రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -63(చివరి భాగం )

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -63(చివరి భాగం )

   ప్రతి వ్యక్తీ గౌరవాన్ని వ్యక్తిత్వాన్ని శాస్త్రి గౌరవించాడు .అవతలి వారి తప్పులపై విరుచుకు పడేవాడుకాదు . నెమ్మదిగా చెప్పి మారేట్లు చేసేవాడు .మాట్లాడే స్వేచ్చ అ౦దరికి ఉండాలనే వాడు .తన అధికారాన్ని తప్పనిసరిగా ప్రయోగిన్చాల్సి వస్తే మృదువుగా ,అవతలి వారి అభివృద్ధికి దోహద పడేట్లు ,వారి స్వేచ్చకు ఇబ్బంది కలగకుండా నే ప్రయోగించే వాడు .ఒక స్నేహితుడికి రాస్తూ –‘’Your rules are good for the humdrum ,sin –dreading type .The genius will break through them ,however rigid .It is well he does .If the rules be not rigid from the start several semi –geniuses will show themselves .That is why I am not a martinet  .Not that I love order and discipline less ,but that I love freedom more ‘’అని స్వేచ్చమీద ఆయనకు ఎంతటి మక్కువ ఉందొ వ్యక్తం చేశాడు శాస్త్రి .

  యువకుడు గా  ఉండగా సైన్స్ రచయితలూ మేధావులు అయిన జూలియస్ హక్స్లీ ,జే ఎస్ మిల్ల్స్ ,హెర్బర్ట్ స్పెన్సర్ వంటి వారి రచనలు చదివి అర్ధం చేసుకొన్నాడు .సైన్స్ దాని విధానాలు ఏమిటో అవగాహన అయింది .తరతరాల కర్మకాండ ను ఇష్ట పడలేదు. .ప్రతిదానికి కారణం సాక్ష్యం కోరేవాడు .కానీ నమ్మకం లేనివాడుగా  మరీ రేషనలిస్ట్ గా అవలేదు .’’ఎ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ ’’లో  ‘’అజ్ఞేయవాదం ‘’ తనను ఎలా బాధించిందో చెప్పాడు .పునర్జన్మ పై తన అంతరాత రా లలో ఒక విశ్వాసం నిరంతర ప్రవాహంగా ఉందన్నాడు .లాప్ లేస్ ఒక సారి నెపోలియన్ చక్రవర్తితో ‘’సిస్టం ఆఫ్ సెలెస్టియల్ మెకానిక్స్ ‘’పై చర్చిస్తూ ‘’మీ విధానం లో దేవుడికి ఉన్న ప్రాధాన్యం ఏమిటి ?అని చక్రవర్తి ప్రశ్నిస్తే ‘’ ఈ పరికల్పన –హైపాధిసిస్ పై నాకు ఎప్పుడూ అవసరం కలగలెదు ‘’అన్నాడు .ఇలాంటి నిశ్చయ పూర్వక గర్వ౦ టో ఉన్న సమాధానం శాస్త్రిఎప్పుడూ చెప్ప లెదు . శాస్త్రి అజ్ఞేయవాదం అంటే’ఎగ్నాస్టిజం  మతాన్ని వదిలి పారిపోయేదికాదు.అది నిరంతర అన్వేషణ .విశ్వాసం పై కారణం కున్న అన్వేషణ . భగవద్గీతలోని భక్తియోగం లోని చివరి ఎనిమిది శ్లోకాల వచో మాధుర్యం తనను కట్టి పడేసి౦ది అని  చెప్పేవాడు .వాటిలోని ఆదర్శం హృదయపు లోతుల్లోకి చేరి పరవశం కల్గిస్తుందనే వాడు .ఇంతకన్నా విలువైన సాహిత్యం ప్రపంచం మొత్తం మీద నాకు తెలిసి నంతవరకు లేనే లెదు అన్నాడు ,వాటిని తలచినపుడల్లా తనలో  ఏదో విద్యుత్తు ప్రవహించి తనను  ఉత్తమ స్థితిలోకి చేర్చేది అన్నాడు .అందుకే జీవితాంతం నేను స్వీయ నియంత్రణ పాటించి ఆనదానుభూతి పొందాను .’’అనే వాడు .

