శబ్దార్ధ కల్పతరువు ఇక అందరి చేతుల్లో
మాన్యశ్రీ మామిడి వెంకటార్య రచించిన శబ్దార్ధ కల్పతరువు –సంస్కృత –సంస్కృత –తెలుగు నిఘంటువు కోసం చాలా మంది సాహితీ వేత్తలు గత రెండు మూడేళ్లుగా నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు .నాదగ్గర లేదని చెబుతూనే ఉన్నాను ,నేనూ మ అబ్బాయి శర్మ కూడా తీవ్రంగానే దానికోసం ప్రయత్నించినా ఫలితం కలగలేదు ,సుమారు నెలరోజులక్రితం రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ అధిపతి కూడా ఫోన్ చేస్తే ,లేదని చెప్పి ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం గారిని అడిగి చూడమని చెప్పాను .’’ఆయన నాకు బాగా తెలుసు .అడుగుతాను ‘’అన్నారు .అప్పుడు నేను అది దొరికితే మీరు ప్రింట్ చేయండి దానికి డిమాండ్ చాలా ఉంది నన్ను చాలామంది అడిగారు ‘’అని చెప్పాను .ఆయన ‘’దొరికితే మీరన్నట్లే వెంటనే ప్రింట్ చేస్తాను ‘’అన్నారు .
ఇవాళ మధ్యాహ్నం మోహన్ పబ్లికేషన్ అధినేత నాకు ఫోన్ చేసి ‘’రాజమండ్రిలోనే ఒక డాక్టర్ గారి దగ్గర దొరికింది .దాన్ని డిజిటల్ ప్రింటింగ్ గా 50కాపీలు ప్రచురించాం .రేపే ఆవిష్కరణ . ఈ శుభ వార్తముందు మీకు తెలియజేయాలని సంతోషంతో చెబుతున్నాను ‘’అన్నారు. ‘’చాలా సంతోషం.సాహితీ ప్రియుల కోరిక తీర్చారు ‘’అన్నాను .ఈ విషయం అందరికి తెలియజేయమన్నారు . ఆ ప్రయత్నమే ఇది .మామిడి వారి జీవిత విశేషాలు కూడా ఆయనే పంపారు .దానినే ఇందులో పొందుపరచాను ..
మామిడి వెంకటార్య జీవిత విశేషాలు
మామిడి వెంకటార్యులు తొలి తెలుగు నిఘంటు కర్త. ఈయన ఆంధ్ర దీపిక పేరుతో రాసిన నిఘంటువు తెలుగు భాషా చరిత్రలో ఒక నూతన ఒరవడికి నాందిపలికింది.ఈయన సంస్కృతంలో రచించిన శబ్దార్థ కల్పతరువు మొదటిగా అచ్చయిన సంస్కృత నిఘంటువు.ఈయన “ఆంధ్ర లక్షణం”, “పర్యాయ పదాల రత్నమాల”, “శకట రేఫ లక్షణం”, “విశేష లబ్ద చింతామణి”, ” తెలుగు వ్యాకరణం” వంటి గ్రంథాలను రచించారు. తెలుగు వ్యాకరణంలో దంత్య తాలవ్యాలను వెంకటార్యులే మొదట ప్రవేశపెట్టారు. వేదాలు, ఉపనిషత్తులను అధ్యయనం చేశారు.యాజ్ఞవల్కుని పరాసర సంహితను తెలుగులోకి అనువదించారు.
మామిడి వెంకటార్యులు
ఈయన 1764 మార్చి 16 న బందరు పరాసుపేటలోని విజయలక్ష్మీ, వెంకన్న లకు జన్మించారు.బందరులో దుకాణదారునిగా ఉన్న వెంకటార్యులు ఒక పండితునిగా, తెలుగుభాషా ఉధ్దారకునిగా ప్రశంసలందుకున్నారు. వెంకటార్యులు వ్రాసిన “ఆంధ్ర దీపిక” ప్రతిని ఈస్టు ఇండియా కంపెనీ వారు వెయ్యి వరహాలకు కొనుగోలు చేశారు. వీరి పాండిత్యాన్ని చూసిన విక్టోరియా రాణి బందరు వచ్చినపుడు వీరిని టౌన్ హాలులో “పండిత రాయలు” బిరుదునిచ్చి సత్కరించారు. ఈ టౌను హాలును ఇప్పటికీ విక్టోరియా రాణి హాలుగా పిలుస్తారు. తెలుగు భాషకు వీరు చేసిన సేవకు సి.పి బ్రౌన్ మెచ్చి సువర్ణ కంకణం తొడిగారు. బందరు సాహితీ వేత్తలు ఈయనకు “బాల అమర్” అని బిరుదునిచ్చారు. అమరుడు ఎలా మొదట సంస్కృత నిఘంటువు వ్రాసాడో అలానే ఈయన కూడా బాల్యంలో తెలుగు నిఘంటువు వ్రాయడంలో ఆ బిరుదునిచ్చారు.1965 లో కేంద్ర ప్రభుత్వం వీరి రచనలను అచ్చు వేయడానికి నిధులు కేటాయించింది. వీరి “ఆంధ్ర దీపిక”ను చూసిన అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ దాని ప్రచురణకు నిధులు అందించారు. ఇలా సాహిత్య సేవలోనే కాకుండా భాషా సేవలో బందరుకు పేరు తెచ్చిన ప్రముఖుడీయన.
మొహన్ పబ్లికేషన్స్ –రాజమండ్రి వారి వాట్సాప్ నంబర్ -92478 88887
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-23-ఉయ్యూరు
వీక్షకులు
- 1,107,435 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

