రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -60
ఉపాధ్యాయుల హక్కులను శాస్త్రి ఎప్పుడూ సమర్ధించేవాడు .సౌత్ ఇండియన్ టీచర్స్ గిల్డ్ కు ఒక వ్యాసం రాస్తూ ఉపాధ్యాయుని అవసరం సమాజానికి చాలా ఉందని ఆయన పాత్ర సర్వ శ్రేష్టం అనీ అన్నాడు .వారు ఆదర్శంగా నిబద్ధతతో వ్యక్తిత్వం తోవిధి నిర్వహించాలి ,వారు కాంతి రేఖలై మార్గ దర్శులు గా ఉండాలి..విద్యావిధానంలో మతం జోక్యం చేసుకోకూడదు .అకాడెమిక్ ఫ్రీడం ను ఆయన కోరాడు .యూని వర్సిటియాజమాన్యంలో అధికారుల ప్రాముఖ్యత ఉండరాదు .విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం లో దేవాలయాల వంటి విద్యాలయాలలో పవిత్రత కాపాడాలి అన్నాడు .
ప్రపంచ ప్రసిద్ధ మహా వక్తలలో శాస్త్రి ఒకడు .ఆకాలపు మహా గొప్పనాయకులు ఆయన వక్రుత్వాన్ని విశేషంగా మెచ్చుకొన్నారు .లార్డ్ బాల్ఫార్ శాస్త్రిని ప్రపంచ ప్రసిద్ధ పంచ మహా వక్తలలో ఒకరుగా పేర్కొన్నాడు .ది మాస్టర్ అఫ్ బిల్లిలాల్ ,మిస్టర్ స్మిత్ ‘’శాస్త్రి వచో విధానం విన్నతర్వాత నాకు ఇంగ్లీష్ భాషా సౌందర్యం ఏమిటో తెలిసింది ‘’అన్నాడు .లేడి లిట్తాన్ శాస్త్రిని ‘’మాటల శిల్పి ‘’ ఆర్టిస్ట్ ఆఫ్ వర్డ్స్ -అన్నది .సర్ ధామస్ స్మార్ట్ ‘’The Empire’s silver –tongued orator ‘’అన్నాడు .లాయడ్ జార్జ్ ,స్టాన్లీ బా ల్ద్విన్,డా.హెచ్ ఎ ఎల్ ఫిషర్ మొదలైన మేధావులు శాస్త్రి వాక్ పాండిత్యాన్ని బహుధా మెచ్చారు .ఒక సారి బాల్డ్విన్ శాస్త్రి ప్రసంగం విని ‘’I wish I had made that speech ‘’అని ఉబ్బి పోయాడు ..లండన్ హెరాల్డ్ చీఫ్ ఎడిటర్ తన స్టాఫ్ కు ‘’As the authority for the particular pronunciation of a word in dispute ‘’అని పరిచయం చేశాడు .
