నవ్య సాహిత్యపరిషత్ సంస్థాపక అధ్యకుడు ,ఎన్టి రామారాలోని నటన గుర్తించి ప్రోత్సహించినవాడు,ప్రాచ్యభాషల అధ్యాపకుడు తెలికి చర్లవెంకటరత్నం -2

నవ్య సాహిత్య పరిషత్ సంస్థాపక అధ్యకుడు ,ఎన్టి రామారాలోని నటన గుర్తించి ప్రోత్సహించినవాడు ,ప్రాచ్యభాషల అధ్యాపకుడు  తెలికి చర్ల వెంకటరత్నం -2

ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం’ వ్యాసం తెలికిచెర్ల వెంకటరత్నం సంపాదకునిగా, గుంటూరునుంచి 1933లో పునర్ముద్రితమైంది. తెలుగు భాషకు సంబంధించి ప్రాచీన, ఆధునిక నిక్షిప్త చారిత్రక అంశాలను ఎన్నింటినో వెలుగులోకి తెచ్చిన నిరంతర మేధా పరిశోధనా సాహితీ జిజ్ఞాసి.

  ‘’వ్యాస సంగ్రహం ‘’కు సంపాదక భూమిక నిర్వహించిన తెలికి చెర్ల వెంకటరత్నం సంపాదకీయంలో –‘’గ్రాంధిక భాషాభిమానులను తప్పు త్రోవ పట్టిస్తూ అదే సంప్రదాయ సిద్ధమైన రుజు మార్గమనే భ్రమతో వెర్రి పరుగులెత్తిస్తున్న భాషా స్రవంతిని ప్రజాసంమతమై ,సహజమై సరళమై ఉండే మార్గం లో పెట్టటానికి భాగీరధ ప్రయత్నం చేసి ,తన ఉద్యమం తనకల్ల ఎదుతనే విజయం పొందే మహా భాగ్యాన్ని పొందిన శ్రీ పంతులు గారి కృషిని అభినందిస్తూ ,వర్తమాన ఆంధ్ర భాషాభిమానులు ఏకముఖంగా వారికి సమర్పించిన ‘’కాన్క’’ఈ వ్యాస సంగ్రహం-A miscellany of papers ‘’.ఈ’’ కాన్క’’ లౌకిక భాషా దేవికి అమూల్య అలంకారం .విజయధ్వజము కూడాను .

పంతులుగారుకృషి చేసిన మానవ జాతి శాస్త్రం పురావాస్తూ శాస్త్రం ,శాసన శోధనం ,ఆంధ్ర భాషా చరిత్రం ,భాషా తత్వ శాస్త్రం ,శిక్షా శాస్త్రం మొదలైనవాటిపై వ్యాసాలూ రాసి పంపమని కోరాము .వాటిని చేర్చి వాటితోపాటు కధలు ,పద్యాలు ,భౌతిక శాస్త్ర విషయాలు కొద్దిగా చేర్చాం .ఈ ప్రచురణలో నాకు మిక్కిలి సహాయ భూతులైన శ్రీ రామ మూర్తిపంతులు  గారి శిష్యకోతిలో ప్రధానులు ,నాకు గురుతుల్యులు శ్రీ కాళ్ళకూరి సూర్య నారాయణ పంతులు గారు .వారికి నాహృదయ పూర్వక వందనములు సమర్పిస్తున్నాను ..-సంపాదకుడు –తెలికి చెర్ల వెంకట రత్న౦- గుంటూరు  -నవంబర్ -1933.ఇందులో వెంకటరత్నం చూపిన వినయ విధేయతలు శక్తి సామర్ధ్యాలు మనకు గోచరమౌతాయి .

