అభిమాని ఆరాధకుడు రాజా అన్నామలై చెట్టియార్ శాస్త్రిని అన్నామలై యూని వర్సిటి వైస్ చాన్సలర్ పదవి స్వీకరించమని బాగా బలవంతం చేశాడు .1929లోనే శాస్త్రిని మొట్టమొదటి వైస్ చాన్సలర్ గా నియమించాడు అన్నామలై .అప్పుడు కెన్యాకు డిప్యుటేషన్ పై వెళ్ళాల్సి వచ్చి చేరలేక పోయాడు ,ఇప్పుడు మళ్ళీ 1935 ఆహ్వానించాడు రాజా అన్నామలై .ఏమీఆలోచి౦చ కుండా ఒప్పుకున్నాడు .గౌరవ వేతనమే తీసుకొన్నాడు .స్కేలు ఆర్భాటం ఒప్పుకోలేదు .పొంగిపోయాడు అన్నామలై .వైస్ చాన్సలర్ గా నిర్వహణ బాధ్యతమాత్రమే కాకతనకు అత్యంత ప్రియమైన ఇష్టమైన బోధన కూడా చేశాడు శాస్త్రి .ప్రపంచంలో చలాదేశాలలో తిరిగి సంపాదించిన జ్ఞాన విజ్ఞానాలు తన విద్యార్ధులకు అందజేయలన్నదే ఆయన తపన .ప్రోచాన్సలర్ అయిన రాజా అన్నామలై శాస్త్రిపై అత్యంత విశ్వాసం చూపాడు ఆయన నిబద్ధతకు ఫిదా అయిపోయాడు .మొదటి మూడేళ్లలో మొదటిఏదాది పూర్తవగానే శాస్స్త్రి అన్నామలైకు కృతజ్ఞతను అత్యంత గౌరవంగా ఇలా తెలియజేశాడు –‘’మీరు నాపై పూర్తీ విశ్వాసం ఉంచారు .నా నిర్ణయాలను గౌరవించారు నా రికమండేషన్లు ఏమాత్రం తాత్సారం లేకుండా ఆమోదించారు .మనమధ్య కాంప్లెక్స్ అనేది లెదు .సౌతాఫ్రికాలో లార్డ్ ఇర్విన్ ,సర్ మహమ్మద్ హబిబుల్లాల మధ్య నేను సౌతాఫ్రికా ఏజెంట్ గా పని చేసిన ఆనందం పొందానుఇక్కడ .’’You are one of the few people who can ,when they choose ,treat their agent as though he were not a receiver ,but a conferrer,of favour ‘’.వీటన్నిటికంటే మీ వ్యక్తిత్వం ,ప్రవర్తన సరికొత్త విధానంగా ఉంది నాకు .మీ గ్రహణ శీలత గొప్పది .ఇవన్నీ నన్ను మాట్లాడనీయకుండా ,మరింత కృతజ్ఞునిగా అనుమాన రహితుని చేశాయి .అత్యంత గౌరవం నాకిక్కడ మీసమక్షంలో లభించి గొప్ప సంతృప్తి నిచ్చింది .వైస్ చాన్సలర్ అంటే ఈ బిల్డింగులు ఈ సౌకర్యాలు స్టాఫ్ స్టూదెంట్స్ మాత్రమేకాదు అంతకన్నా పరమ పవిత్రమైంది .దీన్ని వదిలేసి నేను వెడితే ఎంతటి ఒంటరి వాడిగా మిగిలిపోతానో ఆలోచిస్తే భయమేస్తోంది ‘’అని రాశాడు .శాస్త్రిని రాజా మరొక టరం కొనసాగించమని కోరాడు శాస్త్రి ఆనందంగా ఒప్పుకోని పని చేశాడు .
1936లో శాస్త్రి ప్రభుత్వ ఏకైక డెలిగేట్ గా మలయాకు అక్కడి ఇండియన్ లేబర్ పరిస్థితులు విచారించటానికి వెళ్లాల్సి వచ్చి,అనామలై యూనివర్శిటికి దూరం ఉండాల్సి వచ్చింది .సర్వెంట్స్ ఆఫ్ ఇండియాకు అనుమతికోసం ఉత్తరం రాస్తూ శాస్త్రి –‘’నేను వెళ్ళే పని కష్టమైనదో తతేలికవ్యవహారమో నాకు తెలియదు .నా గౌరవానికి సరిపోయేదో లేక కి౦చ పరచేదో కూడా తెలియదు .ఏమైనా దేశ ప్రజల మంచికోసం వెడుతున్నా నాతోపాటు నా కుమారుడిని సహాయంగా సెక్రెటరి హోదాలో పంపమని కోరుతున్నాను .చర్చలులేకుండా నేను వెళ్ళటానికే నిశ్చయించుకొన్నాను .అది నాకు అగౌరవం కాదు ,నా స్వార్ధానికి కాదు మతపరైనది జాతివ్యతిరేకమైనదీ కాదు .It is the service of our people .My personal rank or dignity is irrelevant ‘’.అని చెప్పాడు .
1936 జనవరి మొదట్లో రంగూన్ చే రాడుశాస్త్రి . ఒక ప్రైవేట్ లెటర్ లో ‘నాశక్తి నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది .బాధ ,ఉత్సాహాలతో నాపని నేను చేసుకుపోతున్నాను .దైవేచ్చ ఎలా ఉందొ ?”’.30రబ్బర్ ఎస్టేట్ లను చూసి ,అక్కడి లేబర్ పరిస్థితి సంతృప్తిగానే గానే ఉందని మలేషి యాకు ఇండియన్ లేబర్ ను జీతాలుపెంచుతూ ఎక్కువ సౌకర్యాలు కలిపిస్తూ పంపించమని రికమెండ్ చేశాడు .ఈ రిపోర్ట్ ను ఇండియాలో బాగానే మెచ్చారు .కానీ మలేషియాలోని ఇండియన్ ప్రెస్ ఆక్షేపించింది .అక్కడి లేబర్ మాత్రం ఇండియానుంచి ఇంకా లేబర్ ను పంపవద్దనిఅక్కడివారు సురక్షితంగా సంపన్నం గా ఉండటానికి ఇబ్బంది అవుతుందని అభిప్రాయపడ్డారు .తన భావాలను వైస్రాయ్ కౌన్సిల్ మెంబర్ గిరిజా శంకర్ బాజ్పాయికి తెలియ జేస్తూ శాస్స్త్రి –‘’మలేషియాలో ఇండియన్లు స్వర్గం లో ఉన్నారని నేను భావించనని నా క్క్రిటిక్స్ అంటున్నారు .నా ఉద్దేశాయం అదికాదు .వేలాది మనవాళ్ళకు ఇక్కడ ఉపాధి ఉందని చెప్పటమే .ఇక్కడికి వలస రావటం హై గ్రేడ్ సిటిజెన్ షిప్ అవుతుంది .అతి ప్రాచీన కాలంలోనే మనం షిప్ నిర్మాణం చేశామని చరిత్ర చెబుతోంది .సముద్ర ప్రయాణం చేసి కాలనీలు స్థాపించి చాలా శతాబ్దాలనుంచి మనవారు ఉంటున్నారు ‘’అని స్పష్టం చేశాడు శాస్త్రి .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-8-23-ఉయ్యూరు

