సత్యవ్రతి శతకం -1వ భాగం
శ్రీ భాగవతుల లక్ష్మీ నారాయణ శాస్త్రి రచించిన ‘’సత్యవ్రతి శతకం ‘’విజయ నగరం శ్రీరామానుజ ముద్రాక్షార శాలలో 1929లో ముద్రించబడింది .దీనికి పీఠిక రాసిన శ్రీ భాగవతుల లింగమూర్తి –విజయనగర సంస్థానాధిపతి శ్రీ ఆనంద గజపతిరాజు ఒక రోజున ‘’సతతము సంతసమొస౦గు సత్యవ్రతికిన్ ‘’అనే సమస్యనిచ్చి దీనిపై శతకం రాయమని సభలోని కవులను పండితులకు కోరాడు .దానికి తాత్పర్య కూడా జతచేయాలని కోరాడు . .మహారాజ కాలేజిలో స౦స్కృతపండితులు శ్రీ భాగవతుల లక్ష్మీ నారాయణ శాస్త్రిగారుకూడాశతకం రాశారు .కానీ అది రాజాస్థానం చేరలేదు .కాలవశంలో అది విస్మృతమైనది .కవిగారు మరణించారు .తర్వాత నలభై ఏళ్లకు తాము ముద్రించినట్లు చెప్పారు .ఈగురుమూర్తిగారే ‘’యా౦బిషన్ ‘’ పేరుతొ ఇంగ్లీష్ లో రాసిన దానిలో కవిగారు సంక్షిప్త రామచరితం ,శ్రీరామ విజయం మొదలైన సంస్కృతకావ్యాలు ఈ శతకం తోపాటు రాశారని శ్రీ బాబూ రావుసహాయంతో దీన్ని ముద్రిస్తున్నామని 28-8—1929 న ఛత్రపూర్ నుంచి తెలియజేశారు .పుస్తకం వెల-అముద్రితం .
ఇది కంద పద్య శతకం .మకుటం -’సతతము సంతసమొస౦గు సత్యవ్రతికిన్’’
కవిగారు క౦ద౦ లో –‘’శ్రిత జన రక్షణ నిత్య –వ్రతదీక్షా తత్పరులగు వారాహీశ్రీ-పతి,వాణీ పతుల కృపన్ – ’సతతము సంతసమొస౦గు సత్యవ్రతికిన్’’అని మొదలుపెట్టి తర్వాత కాండం లో –గణపతి చరణ౦బులకున్ –బ్రణమిల్లుచు సత్యశతక ఫణితికి నై టి-ప్పణమొనరి౦చెదను సుధీ –మణులార వినుండు దీని మన్నించి కృపన్ ‘’అన్నారు టిప్పణి రాస్తూ.ఆశ్రిత రక్షకుడైన గౌరీపతి ,లక్ష్మీ పతి సరస్వతీపతుల కరుణతోసత్యవ్రతునికి సంతోషం ఉప్పొంగుగాక అని భావం చెప్పారు
తర్వాత ‘’రుతి పరుషమయి సరళముగా –నుతభావముగనినప్రాసను నిడి సమస్యా –గతిని సరసులని రెటులన ‘’ –శబ్ద స్వభావం చేత పరుషమైనా సరళమైనా రుజుభావంగా శ్లాఘనీయ ప్రాసాక్షరాలు ఉంచి రసికులను మెప్పించాలి .అలాగే సస్య ధన సంపత్తితో రాజుకు చక్రవర్తికి శ్రోత్రియమునికి సత్యవ్రతునికి ఆనందం కూర్చాలి .త్రిపుటీ శూన్యమైన పరిపూర్ణ బ్రహ్మజ్ఞానం జీవన్ముక్తునికి సత్యవ్రతునికి సంతోషం కలిగిస్తుంది .’’రిత దిమి క ఝేంది౦ధిమి –తతకుందరి ఝెణు తకిట దా౦ ధణత కిణా౦-ధిత ది౦ధిమి యనియాడగ ‘’- నిరర్ధకాలైనా తాల కాల బోధకాలైన సార్ధకాలైన రితధిమి శబ్దాలు ఉచ్చరిస్తూదేవతలు ఆడుతూ సత్యవ్రతునికి సంతోషం కలిగిస్తారు .మరోపద్యంలో సత్యవాక్కుతో మనసుతో క్రియచేత సత్యవ్రతునికి సంతోషం కలిగించాలన్నారు
మరోవిశేష మైన పద్యంలో –‘’కుతపానతిపాతవరీ- వృతదిజ్యా వైశ్వ దేవ,వేదాధ్యయన –ప్రతిభటసూనృత మహిమన్ ‘’-కుతపకాలం దాటకుండా చేసే వైశ్వ దేవాదులకు సమానమైన సత్యమహిమ చేత సత్యవ్రతుడికి సంతోషం కలుగుతుంది .గుడులు తటాకాలు తోటలు మొదలైన వాటికి సమానమైన సత్యమహిమ సత్యవ్రతుడికి సంతోష దాయకం .ఇతిహాస పురాణాల చేత అనుకూలంగాసత్యం అనే జల్లెడ చేత శుద్ధిచేయబడిన గుణాలతో పూజ్యుడికి సంతోషం కలుగుతుంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-8-23-ఉయ్యూరు

