రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -52

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -52

 శ్రీనివాస శాస్త్రి రెండవ సారి వైస్ చాన్సలర్ అయినప్పుడు విద్యార్ధుల అమ్మే వలన ఆటంకం కలిగింది .ఇద్దరు విద్యార్ధుల మధ్య స్పర్ధ చిలికి చిలికి గాలి వానై ,మధ్యలో అసాంఘిక శక్తులు ప్రవేశించటంతో తీవ్రమైంది .ఈపుస్తకరచయిత అప్పడు అక్కడ లెక్చరర్ .అవిశ్వాసం దావానలమై ప్రాకిపోయింది ,శాస్త్రి బహు చాకచక్యంతో సమర్ధతత తొ సానుకూల్యం చేసినా మధ్యమధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి .మర్యాదగా ఉండదని పోలీసులు జోక్యం కల్పించుకోలేదు .తీవ్రమైన చర్య తీసుకోనందుకు అందరు శాస్త్రిని నిందించారు .అప్పటి మద్రాస్ ముఖ్యమంత్రి రాజాజీ తిరుగుబాటు విద్యార్దులన్దర్నీ క్షమించమని సలహా ఇచ్చాడు –‘’The the risk of being deceived ‘’అన్నాడు కూడా .పిల్లలపై  నమ్మకం సానుభూతి ఉన్నా శాస్త్రి యూని వర్సిటి ప్రశాంతతకు తరచుగా విఘాతం కలిగింస్తూ  దోషులని గుర్తింపు పొందిన  విద్యార్ధులణు  ఉదాసీనంగా వదిలి పెట్టాలని లెదు .రాజగోపాలా చారికి ఉత్తరం రాస్తూ –‘’అధిక సంఖ్యాక విద్యార్ధులు ఎంతో సహనంగా ఉంటే వారి తలిదండ్రులు ప్రశాంతతకు సహకరిస్తుంటే ,దోషుల్ని సస్పెండ్ చేస్తే నేను ,అలాంటి అసలైన దోషులకు మళ్ళీ అడ్మిషన్ ఇస్తే ,వారి జులాయి తనం పెరిగి ప్రమాదకరంగా మారిపోతారు .యూనివర్సిటి పాలన విషయం ప్రజలు అర్ధం చేసుకోలేరు ,ఇప్పటికే దెబ్బ తిన్న విద్యశాల గౌరవం పూర్తిగా ముక్కలు చెక్కలౌతుంది –‘’The policy of un reserved generosity would be proper if my personal interests were alone at stake .I am responsible for a large institution which is not my private property ..ఆ విద్యార్ధులను  నమ్ముతాను అంటున్నారుమీరు ,నేను నమ్మను నమ్మలేను . వాళ్ళ సంగతి నాకు పూర్తిగా తెలుసు .మీకు బొత్తిగా తెలియదు .వాళ్ళ అవిధేయత వలన నేను చాలా ఇబ్బంది పడ్డాను .మీరు పడలేదు .యూని వర్సిటి విషయంలో వారి భవిష్యత్ దృక్పధం నాకు తెలుసు .మీకు అస్సలు తెలియదు .’’ఈ సారి తప్పు క్షమించి మళ్ళీ చేస్తే తీవ్ర చర్య తీసుకోండి ‘అన్నారుమీరు .అలాగే చేశానను కొండి పబ్లిక్ కి యేమని సమాధానం చెప్పగలను ?నా నిర్ణయం కంటే న్యాయం కంటే ఇతరులను మెప్పించటానికి నేను లేనిక్కడ .సంక్లిష్ట సమయంలో నేను చేసిన జడ్జిమెంట్ ను వదిలేసి లొంగిపోతే పబ్లిక్ నన్ను ఎంత నీచంగా చూస్తారో అర్ధం చేసుకోండి .నైతికత కోల్పోయి చదువుల తల్లి ఆలయమైన  ఈ విశ్వ విద్యాలయం లో విద్యా వ్యవస్థ కుంటుపడితే బాధ్యత అంతా నాదే అవుతుంది ‘’అని నిర్మొహమాటంగా నిష్కర్షగా రాశాడు శాస్త్రి ముఖ్యమంత్రి రాజాజీకి .

  శాస్త్రి స్నేహితులు హితైషులు ఈ వ్యవహారాన్ని మహాత్మునికి తెలియజేయమని ఒత్తిడి చేసినా దీన్ని అంత హై సర్కిల్స్ వద్దకు తీసుకు వెళ్లటం వివేకం కాదన్నాడు శాస్స్త్రి .స్ట్రైక్ జరగటం శాస్త్రి శారీరకంగా మానసికంగా కు౦గి పోవటం గాంధీకి తెలిసి వెంటనే సమ్మే మాని –‘’Show obedience to Sastri ‘’అని టెలిగ్రాం ఇచ్చాడు విద్యార్ధులకు .మరో టెలిగ్రాం లో శాస్త్రికి ‘’My heart goes out to you .I pity the students who have been un worthy of your great stewardship ‘’అన్నాడు దీనికి సమాధానంగా శాస్స్త్రి వెంటనే కృతజ్ఞతతో స్పందిస్తూ ‘’Magnanimity  is the name of Gandhi ‘’అన్నాడు .కానీ గాంధిగారి మాటలు విద్యార్ధుల చెవికి ఎక్కలేదు. చివరికి రాజాజీ  యే ఆ రెబెల్ స్టూదెంట్స్ కు  స్ట్రై క్ మానేయమని సలహా ఇవ్వటంతో  సమ్మె ఆగిపోయింది .తక్కువ మందిపై అతి తక్కువ పనిష్ మెంట్ తొ సమ్మె పూర్తయినందుకు శాస్త్రి చాలా సంతోషించాడు .

  సశేషం

మీ –గబ్బిట డుర్గాప్రసాద్ -3-8-23-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.