శ్రీ వెంపటి నాగభూషణం -2
మగ వారికి చేతకాదని ,దోషాపవాదన లేశం కూడా కాదు .ఎంత ఊహించి కథా దృశ్యం చిత్రించినా మగవాడు దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్ట నీడు-చీకటి తప్పు కనుక .పింగళి సూరన్న స్వతంత్రి౦చినాడనుకొన్నా ,సుగాత్రి చేత ఇద్దురు బ్రతిమిలాడించ దానికి నాయికా నాయకులను ,వైదిక దంపతులను ఊరవతల చెట్ల చాటున తోటలో దాచి వేయక తప్పినది కాదు .పోనీ కవి ఇంతకన్నా కొంచెం విజ్రు౦భి౦చినా ,నాయికా సాలభంజిక ఊహాగాన లయను ఊగాల్సిందే కాని ,అకృత్రిమ చైతన్య స్పందిత కాదు .విద్యానాధుడు అంతటి ఆలంకారికుడు ఆడువారి సుఖానందం అనుగాటంగా ప్రత్యక్షీకరించ టానికి భార్యను బ్రతిమాలి సెక్స్ మార్చుకొన్నాడని కళాపూర్ణుని జనన వార్తకు పూర్వ రంగ ప్రమాణం.
కవి సార్వ భౌమునితో కన్నెతనపు మురిపాలలో ప్రౌఢరికం చలాయించి ,దేశాలు తిరిగి ‘’కన్నడ రాజ్య రమా రమణుని ‘’రసిక జీవనం ధన్యం చేసిన తెలుగు వాణికి తాళికోటలో నిలువ నీడ లేక తరిగిపోయింది .అష్టదిగ్గజాధి రూఢోత్సవ వైభవము కలలలో మలగిపోయినా ,మధుర తంజావూరు సామంత నాయకులు కావ్య కన్యకా జీవన సంధ్యకు అరిగాపులై నిలిచారు .వయసు జిగివి పోయిన ,,ఆమె అలవాటు చొప్పున ఎద నెడ వి౦త కైసేట్లు మానలేదు .ఆ తళుకులే నవ్య సారస్వతానికి ,రచనా లాలిత్యానికి ఊతలై నిలిచిణ కావ్య చిత్ర శోభలు .
భోసల తుళ జెంద్రునికుమారుడు ప్రతాప సింహుడు ,.తుళువ రాజు వెనకటి వారు కృష్ణ దేవరాయలు నమ్మిన మరాటా సామంత వీరులు .ముసల్మాను ఒత్తిడిని లక్ష్యం చేయకుండా వీలుచూసుకొని స్వతంత్ర ఆధిపత్యం సంపాదించుకొన్న రాహూతులు .భాషకు సంప్రదాయానికి కేవలం పరాయి వాళ్ళైనా ,ఏలిక అభి రుచులను మరగిన భాగ్యాన తెలుగు కవిత్వాన్ని కవులను ఆదరించి గ్రంథ రచన ప్రోత్సహించారు .రఘునాథుడు విజయరాఘవుడు అటు ,తిరుమల నాయకుడు చొక్క నాథుడు ఇటు లేకపోతె తెలుగు తల్లిని ప్రేమతో పూజార్హంగా చేసుకోకపోతే రంగాజీ లాంటి దివ్యతారలు మెరసిపోకపోతే ఎంత అంథయుగం వాజ్మయ చరిత్రలో ?వెలుగు ఈనాటికైనా కోలుకోనేదా ? , ,
రసిక ప్రభువు ప్రతాప సింహుడు 1749నుంచి 16ఏళ్ళు పాలన చేశాడు .ఈయనకొడుకు పితామహుని పేరున్న వాడు .భరతశాస్త్ర నిది .సంగీతం అతని సొమ్ము .రూప మన్మధుడు .మరొక రసిక శిఖామణి ప్రతాప సింహుడు అమరేంద్రుని కుమారుడు .ప్రతాపుడు వైష్ణవుడు తండ్రినాటి నుంచి కులగురువు తిరుమల తాతాచార్యుడు బ్రహ్మ విద్యా నిది .చోళసి౦హాసనాధ్యక్షుడైన ఆ మహారాజు వలపు నేస్తమే ముద్దు పళని .పలణి వేలాయుదుడైన కుమారస్వామి దివ్య క్షేత్రం .ముత్తు, ముద్దు పేర్లు తమ ముద్దు చెల్లించే కన్నపాపలకు ద్రావిడులు పెట్టుకొనే నామ పూర్వ పదం .’’చాలా చోట్ల బిడ్డలకు దేవస్తలముల పెరులేపెట్టటం వాడుకగా ఉన్నది ‘’అని నిత్య సువాసిని ,మహాగాయని బెంగుళూరు నాగరత్నం గ్రంధస్థం చేసింది .
ముద్దుపళని తండ్రి ముత్యాలు .నాల్గవ జాతికి చెందిన అనుష్టాన వైష్ణవ గృహస్థు .అసలుఅవ్వయ్యకు ఒక కొడుకు ఒక కూతురు .ముత్యాలు తన్జనాయకి పేర్లు. తల్లి చెంగావి .ముత్యాలకంటే భార్య ముందు చనిపోవటమో , పిల్లల్ని సాకలేక పోయాడో ,లేక చిన్నతనంలోనే తలిదండ్రులు కరవౌటవలననో తన్జనాయకి అనే వేశ్య ముత్యాలు ,అతడి తోబుట్టువును పెంచింది .చిన్న తన్జనాయకి కుల వృత్తిలో దిగింది .ఆమె కూతురు రామామణితన పేర ఒక అగ్రహారం నిర్మించి ,అనేక సత్కార్యాలతో సంపాదనకు సార్ధకత కల్గించింది .ముత్యాలు’’ పోటి ‘’అనే భార్యతో నలుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళను కన్నాడు .ముద్దుపళని తొలి చూలు .ఇంకో చెల్లి ముద్దు లక్ష్మి .చివరిది పద్మావతి .వీళ్ళిద్దరూ అక్కతోసమానమైన జాణలే .వారిని యే మహారాజు ఆదరించాడో వివరం తెలియదు .
ముద్దుపళని పేరు మరాటా బాణీ లో ఉందని బ్రౌను ముత్యాలు వంశం తెలుగు నాటది కాదు అన్నాడు పొరబాటు పడి .అచ్చతెలుగు కుటుంబమే .దేశం అలజడి కాలం లో తమిళనాడు తరలి పోయి ఉండవచ్చు .వైష్ణవ వేషంతో ద్రవిడనామం తీసుకొని ఉండచ్చు .చెల్లెళ్ళ ఇద్దరిపేర్లు అరవ కల్తీ లేని లక్ష్మీ ,పద్మావతి అనే సంస్కృత పేర్లే పెట్టాడు తండ్రి .ముత్యాలు ఎక్కువకాలం తమిళ దేశంలో ఉండటం వలన సగం ద్రావిడుడైన ఆంధ్రుడే కానీ మహారాస్త్రియన్ కాదు .
వెంపటి నాగభూషనం గారు ఎంత చరిత్ర త్రవ్వి రాశారో ఎంత సాహితీ చర్చ చేశారో వారి పాండిత్యం ఏమిటో అర్ధమౌతుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-8-23-ఉయ్యూరు