 ఈ వ్యాస పరంపరలో ఇంగ్లీష్ తెలుగు విభాగాలున్నాయి .ఆంగ్ల విభాగంలో –బుర్రా శేషగిరి రావుగారి –అవర్ మాస్టర్అండ్ డి మోడరన్ తెలుగు మువ్ మెంట్ ,ఏ.గల్లేట్ రాసిన గ్రామ్యం అండ్ గ్రామర్ ఇన్ ఇటలి , జే ఎయేట్స్ రాసిన –రేమినిసేన్సేస్ ,ప్రొఫెసర్ స్టేన్ కో నౌ రాసిన –లాంగ్వేజ్ రిఫారం ఇన్ నార్వే ,డబ్ల్యు ఎఫ్ డిహెస్సి రాసిన –ఏ స్మాల్ కంట్రిబ్యూషన్ టుది నాలెడ్జ్ ఆఫ్ దిముండా లాంగ్వేజ్ ,ప్రొఫెసర్ ఎల్వి రామస్వామి అయ్యర్ రాసిన – ద్రవిడిక్ గ్లైడ్స్,ప్రొఫెసర్ సొంథికుమారా చెట్టియార్ రాసిన –కారవేల ,ఏ.ఎఫ్ త్యాగరాజు రాసిన –ది డెవలప్ మెంట్ఆఫ్ ద్రవిడియన్,పి.వెంకటరామయ్య రాసిన –ఈజ్ తెలుగు ఆల్ఫబేట్ కవిత్ ఫోనెటిక్ ?ప్రొఫెసర్ ఈ.సూర్యనారాయణ రాసిన –ద్రవిడియన్ ప్రోనౌన్స్ వాన్ ,వాడు,డా.ఎన్ వెంకట రమణయ్య రాసిన –మహేంద్రవర్మ-1 –పులకేశి-2.,టి.ఎన్ రామ చంద్రన్ రాసిన –ఈ బుద్ధిస్ట్ రిలీఫ్ ఫ్రం నాగార్జున కొండ ,మల్లంపల్లి సోమశేఖర శర్మ రాసిన –దిక్రానాలజి ఆఫ్ లేటర్ పల్లవాస్ , గిడుగు వెంకట సీతాపతి రాసిన –పరెన్ ఎ సోరా డయలెక్ట్ వ్యాసాలూ చాలా పరిశోధనాత్మకంగా ప్రయోజనాత్మకం గా ఉన్నాయి .

  తెలుగు విభాగం లో  వ్యాసాలు

సర్వశ్రీ బులుసు పాపయ్య శాస్త్రి –తెనుగు ,మల్లాది సూర్యనారాయణ శాస్త్రి –ఆంధ్ర భాషా సంప్రదాయం ,ముక్కవిల్లి సూర్యనారాయణ –ఆంధ్ర వాజ్మయాభివృద్ధి సాధనాలు ,కోరాడ రామ కృష్ణ య్య –ఆంధ్ర భాషా పదాలు -వాటి నిష్పత్తి క్రమం ,ఉమర్ ఆలీషా కవి –భాష –కవి ,డా.బుర్రా శేషగిరిరావు –కోడు భాష తెలుగు పూర్వ రూపమా ,?మహరాజా విక్రమ దేవ వర్మ –సందేశము , , భోగరాజు నారాయణ మూర్తి –గురుస్మరణ,చింతా దీక్షితులు –లీలా సుందరి ,పురిపండా అప్పలస్వామి –బాలవ్యాకరణం ,డా.చిలుకూరి నారాయణ రావు-మాత్రా ఛందస్సులు ,వఝాల చిన సీతారామ శాస్త్రి –తాలువ అనగా దౌడ కాదు ,పిలకా గణపతి శాస్త్రి –దేవత్వము ,తెలికి చెర్ల కృష్ణ మూర్తి –అణువులు వాటి పరిమాణము ,విస్సా అప్పారావు –చెవి చేయు పని ,పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి –ప్రాకృత గ్రంధ కర్తలు ప్రజా సేవానూ ,విద్వాన్ దువ్వూరి వెంకట రమణ శాస్త్రి –అర్ధ విపరిణామ పధ్ధతి , వాసా సూర్యనారాయణ శాస్త్రి –గ్రామ్యాపవాద నిరసనము,చింతా దీక్షితులు –స్త్రీల సారస్వతము ,వేదాల తిరు వెంగళాచార్యులు –ప్రాకృత భాషా చరిత్రము ,రాళ్ళబండి సుబ్బారావు –తూర్పు గా౦గరాజుల ఆరు కొత్త శాసనములు ,మల్లంపల్లి సోమశేఖర శర్మ –పొట్లదుర్తి –మాలెపాడు శాసనం ,తల్లావఝల శివ శంకర శాస్త్రి –పదకర్తలు ,అడిదము రామారావు –తెలుగు భాషలోని పదాలు ,వేదుల సత్యనారాయణ శాస్త్రి –హాస్యము ,కాంక్ష ,శ్రీపాద కామేశ్వరరావు –ఆంధ్ర నాటకములో వాడదగిన భాష ,కుందూరి ఈశ్వర దత్తు –ముద్రాక్షర శాల –గ్రామ్య భాషాభి వృద్ధి ,లక్ష్మీ ,శారద లు –అభినందనము,జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి –శ్రీరామ మూర్తికి తొలి జోహారు ,భమిడిపాటి కామేశ్వరరావు –అన్నీ తగాదాలే , –శెట్టి లక్ష్మీ నరసింహం –ప్రశంస ,తెలికి చెర్ల వెంకట రత్నం –మాతృభాష –పరభాష .