  వయోభారం పెరిగిన దగ్గర్నుంచి జీవిత మూల విలువలను తరచి తరచి చూశాడు .మరణం దూర౦గా ఉన్న పుకారు కాదు అది యదార్ధం అనే భావం బలమై పోయింది ఆయనలో .మరణం తర్వాత ఏమిటి ? నేను ఒక నీటి బుడగ లాగా మాయమౌతానా ?’’అనే ప్రశ్న ఆయనను బాగా తొలచింది .మరణానికి మూడేళ్ళ ముందు నుంచి శాస్త్రి ‘’మరణమే సమాప్తమా “’?అనే విషయం పై ఎన్నో ఉపన్యాసాలిచ్చాడు .ఒక ఏడాదిలో చనిపోతాడనగా స్నేహితుడికి రాసిన జాబులో –‘’My intellect refuses to be convinced by the usual evidence in favour of the soul and the future world .So I am internally a man of un fulfilled longing and unhappy ‘’అని తన వ్యధను వెలిబుచ్చాడు .ఒక సారి ఎస్ .సత్యమూర్తి పబ్లిక్ మీటింగ్ లో ‘’ ‘’ హరిశ్చంద్రుడు ఒక హెచ్చరిక కానీ ఎట్టిపరిస్తితులలోను  సత్యమే చెప్పటానికి ఉదాహరణకాదు ‘’అన్నాడు .దానిపై కౌంటర్ ఇస్తూ శాస్త్రి ‘’పురాణ హరిశ్చంద్రుడు నాపై గొప్ప ప్రభావం కల్గించాడు .ఆయనలాగానే నేనూ ఎప్పుడూ సత్యాన్నే పలికాను అదే ఆదర్శంగా జీవించాను .మహాత్మాగాంధీ కూడాంతే  సత్యమూర్తి అన్నట్లు హరిశ్చంద్ర ఒక ఎక్సామ్పుల్ మాత్రమె కాదు ‘’అన్నాడు .

