శ్రీ శ్రీనివాస శతకం -2(చివరిభాగం )
సీసపద్యమయమైన శ్రీనివాస శతకం మకుటం –‘’మధు మదన నిరాస కోటి మన్మధ విలాస -శ్రిత మనోవాస జయజయ శ్రీనివాస’’ ‘’
మొదటి సీసం –‘’శ్రీ వనజాలయా ,సేవితాన్ఘ్రి సరోజ –కలిసాధ్వసా క్రాంత కల్ప భూజ –మార్తాండ శతకోటి మహిత దీప్తి కలాప –నవ నవోన్మీల నానద రూప – శంఖ చక్రగదాసి శాంగ్య కీలిత హస్త –ఘనరిపు ధ్వస్త లోక ప్రశస్త –నిఖిల వేదా౦తైక నిలయాంతర విహార –రమణీయ కౌస్తుభ రత్నహార
తే.గీ –రవి సుధాకర నయన క్షీరాబ్ది శయన – ప్రధిత ముని గేయ మామక భాగధేయ –మధు మదన నిరాస కోటి మన్మధ విలాస –శ్రిత మనో వాస జయజయ శ్రీనివాస’’అని మొదలుపెట్టి ‘’జక్కవలతీరు ,గబ్బి గుబ్బల సౌరు ,పచ్చవిల్తుని వాలు మచ్చరంబున దోలు’’పై ఆశతో జీవితం వ్యర్ధం చేసుకొంటారు కొందరు .మనుజ సింహమై పోరి కనక కశిపుని ద్రు౦చావు,వామన మూర్తివై బలిని వంచించి ఆర్తి బాపావు . నిన్ను విడిచి మేము ఎక్కడికీ పోము .పార్ధు నితో మైత్రి చేసి నిఖిలలోక పాలన చేశావు .కలి యుగాంతం లో శబలాఖ్యపురం లో బ్రాహ్మణ కులం లో హరివ్రతుడు ,దేవ ప్రభకు జన్మించి దేవతాగణ౦ చేత నీరాజనాలు అ౦దు కొంటావు .యాముని ,విప్రనారాయణ ,పరాశర విష్ణు చిత్త కూరేశ లను కృపతో చూసినట్లు నన్నూ చూడు .నా ‘’భవ భవాంతరాఘౌఘ మారణాయ –క్రూరతాం హర ద్రాగ్బుధ పారణాయ ‘’అని 117లో చెప్పి చివరి 118వ సీసం లో మంగళం పాడి ,తర్వాతపద్యం లో ఈ శతకాన్ని అంకితం పొందమని ప్రార్ధించారు కవి .చివరి 120 వ సీసం లో –తమది భరద్వాజ గోత్రమని ,శ్రీరామ దేశికునికి లక్ష్మీ నరసమా౦బకు పుత్రుడు అయిన రామానుజుడనని భక్తీ తొ సమర్పించే ఈ శతకాన్ని తప్పులెన్నకుండా స్వీకరించి తరింప జేయమని ‘’ఆడియెన్ దాసోహం ‘’అన్నారు ఆచార్య కవి .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-8-23-ఉయ్యూరు