ఇందరు ప్రాతస్మరణీయులైన మహాను భావులైన రచయితలూ కవులు పరిశోధకులు విమర్శకులు ,భాషా శాస్త్రవేత్తలు తమ మేధో మధనంతో సాహిత్య క్షీరాబ్ధిని తరచి అందించిన అమృత రసవాహిని లాంటి వ్యాసాలివి  .370 పేజీల రిసెర్చ్ గ్రంథం .తెలికి చెర్లవెంకట రత్నం ఎంత శ్రమపడి ఆయా రచయితలను ఒప్పించి రాయి౦చాడో ముద్రణకు ఎన్నెన్ని కష్టాలు పడి వెలువరించాడో  అనూహ్యం .ఇంతటి సాహితీ వ్యసన జీవిని మనం అందరం దాదాపు మర్చే పోయాం .వారి కుటుంబం వారు మాత్రమే జ్ఞాపకం ఉంచుకొన్నారు .అదైనా ఆన౦దింప దగిన విషయం .శ్రీ ఆచంట జానకిరాం తన జ్ఞాపకాలు తవ్వుతూ తెలికి చెర్ల సోదరులను బయట పడేయక పొతే మరెప్పుడూ వారు మనకు గుర్తుకు వచ్చే వారుకాదేమో ?నేను మా అబ్బాయి శర్మకు చెప్పటం వాడు అన్నీ తిరగేసి ఆ కుటుంబం  వారిని సంప్రదించి విషయాలు సేకరించటం ,దాన్ని ఆధారంగా మొదటి వ్యాసం రాశాను .ఇది రెండవది .నిన్న రాత్రి వెంకటరత్నం గారి అల్లుడు శ్రీ అన్నవరపు రామారావు గారు నాకు ఫోన్ చేసి కొన్ని విషయాలు చెబుతూ ,వెంకటరత్నం గారి కుమారుడు  డా.సుబ్బారావు గారు ప్రొఫెసర్ గా పనిచేసి రిటైరై ,విశాఖలో ఉన్నారని చెప్పటం ,ఇవాళ ఉదయం మా అబ్బాయి శర్మా ,నేను వారికిఫోన్ చేసి మాట్లాడటం జరిగింది .మొదటి వ్యాసాన్ని మా అబ్బాయి వారికి పంపాడు .నేను వారితో మాట్లాడినప్పుడు రెండో వ్యాసం కూడా ఇవాళ రాస్తున్నాను అదీ పంపిస్తాం .ఇంకా  ఏమైనా వివరాలు ఉంటే తెలియజేస్తే  మూడవ వ్యాసంలో  చేరుస్తాము అన్నాను. సంతోషం అన్నారు .

