రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -56
పారమార్ధిక స్థాయినుంచి వ్యావహారిక స్థాయికి దూకిన లాఘవంతో శాస్త్రి గాంధీతో రాజకీయ పరిస్థితి చర్చిస్తూ ఉత్తరం రాస్తూ ఇలా అన్నాడు –‘’గట్టి బలం విశ్వాసాలున్న పార్టీ ఇప్పుడే అధికారం పొంది ప్రజలబాగుకోసం ,రక్షణ కోసం కృషికి ఉపక్రమించాలి .స్వతంత్రంతో పాటు అన్ని ఉద్యమాలను వెంటనే ఆపెయ్యాలి .నా అభిప్రాయాలను మీకు రాసే స్వేచ్చతీసుకొని తెలియజేసినందుకు క్షంతవ్యుడిని .ఒక టీచర్ లాప్రవర్తించి అలా రాశానేమో .బాధ్యతారాహిత్య విమర్శకుడిగా ఒక్కో సారి హద్దులు దాటుతూ ఉంటాను .’’Like an irresponsible critic I have alternately found fault and exhorted .Like an anxious son of India I have painted a lurid picture and alarmed you un necessarily .Put down these lapses partly to ignorance and partly over wrought nerves ‘’.అని పశ్చాత్తాపం ప్రకటించాడు .
మహాత్ముని అహింసా వ్రతం పై ఆరాధన ,పట్టుదల చూసి శాస్త్రి మద్రాస్ వార్ కమిటి సభ్యుడిగా చేరి వంద రూపాయలు యుద్ధ నిధికి విరాళం చెల్లించాడు .ప్రారంభోత్సవసభకు వెళ్లాడు కానీ అక్కడ గాంధి ,కాంగ్రెస్ వ్యతిరేక ఉపన్యాసాలు విని నచ్చక బాధపడి మధ్యలోనే వచ్చాడు .యుద్ధనిదికి శాస్త్రి డబ్బు ఇవ్వటం ఆయన అభిమానులుఆశ్చర్యపోయారు .దానికి శాస్త్రి ‘’నేను మహాత్మునిలా అహింసా ప్రవక్తనుకాను కానీ నేను శాంతి ప్రేమికుడిని ‘’అన్నాడు యుద్ధం లో బ్రిటన్ జయం పొందకపోతే ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదం అని భావించాడు శాస్త్రి.సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటి వార్ కమిటిలో చేరలేదు అందుకని శాస్త్రి నియమోల్లంఘన చేశాడని భావించారు .ఆయనకున్న సీనియారిటి ని బట్టి చూసీ చూడనట్లున్నారు .అయినా ఆయన సహచారులుమాత్రం అత్యంత గౌరవాభిమానాలతో చూసేవారు .
అలాగే రెండో సారి శాస్త్రి మెజారిటి మార్గాన్ని కాదన్నాడు .SIS అంతటే సర్వెంట్సాఫ్ ఇండియా కమిటి అధ్యక్షుడు కుంజ్రు ఇతర సభ్యులు పాకిస్తాన్ విషయం పై విభేదించాడు వాళ్ళు పాకిస్తాన్ అభిప్రాయానికి లొంగితే త్వరగా ఇండియాకు స్వతంత్రం వస్తుంది అన్నారు .భారత విభజన శాస్త్రికి నచ్చలేదు .బాల్య యౌవన దశలనుంచి నమ్మినడానికి వ్యతిరేకంగా జరగటం ఆయనకు ఇష్టం లెదు .బలహీనమైన ఆరోగ్య౦ తోనే .మరణశయ్యపై ఉన్న శాస్త్రి చివరి ఉత్తరం మహాత్మా గాంధీకి ఇండియా నుంచి పాకిస్తాన్ ను విడకోట్టవద్దని రాశాడు –‘’పంజాబ్ బెంగాల్ లు నాశనమౌతాయి. భారత స్వాతంత్ర్యం కోసం దేశంలో యే భాగాన్నీ త్యాగం చేయద్దు ‘’It is bound to be a lasting enemy and a blistering sore to India . ‘’అని ఆనాడే బాగా ఊహించి చెప్పిన క్రాంతదర్శి శాస్త్రి .ఇండియా విభజన శాస్త్రి చూడలేదు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7 -8-23-. ఉయ్యూరు .
వీక్షకులు
- 1,107,631 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,554)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

