సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
‘’అక్షరం లోక రక్షకం ‘’
సరస భారతి 176 వ కార్యక్రమంగా శ్రీకోటగురువరేణ్యుల స్మారక నగదు పురస్కార ప్రదానం
సాహితీ బంధువులకు శుభకామనలు ,ఉపాధ్యాయ దినోత్సవ శుభా కాంక్షలు
సరస భారతి 176వ కార్యక్రమంగా,స్థానిక అమరవాణి హైస్కూల్ సహాయ సహకారాలతో శ్రీ సర్వేపల్లి రాధా కృష్ణ పండితుని జన్మదినోత్సవం –ఉపాధ్యాయ దినోత్సవం నాడు 5–9-23 మంగళవారం 11 గంటలకు అమరవాణి హై స్కూల్ లొ మా గురు వరేణ్యులు శ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి గురు పూజోత్సవం నిర్వహిస్తున్నాము .
ఈ సందర్భంగా ద్వ్యధిక శత(102) వసంత కృష్ణా జిల్లాపరిషత్ ఆదర్శ విశ్రామ ప్రధానోపాధ్యాయులు ,బాడ్మింటన్ ‘’సవ్యసాచి ‘’,ఎందరెందరకో మార్గ దర్శి,సుజన శీలురు –శ్రీ సి.వి.సన్యాసి రాజు గురు మహోదయకులను
వృద్దాప్యం కారణంగా వారు ఉయ్యూరు రాలేనందు వలన ఉదయం 8గం .లకు పటమట న్యు పోస్టల్ కాలని లోని వారి స్వగృహం లో వారిని ప్రత్యేకంగా సరసభారతి, అమరవాణి సంస్థలు చంద్రునికో నూలుపోగుగా సన్మానిస్తాయి ..
తర్వాత కార్యక్రమం ఉయ్యూరులో ఉదయం 11 గం .ల నుంచి జరుగుతుంది .
2023 మార్చి లో లో పదవతరగతి పాసై , అత్యధిక మార్కులు పొందిన పేద ప్రతిభగల బ్రాహ్మణ విద్యార్ధికి , విద్యార్ధినికి మా గురువరేణ్యులు కీ .శే .బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కార౦ శ్రీ సర్వేపల్లి రాదా కృష్ణ పండితుని జన్మదినోత్సవం –ఉపాధ్యాయ దినోత్సవం నాడు 5–9-23 మంగళవారం మా గురుపుత్రులు శ్రీ కోట సోదరులచేతులమీదుగా అందజేయ బడుతుంది .అలాగే శ్రీ కోట మాస్టారి శిష్యులు శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )ఏర్పాటు చేసిన బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కారం పేద ప్రతిభగల ఒక SC విద్యార్ధికి ,ఒక BC విద్యార్ధినికి అంద జేయబడుతుంది .సాహిత్య ,విద్యాభిమానులుఅందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
కార్య క్రమం -5-9-23 సోమ వారం ఉదయం 11.గం.లకు
సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు
ఆత్మీయ అతిధులు -పురస్కార ప్రదాతలు శ్రీ కోట గురుపుత్రులు ,శ్రీ కోట సోదరులు – శ్రీ కోట చంద్రశేఖర శాస్త్రి గారు ,శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గారు ,శ్రీ కోట రామకృష్ణగారు ,శ్రీకోట సీతారామాంజనేయులు గారు .
కార్యక్రమ వివరం
శ్రీ కోట గురువరేణ్యుల ,శ్రీసర్వేపల్లి రాధా కృష్ణన్ చిత్ర పటాలకు పుష్పమాలాలంకరణం
1- శ్రీ కోట సోదరులు ఏర్పాటు చేసిన – శ్రీ కోట గురువరేణ్యులు కీ .శే .శ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం –
ఉయ్యూరు ఫ్లోరా స్కూల్ లో చదివి 2023 పబ్లిక్ పరీక్షలో పదవతరగతి 566/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,శ్రీచైతన్యలో ఇంటర్ చదువుతున్న –
చిర౦జీవి బేతన భోట్ల అభిరాం కు రూ-10,000 (పది వేల రూపాయలు )
2-శ్రీ కోట సోదరులు ఏర్పాటు చేసిన -కీ శే .శ్రీమతి కోట సీతమ్మ గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం
ఉయ్యూరు శ్రీనివాస అక్షరాలయం లోచదివి 2023 పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 520/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,శ్రీనివాస కాలేజిలో ఇంటర్ చదువుతున్న
కుమారి బెల్లం కొండ జ్యోతి స్వరూప – కు రూ-10,000 (పది వేల రూపాయలు )
3-శ్రీ కోట గురు వరేణ్యుల శిష్యులు ,శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )ఏర్పాటు చేసిన
కీ.శే. శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారి స్మారక నగదు పురస్కారం –S.C..విద్యార్ధికి
ఉయ్యూరు ఫ్లోరా హైస్కూల్ లో చదివి ,2023పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 530/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,ఇంటర్ చదువుతున్న
చిరంజీవి జి .సాత్విక్ కు – రూ -6000- (ఆరు వేల రూపాయలు -రూ-5000+ శ్రీ గబ్బిట రామనాధ బాబు అందజేసిన రూ- 1000)
4- కీ శే .శ్రీమతి కోట సీతమ్మ గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం -BC విద్యార్ధినికి
ఉయ్యూరు ఫ్లోరా హైస్కూల్ లో చదివి ,2023పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 589/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఇంటర్ చదువుతున్న
కుమారి టి.హారిక కు- రూ -6000- (ఆరు వేల రూపాయలు – రూ-5000+ శ్రీ గబ్బిట రామనాధ బాబు అందజేసిన రూ- 1000)
5-సరస భారతి ప్రత్యెక బహుమతి
ఉయ్యూరు అమరవాణి హైస్కూల్ లొ చదివి 2023పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో563/600మార్కులు సాధించి,ఇంటర్ చదువుతున్న
కుమారి .కుసుమ సత్య కు రూ -6000- (ఆరు వేల రూపాయలు – రూ-5000+ శ్రీ గబ్బిట రామనాధ బాబు అందజేసిన రూ- 1000)
అంద జేయబడును .
సరస భారతి ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేక సన్మానం
–అమరవాణిలో పని చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులకు
ఉపాధ్యాయ దినోత్సవ మరియు శ్రీ కృష్ణాష్టమి శుభా కాంక్షలతో
జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి
గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు మరియు పివి.నాగరాజు –ప్రిన్సిపాల్ అమరవాణి హైస్కూల్
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు
27-8-23 -22-ఉయ్యూరు