 ఇంత శ్రమ చేసి తన సంపాదకత్వంలో కూర్చి వ్యాసమాల అనే ‘’వ్యాస సంగ్రహం ‘’లో తెలికి చెర్ల వెంకట రత్నం తాను రాసిన వ్యాసాన్ని చిట్ట చివరలో పెట్టటం ఆయన నిబద్ధతకు వినయానికి నిదర్శనం .ఇప్పుడు ఆ వ్యాసం మనందరికోసం –

మాతృభాష – పరభాష-తెలికి చెర్ల వెంకట రత్నం

శిశువు . పుట్లగా నే, శరీర౦లోని కొన్నికండరములన్యా పారమువల్ల ఏడుస్తాడు, మొదటిదినములలో అయేడ్పు తనకేదయినా కానలెనని తెలియ జేసే ఉద్దేశ్యముతో  కూడుకొనిఉండదు. కాని క్రమముగా  ఆఏడుపు  ఎప్పుడు వినబడ్డ తల్లి  బిడ్డ వద్దకు  పోయి తగిన ఉపచారములు  చేసి  ఆహారము ఇచ్చీ సంరక్షిస్తూ  ఉండడము మనకు తెలుసు.
 అటుపైన ఉద్దేశ్య పూర్వకముగా ఏడ్చి తనపనులు సాధించుకొనుటకు శిశువు ఉపక్రమిస్తాడు . కొన్నాళ్ళకు ఆ యేడ్చుట  లోనివైవిధ్యము గమనించి బిడ్డ ఎందుకు ఏడు స్తున్నాడో తల్లి గ్రహిస్తుంది .  అనగా అప్పటికి ఆయేడ్పు  యొక్క_ స్వరము లో భావ బోధకత్వము  ఇమిడి ఉన్నదన్న మాట.,
   ఆరేడు వారముల ప్రాయము  వచ్చేదాకా బిడ్డకు ఊసులాడుట  రాదు,
ఉసులాడుట భాషా భ్యాసప్రయత్నములోని ద్వితీయావస్థ, ఈసమయములో శిశువు
తన వాగింద్రియమనులను ఉపయోగించడానికి నిరంతరప్రయత్నము చేస్తూవుంటాడు.
 ఆ ప్రయత్నం లో   మొట్టమొదట సాధ్యమయేవి సులభముగా ఉచ్చరింపదగిన ప
బ, మ వర్ణములు, బిడ్డ తల్లివద్ద పాలు తాగేటప్పుడు వానిపెదవులలోని కండరములు
కదలి  వర్ణోచ్చారణమునకు శ క్తిమంతను లవుతవి.కనుక ఓస్ట్య్రములు పలుక గలుగు
తాడు. కఏి క్రమముగా  ఇతర అక్షరములు కూడా ఉచ్చరించడము అలవాటవుతుంది.
  ఈవిధంగా ఏర్పడినవే ఒక విశిష్ట జాతిపదములు . ఇందులో సంయుక్తాక్షరాలు ,ఉచ్చరించే హల్లులు ఉండవు .కొన్ని భాషలలో
 ద్విత్వాక్షరాలు అ కార సహితంగా చాలా మార్లు వస్తాయి .కొన్నిటిలో హలాదులు ఉంటాయి .ఆయా భాషల తత్వాలను బట్టి ఏర్పడే ఇలాంటి స్వల్ప భేదాల విషయం లో  ఈ పద జాలం లో స్వర సామ్యం కనబడుతుంది .

