రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -55
కంగ్రెస్ వర్కింగ్ కమిటికి ఒక లేఖ పంపుతూ శాస్త్రి –‘’విషయం చాలా లోతుకు పోయింది .అది అక్కడే చిక్కుకుపోయింది .వర్కిగ్ కమిటీ తొ గాంధీకి ఉన్న విభేదమమిటి ?అది నాన్ వయోలెన్స్ కు భ్రస్తత్వం అనుకోన్నారా ?బ్రిటన్ తొ లాభ సాటి బేరాలు ఆడకుండా సహకరించాకూడ దనా ?వర్కింగ్ కమిటి మీటింగ్ కు రాకముందే ఆయన ప్రభుత్వానికి సహకిస్తామన్నారనా ?’’To plead that his cooperation with violence was to be non violent in is a poor defence ? non violent violence beats me .Nehru and working committee would not be content with this aneamic simulacrum of support if Britain complied with their demand and promised India her freedom ‘’. ఆ ఉత్తరం లోనే –యుద్ధం అనే నాటక శాలలో ఇండియా ప్రజలను గాంధీ రొమ్ములు సాచి ,శత్రువుల ఖడ్గ ప్రహరాలను రుచి చూడమని ఉపదేశం ఇస్తాడా ?కొద్ది క్షణాలకిందే నేను ఆయన అలానే అంటాడని ప్రతిజ్ఞ చేశా .నాకు ఇక యే నమ్మకమూ లెదు ‘’అన్నాడు .
1939 సెప్టెంబర్ 30 హరిజన్ పత్రికలో గాంధీ ,శాస్త్రి ఉత్తరాన్ని దేశాయ్ కి రిఫర్ చేశాడు .’’నాకు ఆయనకు ఏరకమైన బౌద్ధిక షరతులు లేవు .ఆయన కోపంతోకాక ఆవేదనతో రాసి ఉంటాడు అలాగ .నేను మళ్ళీ అదే సమాధానం చెబుతా .చెక్ లకు అబిసీనియన్లకూ అలాగే చెప్పాను .నా అహింస దృఢమైన పదార్ధంతో ఉంటుంది .శాస్త్రవేత్తలు కనిపెట్టిన అతి గట్టి లోహం కంటే అది మరింత దృఢమైనది .’’Yes alas ,I am painfully conscious of the fact that it has still not attained its native firmness ‘’అన్నాడు .
1940లో గాంధీ మళ్ళీ అహింస కల్తీ లేని అతి స్వచ్చమైనది అని ప్రవచిస్తే శాస్త్రి చాలా సంతోషించి ఒక జాబురాస్తూ –‘’నైతిక విలువలు అన్ని విలువలకన్నా ఉత్తమమైనవి అనేవారు మిమ్మల్ని చూసి గొప్ప సంతృప్తి చెందుతారు .అది చాలా ప్రశాంతంగా ఆలోచిస్తే మానవ మట్టిలోనుంచి పవిత్ర దేవతా విగ్రహం తాయారు చేయటం వంటిది .అందులో తప్పినా కూడా ఉన్నతకీర్తే లభిస్తుంది .లెక్కల్లో సున్నా అంటే సున్నాయే .మానవ విషయాలలో మాత్రం దీనికి వ్యతిరేకం .అత్యన్తభారీ లావాదీఎలు సున్నతో అంతమవుతాయి ,కానీ వ్యర్ధప్రయత్నాలు కావు .అనుభవం తెలివి రుజువు కాబడిన శక్తి విపరీతమైన లాభాలే ఆ క్షణం లో మనం కొండనుంచి జారిపడే రాయి సిసిఫాస్ గా ఉంటాం .దాన్ని మళ్ళీ అట్టడుగునుంచి పైకేత్తే ప్రయత్నం చేయాలి.-Go on brave soul ,your faith is inextinguishable .It is not of this earth .అంటే మీది దైవ చిత్తం ‘’అన్నాడు శాస్త్రి రెండు చేతులు జోడిస్తూ .’’గాంధీని అసలైన రాజకీయ వేత్త అన్నాడు .ఆయనలో ఒక రుషిని దర్శిస్తున్నానీ ,అందులో ధైర్యం సత్యంతో ప్రయోగం చూస్తున్నాడనీ .అ సత్యం అత్యద్భుత విజాయాలుసాది౦చిదని .అందుకే ఆయన నాన్ కొ ఆపరేషన్ సిద్ధాంతంలో కల్తీలేని స్వచ్చత దర్శించానని పొంగిపోయాడు .’’I place you alongside the philosophers and ethicists of fame .మాలాంటి వారికి వారసత్వంగా కొన్ని మంచి లక్షణాలు అబ్బి ఉంటాయి ‘’T0 see you descend on occasions from the heights ,I feel bereft (నశించిన ) of my natural garment ,disrobed of my national pride ‘’అని అత్యత వినయంగా,ఉత్క్రుష్టంగా మహాత్ముని గొప్పతనాన్ని శాస్త్రి ఆవిష్కరించాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-23 –ఉయ్యూరు
