రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -53
అన్నామలై లో తిరుగు బాటు దార్లులైన విద్యార్ధులలో ఒకతను శాస్త్రి ముఖ్య స్నేహితుని కొడుకే .సౌతాఫ్రికాకు చెందిన శ్రీమతి నాయుడు ,శాస్త్రి ఇక్కడ విసి అని ఆకుర్రాడిని ఇక్కడ చేర్చింది .ఇది కొంత అడ్వాంటేజ్ గా తీసుకొని ఆకుర్రాడు గోపాలన్ చెడు సావాలకు చేరువై ఇబ్బంది కలిగించాడు .నాయుడు దంపతులు దక్షిణాఫ్రికాలో గాంధీ సహాయ నిరాకరణలో పాల్గొన్నారు అందుకని ఆమె తనకోడుక్కి ఫేవర్ చేయమని గాంధీని కోరింది .రాజకుమారి అమృత కౌర్ కూడా ఆమెకొడుకు పట్ల కాస్త దయగా ఉండమని శాస్త్రికి రాసింది .నాయుడు దంపతుల కోరిక తీర్చటం అసాధ్యమని శాస్త్రి వెంటనే ఉత్తరం రాస్తూ –‘’శ్రీమతినాయుడు నాకు మరో లెటర్ కు బదులుగా గోపాలన్ చివరి తెగతెంపులు విషయం రాశాను .అతడు చెప్పే, బయటికి ప్రవర్తించే తీరుకు పూర్తీ విరుద్ధం .ఈఎపిసోడ్ చివరిదాకా ఆ రెబెల్స్ తమ తలి దండ్రులతో నేను మాట్లాడటానికి వ్యతిరేకించారు .అనేక భయాలు ఊహలతో తమదే రైట్ అని పేరెంట్స్ కు కాకమ్మ కబుర్లు చెప్పి నమ్మించారు .మేముకూడా ఈప్రాపగాండ కు కౌంటర్ర్ ప్రాపగాండా చేయాల్సి వచ్చింది .మేమంతా పేరెంట్స్ మంచి తనం పైనే వ్యవహరించాం .కాని వాళ్ళు వాళ్ళ పిల్లలు చెప్పిందే పూర్తిగా నమ్మారు ..కొందరు కాంగ్రెస్ శాసన సభ్యులు కూడా మత పరమైన అసూయతో స్టూడెంట్స్ కొమ్ముకాసి మాకు వ్యతిరేకంయ్యారు .మహాత్ముని మధ్య వర్తిత్వం వారిలో భయం కలిగించింది .కానీ దాని ప్రభావం తాత్కాలికమే అయింది .తప్పుడు అపవాదాలే ప్రాముఖ్యత వహించాయి .-I am ashamed to say and I was by no means exempt ..’’రాజాజీ మావెంట కొండ౦త ధైర్యంతో నిలబడ్డాడు .’’He thought and thinks I might have been thorough in my generosity ,and not excluded any one from clemency .With no desire I say it after rigorous self examination to be vindictive ,I could not go so far ‘’అన్నాడు
గోపాలన్ సిలోన్ నుంచి శాస్త్రికి జాబు రాస్తూ అక్కడ మళ్ళీ చదువుపై దృష్టిపెట్టానని తెలియజేస్తే దానికి సమాధానంగా శాస్త్రి అత్యంత హుందాగా జవాబిచ్చాడు –‘’నువ్వు మీ అమ్మగారి సమక్షంలో అప్పుడు ఇక్కడ జరిగిన విషయాలన్నీ జ్ఞాపకం తెచ్చుకొంటే ,నీ జీవితవిదానమే గణనీయంగా మారిపోయి ఆనాడు నీ వెంట ఉన్నవారి ప్రవర్తన ఎంత తేడాగా ఉందొ అర్ధమౌతుంది .మార్పు వలన కొందరిలో లాభం కొందరిలో నష్టం జరగవచ్చు ‘’Circumstances make sport of us and none is fully master of thoughts and deeds .We the best ,no less than the worst need mercy and charity ‘’.మీ అమ్మగారికి శుభా కాంక్షలు తెలియజేయి .నేను ఆమెకోరినట్లు నీపట్ల ఉదారంగా వ్యవహరించక ఆమె బాధలను పెంచినందుకు ,తప్పని సరి పరిస్తితుల్లోఅలా చేసిందుకు అర్ధం చేసుకోమని చెప్పు .భవిష్యత్తు మీ ఉభయులకూ శుభం చేకూర్చుగాక ‘’అని తనపవిత్ర హృదయాన్ని ఆవిష్కరించాడు శాస్త్రి .
