రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -54
లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నత సభకు రైటానరబుల్ శ్రీనివాస శాస్త్రి నామినేట్ అయ్యాడు .సహజంగా ప్రతిపక్ష నాయకుడు అవటంతో ప్రభుత్వాన్ని వీలైనప్పుడల్లాతప్పులు చూపి కడిగి పారేసే వాడు .భారత దేశం లో ప్రజాస్వామ్య వ్యవస్థకు కాంగ్రెస్ మూల స్థానం కావా;లని శాస్త్రి ఆశయం .కాంగ్రెస్ హైకమాండ్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాల రోజు వారీ కార్యక్రమాలో వేలు పెడుతూ ఉండటం నచ్చక విమర్శించాడు .ఇంకా శైశవ దశలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలను నిర్దాక్షిణ్యం గానే విమర్శించేవాడు .శాసన సభలో బయట వేదికాలపైనా ప్రజలను తమ స్వేచ్చ ననుసరించి ,ఆలోచించి వోటు వినియోగించమని పదేపడదే చెప్పేవాడు.ప్రతిపక్షాల మాట విబాలని చెప్పి , వాటిపై తక్షణ చార్యాలు ప్రభుత్వాలు తీసుకోవాలని హెచ్చరించాడు .ఒక సారి మహమ్మద్ ఉస్మాన్ ఖాన్ భారీ శరీరాన్ని చూసి అయినా ఆయనకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి అన్నప్పుడు సభ అంతా చప్పట్లతో నవ్వులతో మారుమోగిపోయింది .మద్య నిషేధం పై రాజాజీ కున్న పట్టుదలపై శాస్త్రి సానుభూతి చూపాడు .మొదట్లో కొన్ని ఎంపిక చేసిన చోట్ల నిషేధం అమలు జరిపి చూడటం మంచిది అన్నాడు .నిషేద్ధం పై రెండో అభిప్రాయం లేనేలేదని గట్టిగా సమర్ధించాడు .బేసిక్ ఎడ్యుకేషన్ ,హిందీ విషయాలను జాగ్రత్తగా ఆలోచించి ప్రవేశ పెట్టాలి అన్నాడు .మదురై దేవాలయంలో ముందుగా హరిజనులకు ప్రవేశం కల్పించి తర్వాత సభలో ఆనాటినుంచే వర్తి౦చేట్లు చట్టాన్ని ఆమోది౦చటాన్ని తప్పుపట్టాడు శాస్త్రి .వయసు మీద పడిపోతున్నా శాస్త్రి లెజిస్లేటివ్ కౌన్సిల్ చర్చలలో చాలాచురుకైన పాత్ర పోషించి తనకున్న విశేష అనుభవాన్ని ప్రదర్శించి మన్ననలు పొందాడు –sastri added the Council the distinction of his illustrious personality,rich experience and wise counsel ‘’.
యూరప్ పై యుద్ధమేఘాలు 1938లో కమ్మేశాయి .బ్రిటన్ ఫ్రాన్స్ లు జర్మనితో సంఘర్షణ వద్దని విశ్వ ప్రయత్నం చేశాయి .హిట్లర్ గొంతెమ్మ కోరికలు తీర్చాయి .చాంబర్లేన్ ,హాలీ ఫాక్స్ లు నాజీలను బుజ్జగించారు .హిట్లర్ జేకోస్లో వేకియా ముట్టడితో ,స్వతంత్ర దేశం లో ధైర్యవంతులు దాదాపుగా అంతరించిపోయే పరిస్థితి వచ్చింది .శాస్త్రి ఆవేదన అంతులేని అయింది .కానీ చేమ్బర్లేన్ ద్వయం తీసుకొన్న నిర్ణయాలలో న్యాయం ,తెలివి ఉన్నాయి అనుకొన్నాడు .4-10-1938 రాసిన ఉత్తరంలో శాస్త్రి –‘’ప్రపంచం పిచ్చిదైపోయింది .ఇవాళ ఉన్నంతగా నేను ఎన్నడూ కలవర పడలేదు .నాకు శాంతికావాలా ?యుద్ధం కావాలా ?ఎందుకు నేను సంతృప్తి చెందలేకపోతున్నాను ?కారణం జెకోస్లోవేకియా అంతరించి పోయింది .హిట్లర్ భూతం ఆవహించిన ప్రపంచంలో అధర్మం లేని శాంతి సాధ్యమా ?అలాచేస్తే నేను ఫూల్ అవుతాను .