రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -62

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -62

మహోన్నత మనీషి శాస్త్రి

 స్నేహ పవిత్రత శాస్త్రి బాగా గుర్తించాడు గాంధీలాగానే స్నేహధర్మం జీవితాంతం కొనసాగించాడు .స్నేహంలో డిగ్నిటి ఉండరాదు .మానవులు పరిపూర్ణంగా ఉండటం దేవతలకు ఇష్టం ఉండదు ఈర్ష్య పడతారు .స్నేహం లో వ్యాపారం ప్రవేశిస్తే ఇక స్నేహం ఖాళీ .బాల్యం నుంచి ఇతరులకు మంచిచేయటమే ఆయనకు తెలుసు క్షమించటం ఆయన ఉత్తమ గుణం .బాయ్స్కౌట్స్ కు సందేశమిస్తూ తన ఎనిదవ క్లాస్ లో హితోపదేశం నుంచి ఒక శ్లోకం చదివి వినిపించి ,మంచికి మంచి చేయాలని ,చెడు చేసినవారిని గట్టిగా చెడు చేయాలనే ఉందికాని  వారికి కూడా మంచి చేసి మానవత్వం చాటుకోవాలని చెప్పాడు ఆ లేత బుర్రడు .ద్వేషం ,అసూయ ఆయనకు సహాజం గానే లేవు .శత్రువుతో మిత్రునితో చాలా హుందాగా ప్రవర్తిస్తాడు .ఇతరులలోని మంచి గుర్తించి వారిని పొగడటం ఆయనకు బాగా ఇష్టం.రాజకీయ ద్వేషం లేని వాడు .He judged issues and persons strictly on their merits .He showed in his life that a politician couldbe a perfect gentle man .He radiated in every sphere of his life and activity 0sweetness and light .వివాదాలు నేరారోపణ ఆయన నిఘంటువులో లేవు .ఆయన గురువు గోఖలె లాగా శాంతి ,సౌభ్రాత్రుత్వాలే ఆకాంక్షించాడు .తనపై వ్యక్తిగత దూషణచేస్తే సమాధానం ఇచ్చేవాడుకాడు .’’least said ,soonest mended ‘’అనేది శాస్త్రి మోటో .అంటే తక్కువగా మాట్లాడటం ఎక్కువగా సరిదిద్దటం .రాజీ చేయటం ఎక్కువ ఇష్టం .వాటిని చెడుతో తప్పులతో చేయరాదు .వెలుగు కోరే వారికి ఆయన బీకన్ లైట్ .ఎంతటి ఉత్తమ గుణ సంపన్నుడు కాకపొతే శాస్త్రిని మహాత్ముడు –‘’Your criticism soothes me .Your silence makes me nervous ‘’అంటాడు ?

  ఇతరులు చెప్పేది చాలాశ్రద్దగా వింటాడు శాస్త్రి .అవతలి వాడు చెప్పదలచుకోన్నదేమిటో శాస్త్రికి తెలిసినట్లుగా చెప్పే వాడికి తెలీదు అని ఆయన స్నేహితుడు అంటాడు .ఆయనది ముమ్మాటికి లిబరల్ దృక్పధమే .ఆ  కళ్ళ ద్దాలతోనే లోకాన్ని చూస్తాడు  .ఆయన జీవితకాలమంతా మధ్యవర్తిత్వం నెరపటం సరైన రాజీ పరిష్కారం సాధించటం తోనే సరిపోయింది .మిర్జా ఇస్మాయిల్ అన్నట్లు –‘’It was not in him to mediate between good and evil. To mediate yes between powers and peoples and creeds that was his very nature ,to understand and reconcile . But never without candour ,never in condonation of radical evil ‘’అని గొప్పగా చెప్పాడు .

   శ్రీనివాస శాస్త్రి సాధారణ రాజకీయనాయకులతో స్నేహం చేయలేదు .పార్టీలు మార్చలేదు .ఆయన గురించి ఒక మాట చెబుతారు –‘’He never worked in team and that he ploughed a lonely furrow ‘’.ఇది పూర్తి నిజం కాదు .ఆయన ఇతరులతో కలిసి పని చేయటం తన భావాలను తగ్గించుకొని ఉండటం అందరికి తెలుసు .లీడర్షిప్ కోసమో కీర్తికోసమో ఆయన వెంపర్లాడ లెదు –‘’That last infirmity of noble mind ‘’.ఆయన చాలా వినయంగా ఉంటాడు ఆశలేని వాడు .కీర్తి ప్రతిష్టలు ఆయన కోరకుండానే వచ్చిపడ్డాయి .తన స్వంత భావాన్ని గురించి చెబుతూ శాస్త్రి –A diffident un grasping man is generally at a disadvantage ,but luck has been friendly to me ‘’ అని తనను తానూ బాగా ఎస్టిమేట్ చేసుకొన్నాడు .తనకు దొరికిన దానితో సంతృప్తిగా తినటం ఇష్టం .సత్యమే ఎప్పుడూ మాట్లాడుతాడు .తనపై ఆరోపణలు వస్తే కుర్చీ వదిలిపెట్టి వెళ్ళి పోవటానికి సిద్ధంగా ఉంటాడు .విజేతలు దృఢ హృదయులు అంటాడు –conquerors must be made of sterner stuff ‘’అన్నాడు .

  శాస్త్రి మనసు ,బుద్ధి ప్రకాశాత్మకం గా అగాధంగా ఉంటాయి .అవి సంస్కృతం ఇంగ్లీష్ భాషా సాహిత్యాలవలన ఏర్పడ్డాయి .బర్క్ పండితుని  గురించి డాక్టర్ జాన్సన్ చెప్పిన ‘’His stream of mind is perpetual ‘’ఆయన మనో ప్రవాహం నిరంతరశాశ్వతమైనది .అన్నమాటలు రైటానరబుల్ శ్రీనివాస శాస్త్రి కి కూడా చక్కగా వర్తిస్తాయి .ఆయనది నిత్య వసంత సృజనాత్మక ఆలోచన .ప్రతి సమస్యను లోతుకు వెళ్ళి తరచి పరిష్కారం సాధించే మేధస్సు ఆయనది .ఆయనతో పోల్చదగిన నాయకులు లేరనే చెప్పవచ్చు .అలాంటి అరుదైన రత్నమాణిక్యం శాస్త్రి .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-8-23-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.