శ్రీనివాస శాస్త్రికి ఇంగ్లీష్ భాషపై ,పాండిత్యం పై సంపూర్ణమైన పట్టు ఉంది.ఆయనప్రయోగించే శవ్దాలు దోషరహితమైనవి .పదజాల ప్రయోగం మహదానంద దాయకం .ఆ భాషా ప్రవాహం స్వచ్చంగా ప్రశాంతంగా పవిత్రంగా ఉంటుది అది ఆయన ప్రత్యేకత .ఏనాడు హద్దులు దాటి ఆమహాప్రవాహం ప్రవహించదు .ఆయన పదజాలం ఎంత గొప్పగా ఉంటుందో ఆయన మధ్యమధ్య ఆపే చోట్లు కూడా అంతే అందంగా ఉంటాయి .’’The spell of his cultured eloquence has left a lasting impression in Great Britain, in the Dominions ,and America and Geneva ,and South Africa as well as in our own country .ఆయనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ .తేలికపదాలతో గుండెలను తాకుతుంది ఆయన ప్రసంగం ,మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది .ఎక్కడా తెచ్చిపెట్టుకున్నట్లు ఏదో కస్టపడి పోతున్నట్లు ఇబ్బంది పడుతున్నట్లు ఉండదు. సహజ గంభీరంగా గంగాప్రవాహంగా అంత పవిత్రంగా ఉంటుంది ఆ వాక్ ప్రవాహం .ముచ్చటేస్తుంది విన్నా, చూసినా .ఆయన ఉపన్యాస ధోరణిని ఒకాయన ఇలా వర్ణించాడు –‘’ముందుగా ప్రశాంతంగా లేచి నిలబడుతాడు .ఇబ్బంది లేని విధంగా నెమ్మగా మొదలుపెడతాడు .తర్వాత ఒక భంగిమలో నిలబడి ప్రసంగం పూర్తయ్యే దాకా అలాగే ఉండి పోతాడు .నిటారుగా చక్కగా నిలబడుతాడు .ముందు బల్ల ఉంటే ఒక చేయి దానికి ఆనిస్తాడు లేకపోతె రెండు చేతుల్నీ మర్చే పోతాడు .ఆయన ఉపన్యాసానికి నిలబడితే ఒక ఆర్టిస్ట్ మోడల్ అని పిస్తుంది ఆభంగిమ .శరీర భాగాలు కదల్చడు .ఎప్పుడైనా కనుమలు కదిలిస్తాడు .’’It is a proud bearing ,in the happiest sense of the word –not arrogant but conveying more the quality of dignity ‘’.
వాల్మీకి రామాయణ ప్రవచనం చేస్తున్నప్పుడు శాస్త్రి హనుమ వాగ్వైభావాన్ని శ్రీ రాముడు లక్ష్మణుడికి వివరిస్తూ –‘’అతని శబ్దాలు శక్తి వంతాలు మధుమదురంగా స్నేహాన్ని కోరేట్లు మాట్లాడాడు .మూడు వేదాలు అభ్యసిన్చినట్లు ,వాటిపై పూర్తీ ఆధిపత్యం ఉన్నట్లు ఉన్నాయి అతడి మాటలు .ఉచ్చారణ అనితర సాధ్యంగా ఉంది.పదజాల ప్రవీణుడు అనిపించాడు .చాలా సేపు మాట్లాడినా అందులో ఒక అపశాబ్దం కూడా దొరలక పోవటం విశేషం .మాట్లాడుతున్నప్పుడు ఒకే రీతిలో శారీరక చేష్టలు లేకుండా ఉండటం మరో విశేషం.మరీ ఎక్కువగా మరీ తక్కువ కాకుండా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాడు .అతని మాటలు హృదయ కుహరం నుంచి జాలు వారాయి .చక్కని స్థాయిలో మాట్లాడాడు హెచ్చు తగ్గులు లేవు .అరుపులు లేవు హీన స్వరమూ లెదు .చెప్పాల్సిన విషయం పైననే దృష్టిపెట్టి చక్కగా అర్ధమయేట్లు చెప్పాడు .దేనితర్వాత ఏది చెప్పాలోఅలా చెప్పాడు .అతడు పదాలు ఉచ్చరిస్తుంటే సూటిగా హృదయాలకు తాకెట్లు ఉంది .అతడి ప్రసంగం లో గొప్ప కళ ఉంది .అది నిజంగా కళాత్మక ప్రసంగమే .మాట్లాడుతున్నప్పుడు అతడి శరీర భాగాలు అతడి పూర్తీ అధీనంలో ఉన్నాయి .హనుమమాటలు నా హృదయాన్ని గెలిచాయిపూర్తిగా .సంతోషం కలిగించాయి –‘’An ambassador who has such grace and beauty of speech can win even an enemy rushing towards him with an uplifted sword ‘’ ఇవి హనుమాన్ గురించి చెప్పినా, ఆలక్షణాలన్నీ రైటానరబుల్ శ్రీనివాస శాస్త్రిలో మూర్తీభ వించి ఉన్నాయి .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-8-23-ఉయ్యూరు