హలిఫాల్స్ ‘’Peace is at this juncture greater to the world than justice ‘’అన్నమాటను ఇష్టపడను .శాంతి చాలా ప్రత్యక్షమైనది .కనీసం దాని నెగటివ్ విషయం లోనైనా న్యాయం కంటే ఎక్కువైనది ,గుర్తిమ్పదగినదికూడా .’’Who would sacrifice a clear tangible end for a mere abstraction which means different things to different nations and different individuals ?ఇలాంటి శాంతి ఎక్కువకాలం నిలవదు .కొందరు అడగవచ్చు ‘’ఎప్పుడో పోరాటం చేయటం కంటే ,ఇప్పుడే ఎందుకు చేయకూడదు?’’It may be better now than tomorrow ‘’దీనికి సమాధానం చనిపోతున్న పేషెంట్ కు డాక్టర్ కు చెప్పినట్లు ఉంటుంది .’ఎలాగో నాలుగు రోజుల్లో పోతావుగా ఇప్పుడే ఎందుకు పోవు ?’’అన్నట్లు ఉంది.దీవుని చర్యలు అంతు చిక్కనివి .ఏదీ ఖచ్చితంగా చెప్పలేం .మనకు సమయం దొరుకుతున్దేమొఎవరికి తెల్సు ?మానవ జాతి తన పద్ధతిమార్చు కొంటు౦దేమో ?The nations may learn the wisdom of peace ,and all quarrels will yield to reason ‘’అంటూ తన మనో వ్యధను వ్యక్తం చేశాడుశాస్త్రి .
హిట్లర్ పోలాండ్ పై దాడి జరపగానే బ్రిటన్ యుద్ధాన్ని ప్రకటించింది .శాసనసభను సంప్రదించకుండా బ్రిటీష ఇండియా ప్రభుత్వం యుద్దంలో పాల్గొనగా సహజంగా కాంగ్రెస్ దానితోపాటు అన్ని ప్రోగ్రెసివ్ పార్టీలు దాన్ని తిరస్కరించాయి .కానీ గాంధీ మాత్రం బ్రిటీష్ ప్రభుత్వం పై ఎల్లలు లేని సానుభూతి ,ఔదార్యం ఒలకబోశాడు. ముందుగా .వైశ్రాయితో మాట్లాడి లండన్ కు,పార్లమెంట్ హౌస్ కు , వెస్ట్ మినిస్టర్ అబ్బే కు జరిగే అపార నష్టాన్ని తాను అంచనా వేయలేను అన్నాడు .చైనాలో ఉన్న నెహ్రు హడావిడిగా వాలిపోయి ఇండియా అన్ని విధాల బ్రిటీష ప్రభుత్వానికి సహాయ సహకారాలను ఈ యుద్ధం లో అందించాలి అన్నాడు . 15-8-1939 న సమావేశామైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటిమాత్రంగాంది వెంట లెదు.గాంధీ స్థితి కష్టంగా ఉంది..సందేహపు ముళ్ళకమ్మపై ఆయన ఉన్నాడు .వెలుగుకోసం సత్యంకోసం వెతుకు తున్నాడు . గాంధీకి ఉన్నా అహింసా సిద్ధాంతంపై శాస్త్రికి విపరీతమైన నమ్మకం ఉంది.వర్కింగ్ కమిటి మీటింగ్ లో ఆయన పాత్ర ఆశ్చర్యం కలిగించింది.బాధించింది కూడా .కొన్ని రోజులతర్వాత మద్రాస్ లో మహాదేవ దేశాయితో శాస్త్రి ఈవిషయం మాట్లాడాడు .ఆయనేదో సర్ది చెప్పే ప్రయత్నం చేస్తే ఓపిక నశి౦చి ఆయన వాడిన ‘’Affectionate vehemence ‘’ప్రభావ వంతమైన వేగం –అనే మాటనచ్చక ‘’మీ గాంధి నా గాందీకంటే తక్కువ .అలా౦టి గాంది నాకు పనికి రాడు.ఆయన తనకున్న ఉన్నత ఆదర్శాలతో ఉండలేకపోతే ఆయన గొంతు ఆయన్నే కోసుకోమను ‘’అన్నాడు ఉద్రేకంగా .తర్వాత గాంధీకి తాపీగా క్షమాపణ చెప్పాడు .వర్కింగ్ కమిటికి కూడా ఒక లెటర్ రాశాడు .అందులో ఏముందో రేపు తెరిచి చూద్దాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-8-23-ఉయ్యూరు .