వయసు వలన ఏర్పడిన శారీరక బలహీనలతల వలన శక్తిచాలక రైటానరబుల్ శ్రీనివాస శాస్త్రి అన్నామలై యూని వర్సిటి వైస్ చాన్సలర్ పదవికి1940మార్చిలో రెండవ టరమ్ పూర్తికాగానే రాజీనామా చేశాడు .విద్యార్ధుల సమ్మె తాలూకు బాధ దిగులు లేకుండా ప్రశాంతంగా ఆ యూని వర్సిటి వదిలి వచ్చాడు .
చివరి రోజులు
1935ఆగస్ట్ లో బ్రిటీష పార్లమెంట్ భారత రాజ్యాంగంలో పొందుపరచిన సేఫ్ గార్డ్స్ విషయాలను పాస్ చేసినందుకు నచ్చక నిరాశ చెందాడు .రాజ్యాంగానికి దోహద పడేట్లుగా ఎన్నికలలో నిలబడి పదవులు పొందటానికి,అవసరమైన సంస్కరణలు రూపొందించటానికి కాంగ్రెస్ ఒప్పుకోనందుకూ వ్యధ చెందాడు .For, Sastri had always the firm belief that it was a suicidal policy for the best men and women of a nation to stand aside from the government and to refuse to practice administration which is the one of the greatest arts. కాంగ్రెస్ చాలాకాలం కీకారణ్యంలో చిక్కుకు పోయిందని బాధ పడ్డాడు .ఎన్నికలలో నిలబడి దేశ భవితవ్యాన్ని తమ చేతులతో నిర్మించుకొనే గొప్ప సదవకాశాన్ని కాంగ్రెస్ చేజేతులా నాశనం చేసుకొన్నది ఆలస్యం ప్రమాదకరం అని గుర్తి౦చ లేదు పార్టి .బిల్లు పాస్ చేసినా బాధ్యతాయుతం కేంద్ర ప్రభుత్వాన్ని ఇవ్వలేకపోయారు .మహారాజుల ఆల్ ఇండియా ఫెడరేషన్ చల్లబడి పోయింది .కాంగ్రెస్ కూడా కొత్త రిఫారం తిరస్కరించి భారత రాజ్యంగ నిర్మాణం కోసం రాజ్యాంగ అసెంబ్లీని ఏర్పాటు చేయమని కోరింది .
బ్రిటిష్ ఇండియాలో లో ఎన్నికలు 1937లో జరిగాక వివిధ రాష్ట్రాల శాసన సభలతో కొత్త అధ్యాయం ప్రారంభమైంది .కాంగ్రెస్ చాలా రాష్ట్రాలలో ఎక్కువ స్థానాలు గెలిచింది.కానీ గవర్నర్లు మంత్రివర్గం మాటను తప్పక పాటించాలని ,పాలనలో అనవసర జోక్యం కల్పింసుకోరు అని వైస్రాయ్ అభయం ఇవ్వక పొతే తాము పదవులు స్వీకరించం అన్నారు .కాంగ్రెస్ వారు మంత్రివర్గాలు ఎర్పాటు చేయని రాష్ట్రాలలో మిగిలిన పార్టీలు ఏర్పాటు చేశాయి .మద్రాస్ లో శ్రీనివాస శాస్త్రిని మధ్య౦తర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమనికోరితే తిరస్కరించాడు .కానీ పరిస్థితులు మారి కాంగ్రెస్ ఆరు రాష్ట్రాల్లో మంత్రివర్గాలు ఏర్పాటు చేసింది .తర్వాత వైస్రాయి ప్రభుత్వాల పనిలో గవర్నర్లు నిత్యం జోక్యం కలిగించుకోరు అనీ మంత్రివర్గం మాటను విశ్వాసంలోకి తీసుకొంటారని అస్యూరెన్స్ ఇచ్చాడు .శాస్త్రి కాంగ్రెస్ మంత్రివర్గాలను హృదయపూర్వకంగా అభినదిస్తే లిబరల్స్ ఆశ్చర్యపోయారు ,మద్రాస్ సి ఏమ్.రాజాజీ మంత్రులకు మోడెస్ట్ అంటే నిరాడంబర జీతాలను ప్రకటించగా శాస్త్రి వారి త్యాగాలను శ్లాఘించి రాజాజిని ‘’As a timid and humble fresh man from the University of self denial as compared with the Congress ministers who had taken the Doctorate degree ‘’అన్నాడు వ్యంగ్యంగా .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-8-23-ఉయ్యూరు

