రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -59
మహా విద్యావేత్త ,మహా వక్త ,మహా అక్షరార్చకుడు
రైటానరబుల్ శ్రీనివాస శాస్త్రి జీవితం అంతా నేర్చుకొంటూ బోధిస్తూ గడిపాడు.’’బోధించటానికి నేర్చుకో .నేర్చుకోవటానికి బోధించు ‘’అనే ప్రాచీన నానుడిని అనుసరించాడు .పట్టుదలతో జీవితకాలమంతా నేర్చుకొంటూనే ఉన్నాడు.దాన్ని గర్వంగా రంద్రాన్వేషణకు ఉపయోగించలేదు .విద్యాబోధన స్కూల్ టీచర్ అయినా హెడ్మాస్టర్ అయినా వైస్ చాన్సలర్ అయినా ఆయనకు గొప్ప ఆనందమిచ్చేది .జీవితం చివరికాలం లో వాల్మీకి రామాయణం పై అనేకవ్యాసాలు రాశాడు .ఆకాలపు విద్యావిధానాన్ని మెచ్చుకొంటూ ‘’గురు శిష్యులు ఒకే నదిలో స్నానం చేస్తూప్రకృతి పరవశించేట్లు వేద అధ్యయన అధ్యాపనాలు చేస్తూ ,ఆపవిత్ర మంత్రాలు వాతావరణాన్ని పరిశుభ్రపరుస్తూ పవిత్రీకరిస్తుంటే ,ఆకాశంలో బారులు తీరి దేవతాగణ౦ ఆలకించి తరిస్తుంటే ,రాజుల వేట తుపాకుల ధ్వనులు లేకుండా ప్రశాంత గురుకులవాస ౦లొ హోమాలు యజ్ఞయాగాలు ప్రజా సంక్షేమం కోసం జరుగుతుంటే ఆ మహా ప్రశాంత వాతావరణం పవిత్రత దర్శించాలని మనసు పడుతున్నాను ‘’అంటాడు శాస్త్రి పరవశంగా .
18 వ ఏటనే ఫ్రెష్ గ్రాడ్యుయేట్ గా విద్యాబోధన ప్రారంభించాడు శాస్త్రి .’’యవ్వనం స్వర్గం ‘’అని పించింది .ఉత్సాహం ఆనందంతో నే ప్రతిపని చేసేవాడు .తోటి విద్యార్దులకంతటే ఎక్కువ బుద్ధి మంతుడు కనుక తనకు వచ్చింది ఇతరులకు నేర్పాలనే గొప్ప సంకల్పం ఆయనది .టీచర్స్ ట్రెయినింగ్ అయ్యాక ఎవరికీ ఎలా చెప్పాలో అర్ధం చేసుకొన్నాడు .ఉపాధ్యాయులకు శిక్షణ గొప్ప వరం అనే వాడు .హెడ్ మాస్టర్ గా విద్యావిషయక జర్నలిస్ట్ గా ,యూనివర్సిటి బాడీ మెంబర్ గా ,శాసన సభ్యునిగా ,దక్షిణాఫ్రికాలో భారతప్రభుత్వ ఏజెంట్ జెనరల్ గా,,వైస్ చాన్సలర్ గా విస్తృతమైన పరిధులలో సేవ అందించాడు .విద్యా విధానానికి బోధనకు ఆయన ఏమీ కొత్త ఆకర్షణీయ విదాన౦ ప్రవేశ పెట్టలేదు .ఉన్నదాన్ని మెరుగు పెట్టేప్రయత్నం చేశాడు .ఇదే ఆయన సంస్కరణ విధానం .మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో 1938 మార్చి లో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రవేశ పెట్టాలనుకొన్నవార్ధా విధానం కానీ బేసిక్ ఎడ్యుకేషన్ కానీ ముందు గా కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి ఫలితాలుసంతృప్తిగా ఉంటే విస్తరించమని హితవు చెప్పాడు .అప్పటి విద్యావిధానం గుమాస్తాలను తయారు చేయటానికే అనే వాదాన్ని శాస్త్రి ఒప్పుకోలేదు .క్రమాగాతమైన అభివృద్ధి రావాలని ,విద్యాబోధకులతో నిరంతరం చర్చలు జరపాలని చెప్పాడు .లిబరల్ విద్యావిధానమే అందరికి శరణ్యం అన్నాడు .హైగ్రేడ్ టెక్నికల్ ,వొకేషనల్ విద్యా సంస్థలు యేర్పడాల్సిందే కానీ ,వాటిలో సామర్ధ్యత ,తగినంత ఆర్ధిక వనరులు ముందే చూసుకొని ప్రారంభించాలి .వాటికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది .అవి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాయని భావించవద్దు .వారికి ఉద్యోగాలు రాకపోతే వొత్తిడి ఎక్కువై సంఘ వ్యతిరేకులయ్యే ప్రమాదం ఉంది.నిరుద్యోగాన్ని అన్ని ప్రయత్నాలూ చేసి తొలగించాల్సిందే .కనుక విధానాలు బహుజాగ్రత్తగా పకడ్బందీగా ఉండాలి .మన విసుగుదలతో స్కూళ్ళు కాలేజీలు మూసేయ్యకూడదు మొదటికే ప్రమాదం.-The un developed faculties ,idle brains and un directed energies of the young will become a danger to the community ,a hundred times more difficult than the present un employment .పెద్దగా పరిశ్రమలు ఉత్పత్తి విధానాలు నెలకొల్పి ఆర్ధిక అభివృద్ధి సాధించి సరిపడా ఉద్యోగాలు మన యువతకు కల్పించి బంగారు భవిష్యత్తు అందజేయాలి .
మహిళా సంక్షేమం కూడా చాలాముఖ్యం అన్నాడు శాస్త్రి. స్త్రీలు విద్యావంతుఅయితేనే కుటుంబం సమాజం దేశం ప్రగతి సాధిస్తుంది .విద్యాఉద్యోగాలలో స్ట్రీ పురుష భేదం ఉండరాదు .పురుషులకు స్త్రీలకూ ఒకే ధ్యేయంగా ఉండాలి .ఎప్పటికీ స్త్రీని సమాజానికి దూరం చేయరాదు .అనేది శాస్త్రి నిశ్చితాభిప్రాయం.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-8-23-ఉయ్యూరు