అమ్మ అనే పదాన్ని గురించి తెలుసుకొందాము .నిర్డుష్టంగానే ‘’అమ్మమ్మమ్మ ‘’అని శిశువు ఉచ్చరిస్తూ ,వాగింద్రియాలతో ఉండగా ,శిశువు తనను పిలుస్తున్నాడనుకొని ప్రేమ పూరిత మాటలతో దగ్గరకు వెడుతుంది తల్లి .ఆ శబ్దం ఎప్పుడు ఉచ్చరించినా ఆదుర్దాగా తల్లి వాడి దగ్గరకు పరిగెత్తుకు వెడుతుంది.ఆ శబ్దానికి తల్లిరాకకు ఒక భావ బోధకత్వమును కల్పించు కొంటాడు .పాశ్చాత్య భాషలలోని mama, ma అనే హలాది పదాలు ,ఆల్బేనియన్ భాషలోని amma ,సెమిటిక్ భాష లోని am um. om  పదాలు ఇండో-యూరోపియన్ నుంచి జని౦చినవే .ఇటాలియన్ భాషలోని ‘’babbu ‘’,baba ,సెర్బియన్ భాషలోని baba ,టర్కిక్ భాషా పదాలు ,సెమిటిక్ భాషలోని aba ,abbu abbaa లు పితృశబ్ద బోధకాలే .ఈ అర్ధంలో త వర్ణములు చాలా భాషలలో ఉన్నాయి .సంస్కృతంలో తాత ,నీగ్రో భాషలో tatta ,రష్యన్ భాషలో tat ,వీటి నుంచి ఉత్పన్నమైనదే ఇంగ్లీష్ భాష .అజాదులైన పదాలు కొన్ని భాషలలో ఉన్నాయి .గాధిక్ భాషలోattila ,మాగ్యారు భాషలో atya మొదలైనవి .
అమ్మ అన్న అత్తా అక్క అప్ప మొదలైన బాంధవ్యాలను మాత్రమేగాక శిశువులకు ఆసక్తిగల పేర్లలో కూడాసామ్యం కనబడుతుంది .ఆహారం కావాల్సి వస్తే శిశువు ఆలాపనం చేస్తాడు .అందులో ఆహారం కావాలని నిర్ధారణ చేయలేము .తల్లివచ్చి తనను చూడాలనే కోరిక కూడా ఉంటుంది .భాష నేర్చుకొనే వయసులో బంధువుల మాటలు వింటూ ,కొన్ని మాటల అర్ధం గ్రహిస్తాడు .వాటిని ఉచ్చరించటానికి ప్రయత్నాలు చేస్తూ ,,బాలబాలికలు ఇరుగుపొరుగు వారు మాట్లాడే మాటలు ,వ్యవహారంలో ఉన్నమాటలు నేర్చుకొంటాడు .కొత్తవస్తువులు కొత్తపరిచయాలవలన పిల్లాడి భాష కూడా వృద్ధి పొందుతుంది .ఈ స్థితిలో శిశు భాషాపదాలు వ్యవహార చ్యుతాలై ,లౌకిక భాషా పదాలు ఆక్రమి౦చు కోవటం జరుగుతుంది .కొందరిలో ఈ శిశు భాషాపదాలు చాలా ఏళ్ళు నిలిచి ఉండి,ప్రయోగించినపుడు తోడివారు పరిహసిస్తారుఅని తెలిసినా వాడిలో అవి నాటుకొనే ఉంటాయి .

  లౌకిక భాష నేర్చుకొంటూ పిల్లాడు చాలా తప్పులు చేస్తూ ఉంటాడు .ఉచ్చారణ సరిగా ఉండదు .అజ్ఞానం కు బదులు అగ్నానం అంటాడు .క్రమంగా తప్పులు తెలుసుకొని నిర్దుష్టంగా పలుకుతాడు .ద్విత్వాలు నేర్చుకోవటానికి చాలా కష్టపడతాడు .నేర్చుకోగానే సంతోషంతో ఎగిరి గంతేస్తాడు .పదాలు నేర్చుకోవటం ఎక్కువ కష్టం అవుతుంది .’’నాన్న అని పలికే టప్పుడు తల్లి తండ్రిని వేలితో చూపిస్తుంది –‘’నాన్న ఏరీ నాన్న ఏరీ ‘’అని అడుగుతుంది .క్రమంగా వాడుకూడా తండ్రి వైపు చూస్తూ అర్ధం గ్రహిస్తాడు .’’ఏడుపు మానేస్తే ఖర్జూర పండుపెదతా ‘’అని తల్లి అంటే,ఆపడం వాడిమనసులోచాలాకాలం నిలిచిపోయి ఆవుతోక కు కుచ్చుకు అన్నిటికీ దాన్నే ప్రయోగిస్తాడు .పదాలకన్నిటికిఉన్న అర్ధభేదం వాడికి చాలాకాలానికి కానీ తెలియదు