  19-2-1945 గోఖలే జన్మ దినం రోజు తనగురువు గోఖలే జీవితంలోని ఒక ముఖ్యఘట్టం పై ప్రసంగిస్తూ  స్పృహ తప్పాడు శాస్త్రి .డాక్టర్ ని పిలిపించి చికిత్స చేయించారు స్పృహ వచ్చింది .ఇంటికి తీసుకు వెళ్లారు మళ్ళీ స్పృహ కోల్పోయాడు .తన పని అయిపోయిందని తెలుసుకొన్నాడు .వెంటనే అక్కడున్న వారిని భక్తియోగం లో తనకిష్టమైన ఆ ఎనిమిది శ్లోకాలను చదవమన్నాడు .కోలుకున్నాడు .వెంటనే షేక్స్ పియర్ రచనలో ‘’హిజ్ లేటెస్ట్ సెల్ఫ్ అస్సేర్టేడ్ ఇట్సెల్ఫ్ ‘’ పేరా చదవమన్నాడు .శాస్త్రికి విశ్వాసం ఉంది.ఆనమ్మకం తేలికైనదికాదు మహా గాఢమైనది .ఆయన రాస్తూ తనకు అత్యుత్తమ ఫిలాసఫీ మాత్రమె దారి చూపిందని స్వాముల భస్మాలు తీర్ధాలు ప్రవచనాలు కావు అన్నాడు .’’I cannot sign away my judgement in any sphere to another ,however great and worthy ‘’అన్నది శాస్త్రి ఉన్నత ఆదర్శం .He was an exemplar of the highest virtues and his was a life of sacrifice according to the highest standards of our Dharma .ఆయన మానవాతీతుడు .గాంధీలా సత్యప్రేమికుడు శాస్త్రి .శాంతిమార్గం  స్నేహ సౌభ్రాతృత్వాలు పరస్పరసహకారం ప్రేమ లపైనేనడిచాడు.ధర్మమే జయిస్తుంది అనే సంపూర్ణ విశ్వాసం ఆయనది .ప్రపంచమంతా యుద్ధభయంతో అల్లల్లాడుతుంటే ఆయనమాత్రం వీటిపైనే విశ్వాసంతో ఉన్నాడు .1940లో రేడియో లో మాట్లాడుతూ శాస్త్రి –‘’ప్రస్తుత యుద్ధం మానవ విలువలను ధ్వంసం చేస్తోంది .దయా దాక్షిణ్యా లను పాతిపెడుతోంది .క్రూరత్వం వికటాట్ట హాసం చేస్తోంది .మనం ఇండియాలో గోప్పపనులు సాధించాలని అనుకొంటున్నాము .వాటిని రుజుమార్గం లో నిజాయితీగా ,పధ్ధతి ప్రకారంనెమ్మదిగా  తప్పక సాధించాలని కోరుతున్నాం.కంగారుగా చేసిన పని కంగాళీ అవుతుంది .హిట్లర్ విజయాలు ఎంతకాలం నిలుస్తాయో వేచి చూద్దాం .మనకు స్వాతంత్ర్య కిరీటం కావాల్సిందే .కాని దీనికోసం మానవ సంహారం కావాలా ?వద్దు వద్దు .హిట్లర్ లాగా దయకు తలుపులు మూసేసి తప్పు చేద్దామా ?వద్దు .ఈ విశ్వాసమే ఈ ధర్మం పై నమ్మకమే శాస్త్రిని మిగిలిన నాయకులకంటే అత్యుత్తమ నాయకుడిని మహోన్నత వ్యక్తినీ చేసింది .మనీషిని చేసింది .’’His whole of harmonius personality even as the enthralling magnificence and beauty of Taj Mahal  emanates not from the minaret or that dome however exquisite ,but from the ensemble (సమష్టి )అలాగే శ్రీనివాస శాస్త్రి ఆయన నిరాడంబరత వలననే ఆరాధ నీయుడయ్యాడు . ‘’Sastri  was an artist  to the core ,radiating beauty f0rm,harmony and proportion in all he that did and said ‘’అని ఘనమైన నివాళులు అర్పించాడు రచయిత  టి .ఎన్ .జగదీశన్ .

మనవి-  దాదాపు అరవై డెబ్భై ఏళ్లనుంచి రైటానరబుల్ శ్రీనివాస శాస్త్రిని, ఆయన వాగ్ధాటి గురించి వింటూనే ఉన్నాను .కానీ ఆయన జీవితం గురించి  మనజాతిని తీర్చిదిద్దటం లో ఆయన వహించిన అత్యుత్తమ పాత్ర గురించి  ఏమీ తెలీదు .మా  అబ్బాయి శర్మకు చెబితే నెట్ లో వెతికి ఈ పుస్తకం నాకు పంపితే  ఇంత పుస్తకాన్ని అనువాదం చేయగలనా అని సందేహించాను .మావాడు ‘’నాన్నా !ఆయన గురించిఎవరూ తెలుగులో రాయలేదు .మనం రాసి ఆలోటు తీరుద్దాం ‘’అన్నాడు సరే అని మొదలుపెట్టి ఈ 63 ఎపిసోడ్ లు రాసి ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవం నాడు పూర్తి చేశాను .ఇంగ్లీష్ లో ఆయన చెప్పినవి రాసినవి ఆయనగురించి మహత్తరంగా ఇతరులు చెప్పినవి యధాతధంగా ఆ వాక్యాలు ఇంగ్లీష్ లో అలానే ఉంచాను వాటి రామణీయకత  చెడి పోతుందేమో అనే భయం చేత .దీనికి క్షంతవ్యుడను .ముందే చెప్పినట్లు ఈ వ్యాసాల డిజిటల్ పుస్తకాన్ని ఈ రోజే ఆన్ లైన్ ఆవిష్కరణ జరిపి, ఆమహానుభావుడు ‘’రైటానరబుల్ వీ.స్..శ్రీనివాస శాస్త్రికి సరస భారతి అంకితం చేసి ఋణం తీర్చుకొంటో౦ది .

  భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభా కాంక్షలతో –                                                                                                       

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -15-8-23-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.