రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -57
వైస్రాయ్ కాంగ్రెస్ తొ యుద్ధానికి తోడ్పడమని జరుపుతున్న చర్చలు అన్నీ శాస్త్రి ఆసక్తిగా గమనిస్తూనే ఉన్నాడు .1940 లోవైస్రాయ్ ఇచ్చిన ‘’ఆగస్ట్ ఆఫర్ ‘’ను కాంగ్రెస్ ,గాంధీ తిరస్కరించారు .గాంధీ కొద్దిమందితో వ్యక్తిగత సత్యాగ్రహం చేయాలనుకొన్నాడు .1942మార్చిలో సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ను రాయబారిగా బ్రిటీష ప్రభుత్వం ఇండియాకు పంపి అందులోయుద్ధం ముగియగానే ఇండియన్ యూనియన్ ఏర్పాటు చేసి పూర్తీ డొమినియన్ స్టేటస్ కల్పిస్తామని ,ఈలోపు జాతీయప్రభుత్వం ఏర్పాటు చేసి అది శాసనసభకు కాక వైస్రాయ్ కి బాధ్యత వహిస్తుందని చెప్పారు .భారతీయుల చిరకాల కోరికలు పూర్తిగా తెలిసిన క్రిప్స్ ఇలా చేయటాన్ని శాస్త్రి బాధపడ్డాడు .దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ‘’క్విట్ ఇండియా ‘’ఉద్యమం లేవదీయగా గాంధి నెహ్రు మొదలైన ముఖ్య జాతీయ నాయకులను అరెస్ట్ అయ్యారు .జాతీయ ప్రభుత్వం ఏర్పడి శాంతి సమావేశంలో మహాత్ముని శాంతి అహింస సిద్ధాంతాలు మహాత్ముడు వినిపిస్తాడని సంతోషించాడు శాస్త్రి .ఒకమహోన్నత రాజకీయ వేత్త చేయరాని పని శాస్త్రి చేస్తూ లార్డ్ వేవెల్ కు ,సెక్రెటరి ఆఫ్ స్టేట్ మిస్టర్ అమెరి కి వైస్రాయ్, గాంధీలకు ఒక ఉత్తరాలు రాసి ప్రెస్ కు రిలీజ్ చేశాడు .ఇవి 24-10-1943న ప్రచురింపబడ్డాయి .అందులో ఒక మహా దీశభక్తునిగా ,అసామాన్య దేశ పౌరునిగా తన ఆవేదన అంతా వెళ్ళబోశాడు శాస్త్రి –‘’ Demand not of our revered leaders that they stand with tears in their eyes at the gates of the Viceroy’s palace and strike penitential palms of aching cheeks .Play the act of magnanimous victor and the healing statesmen .Do not I adjure you ,sow dragons’ teeth on the ancient and swallowed soil to this country ‘’అని ప్రాధేయపడ్డాడు దేశంకోసం ప్రజాస్వామ్యం కోసం దేశ ప్రజల అభివృద్ధికోసం .
వైస్రాయ్ కి రాసిన దానిలో –‘’సెక్షన్ 93రద్దు చేసి శాసన సభలను పునరుద్ధరించి పని చేసేట్లు చేయండి .యుద్ధం పూర్తయిన్దికనుక దోమికకల్ హుడ్ ను సత్వరం ఏర్పాటు చేసి మా ప్రతినిధులు ఇంపీరియల్ కాన్ఫరెన్స్లో ప్రపంచ శాంతి సమావేశంలో గ్రేట్ బ్రిటన్ కెనడా ఆష్ట్రేలియా సౌతాఫ్రికా లతోపాటు తలఎత్తు కొని నిలబడేట్లు చేయండి .ఇది గోప్పపనిగా చరిత్రలో నిలిచిపోతుంది .ఇది మీరు తలచుకొంటే రేపే సాధ్యమౌతుంది .’’For the sun of armistice may suddenly burst through the cloud of war ,brightening the plane and calling upon the nations to tackle the hundred problems of peace ‘’అని హితవు చెప్పాడు .మహాత్ముని రాసిన లెటర్ లో –‘’ప్రియ సోదరా !మంచి అవకాశం వచ్చింది .ఇలాంటిది శతాబ్దాలకొకటి వస్తుందేమో .త్వరలో జరిగేశాంతి సమావేశంలో గాయం బాధపడ్డ దేశాలు న్యాయం ,సౌభ్రాతృత్వం లను జాతి ,రంగు మతాలకు అతీతంగా కోరతాయి .మీరు అక్కడికి తప్పక వెళ్ళి పాల్గొనాలి .మీరు కాకపోతటే ఎవరు వెళ్ళి న్యాయం చేయగలరు మహాత్మా .యుద్ధం ఇక శాశ్వతంగా బహిష్కరి౦ప బడాలిమానవ సంక్షేమం కోసం .ఆనాటి సదవకాశాన్ని జారవిడుచుకొంటారా మీరు .లేదు లేదు వెయ్యి సార్లు లేదు లేదు మీరు తప్పక పాల్గొంటారు ప్రపంచశాంతి పరిరక్షిస్తారు .శాంతివాదం అహింస ఎక్కడైనా ఎప్పుడైనా పలకబడినప్పుడు గాంధీ మాత్రమె గుర్తుకు వస్తారు అన్ని దేశాలలో అందరి ప్రజల మనసులలో .’’What should keep you from bearing irrefragable witness to the truth that you have ever cherished in your heart ,the truth must resound through the ages when your body has perished ?’’అనేక అవమానాలు ఇబ్బందులు బాధలు అనుభవించిన మీకు ‘’The hour of exaltation approaches you .I see you Great Soul in a vision of glory go up the Mount of Expectancy of a weary ,waiting world raise high the right hand of blessing and solemnly utter the word which is in all hearts and which comes full of hope and full of meaning from your inspired lips ‘’.’’ అంటూ నిండు హృదయంతో పరమాత్మను స్తోత్రం చేసినట్లు రైటానరబుల్ శ్రీని వాస శాస్త్రి భారతీయ ఆధ్యాత్మిక అమృత బిందువులను ఒలకబోస్టూ మహాత్మాగాంధీ మహాత్మ్యాన్ని చాటాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-8-23- ఉయ్యూరు .