  ఇవన్నీ తెలిసి పర భాష నేర్చుకొనేటప్పుడు పిల్లవాడికి ఎవరూ బోధించరు .సందర్భాన్ని బట్టి అర్ధం వివరించే వారుండరు .అమెరికాలో ఒక పిల్లాడికి పదవ నెలలో మూడు పదకొందవనెలలో 12,పన్నెండులో ఇరవైనాలుగు ,పదమూడులో నలభైఎనిమిది ,పదహారులో నూట తొంభై  తొమ్మిదినేర్చుకోవాలి ఆరవ ఏడు వచ్చేప్పటికి ఎన్ని రావాలో వాటిని అన్నిటిని ఇంట్లోవారు అందరూ ఉచ్చరిస్తారు  .ఇలా వాడు మాట్లాడటానికి మాటలన్నీ వాడికి ఉపయోగ పడేట్లు చేస్తారు .వాడికి 2688 మాటలు వచ్చాయి అందులో సర్వనామాలు లేవు .షేక్స్ పియర్ తన పద్య నాటకాలలో ఉపయోగించినవి 20,000 పదాలున్నాయి .మిల్టన్ ఎనిమిది వేలే వాడాడు .

కనుక మాతృ భాష శైశవం నుంచీ నేర్చుకొంటూ ,కొత్తవిషయాలు కల్పిస్తూ భావం వ్యక్తం చేయటానికి తగిన భాష అలవడుతుంది .ఎంత శ్రద్ధతో పరభాష అభ్యసించినా ,ప్రాబల్యం –ఇన్ఫ్లుయన్స్ కొద్దిగానైనా లేకుండా పోదు .గాంధీ ఆంగ్ల దొరలకంటే గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడుతారని వాళ్ళే మెచ్చుకొన్నారు .వారు చేసిన కొన్ని ప్రయోగాలు సంప్రదాయానికి వ్యతిరేకంగా ఉన్నా ,అవి భాషల ప్రాబల్యం మే కారణమని అందులో నిష్ణాతుడు రైటానరబుల్ శ్రీనివాస శాస్త్రి నిరూపించాడు .మాతృభాష ప్రజా వ్యవహారం నుంచి నేర్చుకోనేదే ,పరభాషకు అధ్యాపకులుకావాలి .ఎన్ని సౌకర్యాలున్నా అది సమగ్రంగా అలవడదు .అపండితుడు కూడా మాతృభాష చక్కగా ఉచ్చరిస్తాడు .ఎంతటి పండితుడైనా మాతృభాషను ఉచ్చరించి నట్లు పరభాష ఉచ్చరించలేడు.’’మాతృ భాషలో నువ్వు చేసినంత ప్రయోగాలు ఎవరూ చేయరు .పరభాషలో నువ్వు చేసేవన్నీ ప్రయోగాలే ‘’

  ఇంతటి భాషా విజ్ఞానం ,దాన్ని అందరికి అర్ధమయేట్లు చెప్పగల నేర్పు ఉన్నవాడు తెలికి చెర్ల వెంకట రత్నం .

 ‘’ప్రతిభ ‘’  పత్రికకు సంపాదకత్వం వహించి తెలికిచెర్ల రాజమండ్రి నుంచి వెలువరించాడు .అందులో నవ్య సాహిత్యం ఆశయాలను ఇలా చెప్పాడు-నవ్య సాహిత్య రచనలు చేయటం,ఆసాహిత్య౦ లోని నిబాగోగులు విమర్శించటం ,నవ్య వాగ్మయం గురించి ఉన్న అపోహలు తొలగించటం ,నవ్యసాహిత్య వ్యాపనం కోసం ప్రచార౦ చేయటం ,వ్యవహారిక భాషలో వచన వాగ్మయం ,పద్య వాగ్మయం సృష్టించి ప్రజలకు అర్ధమయెట్లు చేసి విజ్ఞాన వ్యాప్తికి తోడ్పడటం .ఆంధ్ర భాషా ప్రతిభ ను ఈ ప్రతిభ పత్రిక వెల్లడిస్తుంది .సంవత్సర చందా రెండు రూపాయలు .విడి ప్రతి ఎనిమిది అణాలు .

తెలిక చెర్ల వెంకట రత్నం గారి గురించి తెలియజేసే అదృష్టం నాకు దక్కినందుకు మహదానందంగా ఉంది.వారి కుటుంబ సభ్యులు ఇంకా ఏవైనా వివరాలు పంపిస్తే వాటిని చేర్చి మూడవ వ్యాసం రాస్తాను .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-8-23-ఉయ్యూరు      

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.